లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
కోల్‌కతాలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని భారత్ 43.1 ఓవర్లలోనే ఛేదించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూశారు.
ఆయన వయసు 75 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న శరద్ యాదవ్ గురువారం రాత్రి చనిపోయారని ఆయన కుమార్తె ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని ప్రకటించింది. శరద్ యాదవ్‌ను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్యులు పరీక్షించి సీపీఆర్ చేసి ప్రయత్నించినప్పటికీ ఫలించలేదని ఆ ప్రకటనలో వివరించింది.
గురువారం రాత్రి 10:19 గంటలకు శరద్ యాదవ్ చనిపోయినట్లు చెప్పింది.
శరద్‌యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
బీహార్‌లో అధికార జనతా దళ్ యునైటెడ్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న శరద్ యాదవ్.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలగి బీజేపీతో చేతులు కలపటంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని ఎన్‌డీటీవీ తన కథనంలో తెలిపింది.
ఆయన 2018లో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. రెండేళ్ల తర్వాత ఆ పార్టీని లాలుయాదవ్‌కు సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్‌లో విలీనం చేశారు.
శరద్ యాదవ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
శ్రీలంకతో రెండో వన్డే మ్యాచ్‌లో కూడా భారత జట్టు గెలిచింది.
కోల్‌కతాలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని భారత్ 43.1 ఓవర్లలోనే ఛేదించింది.
ఆరంభంలో భారత జట్టు తడబడింది. స్కోరు 33 పరుగులుగా ఉన్నపుడు తొలి వికెట్‌ను, 41 పరుగుల దగ్గర రెండో వికెట్‌ను కోల్పోయింది. రోహిత్ శర్మ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శుభం గిల్ 21 పరుగులు చేసి వెనుదిరిగాడు.
విరాట్ కోహ్లీ సైతం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టు స్కోరు 86 పరుగుల దగ్గర శ్రేయాస్ అయ్యర్ వికెట్ పడింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హార్దిక్ పాండ్యా, కె.ఎల్.రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వారిద్దరూ కలిసి స్కోరును 150 పరుగులు దాటించారు. పాండ్యా 36 పరుగులు చేసి 161 స్కోరు దగ్గర ఔటయ్యాడు.
కె.ఎల్.రాహుల్ 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
అంతకుముందు శ్రీలంక జట్టు 40 ఓవర్లలోనే 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ నువానీడు ఫెర్నాండో తన కెరీర్ తొలి మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేశాడు.
భారత జట్టులో యజువేంద్ర చాహల్ స్థానంలో ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కులదీప్ యాదవ్.. 51 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ సిరాజ్ సైతం 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఉమ్రాన్ మాలిక్ 48 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
శ్రీలంక జట్టులో ఫెర్నాండో 63 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కుశాల్ మెండిస్ 34 పరుగులు, దునిత్ వెల్లాలఘే 32 పరుగులు చేశారు. మొత్తం జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఔటయింది.

విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనలో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.
వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తుండగా రామ్మూర్తి పంతులుపేట వద్ద ముగ్గురు యువకులు రైలుపై రాళ్లు రువ్వారని సీసీ కెమెరాలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
వీరిలో ఒకరు తమిళనాడుకు చెందిన గోశాల శంకర్‌గా గుర్తించారు. గోశాల శంకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ఇతరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్లైఓవర్ కింద కూర్చుని ఉన్న ఈ ముగ్గురు యువకులు ఆకతాయితనంతో రాళ్లు రువ్వినట్టు దర్యాప్తులో వెల్లడయిందని పోలీసులు చెప్పారు.
ఘటనా స్థలంలో ఓ నిందితుడికి సంబంధించిన చెప్పులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్డు షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 అమలును ఈ నెల 23 వరకూ నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.
ఇటీవల కందుకూరు, గుంటూరు నగరాల్లో జరిగిన తొక్కిలాటలో 11 మంది మరణించారు. చంద్రబాబు పాల్గొన్న ఆ రెండు కార్యక్రమాల్లో జరిగిన దుర్ఘటనలతో రోడ్డు షోలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.
ప్రత్యేక సందర్భాల్లో తప్ప, రోడ్డుపై ప్రదర్శనలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదంటూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ జీవో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీంతో కోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీవో అమలు చేయరాదంటూ ఆదేశాలు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Telangana CMO
‘‘పక్షపాత వైఖరి లేని కేంద్ర ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం దేశం ఇలాగే ఉంటుంది’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విమర్శించారు.
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించకపోగా.. కాలు అడ్డం పెడుతోందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ గురువారం నాడు మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
గిరిజనుల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
మహబూబాబాద్ పట్టణ అభివృద్దికి 50 కోట్లు, మరిపెడ, డోర్నకల్, తొర్రూర్ మున్సిపాలిటీలకు 25 కోట్లతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులను కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందువల్లే ఇక్కడ అభివృద్ది సాధ్యం అవుతోందని కేసీఆర్ పేర్కొన్నారు.
వివాదాస్పద ‘సేతుసముద్రం’ ప్రాజెక్టు మీద తీర్మానాన్ని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఆ ప్రాజెక్ట్‌ను కేంద్రం కొనసాగించాలంటూ చెబుతున్న ఆ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
‘రాజకీయ కారణాల వల్ల సేతుసముద్రం ప్రాజెక్ట్‌ను బీజేపీ వ్యతిరేకిస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు ఈ ప్రాజెక్టుకు అనుకూలంగానే ఉన్నారు. కానీ ఆ తరువాత ఆమె అకస్మాత్తుగా మనసు మార్చుకొని ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసు వేశారు.
తమిళనాడు ఆర్థికాభివృద్ధి కోసం ఆ ప్రాజెక్ట్ ఎంతో అవసరం. 1860లో కమాండర్ టేలర్ రూ.50 లక్షలతో సేతుసముద్రం ప్రాజెక్టును ప్రతిపాదించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇందులో సాధ్యాసధ్యాలను పరిశీలించేందుకు కూడా అనుమతించారు.
కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాజెక్ట్ చేపట్టాలి’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలీన్ కేంద్రాన్ని కోరారు.
భారత్, శ్రీలంక దేశాల మధ్య నౌకల రాకపోకలకు దారి ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిందే ‘సేతుసముద్రం’ ప్రాజెక్ట్. అయితే రెండు దేశాల మధ్య రామ్‌సేతు ఉందని, ఈ ప్రాజెక్ట్ వల్ల దానికి నష్టం కలుగుతుందని బీజేపీ వాదిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేరళలోని శబరిమల దేవాలయంలో ‘అరవణం’ ప్రసాదం పంపిణీని వెంటనే నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది.
ప్రసాదంలో వాడే యాలకుల్లో పురుగుమందు అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించడంతో ప్రసాదం పంపిణీని వెంటనే ఆపాలని కోర్టు తన తీర్పులో తెలిపింది.
ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారక అవశేషాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
‘అయ్యప్ప ఆలయానికి యాలకులు సరఫరా చేసే కాంట్రాక్టును ఈ ఏడాది వేరే వాళ్లకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇచ్చింది. దాంతో గత ఏడాది కాంట్రాక్టు దక్కించుకున్న ఇడుక్కిలోని అయ్యప్ప స్పైసెస్ అనే సంస్థ కేరళ హై కోర్టును ఆశ్రయించింది.
బిడ్లు పిలవకుండా, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకుండా ఏకపక్షంగా స్థానిక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారని... వాళ్లు సరఫరా చేసే యాలకుల నాణ్యతను పరిశీలించాలని అయ్యప్ప స్పైసెస్ కోర్టును కోరింది.
కొల్లంలోని సునీల్ అనే వ్యక్తి ఈ ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ఏడాది పండుగల సీజన్‌లో సుమారు 15వేల కేజీల యాలకులను ఆయన సరఫరా చేయనున్నారు.
కోర్టు ఆదేశాల మేరకు ల్యాబ్‌లో పరిశోధించగా ఆ యాలకుల్లో సైపర్‌మెత్రిన్, ఇమిడక్లోప్రిడ్ వంటి హానికారక పదార్థాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
దీంతో ప్రసాదం పంపిణీ ఆపాలని కోర్టు ఆదేశించింది. అయితే తాము చాలా తక్కువ మొత్తంలోనే యాలకులు వాడతామని, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వండుతాం కాబట్టి ఆ హానికారక పదార్థాలు ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపవని ట్రావెన్‌కోర్ దేవస్థానం వాదించింది.
కానీ దేవస్థానం వాదనతో ఏకీభవించని కోర్టు ప్రసాదం పంపిణీ ఆపాలనే తీర్పునిచ్చింది’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
తులసీదాస్ రాసిన ‘రామ్‌చరిత్‌మానస్’ పుస్తకం మీద బిహార్ విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
‘మనుస్మృతి మాదిరిగానే రామ్‌చరిత్‌మానస్ కూడా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టింది’ అని బిహార్ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు.
‘మనుస్మృతి, రామ్‌చరిత్‌మానస్, ఎంఎస్ గోవాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలు సమాజాన్ని విభజించాయి. విద్వేషాలు రెచ్చగొట్టాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టే మనుస్మృతిని కాల్చారు.
కింద వర్గాలు చదువుకుంటే సమాజం విషతుల్యం అవుతుందని చెబుతోంది కాబట్టి రామ్‌చరిత్‌మానస్‌ను వ్యతిరేకించాలి’ అని చంద్రశేఖర్ అన్నారు.
నలంద యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీతోపాటు హిందుత్వ సంస్థలు ఖండించాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని, వెంటనే చంద్రశేఖర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కు స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.