బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ మీద శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెహసీన్ పూనావాలా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లైవ్ కవరేజీ

  1. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలి గాలులు

    చలిలో పాపను ఎత్తుకొని పోతున్న మహిళ

    ఫొటో సోర్స్, ANI

    చలి గాలుల వల్ల ఉత్తర భారతదేశంలో పొగమంచు దట్టంగా అలుముకుంది.

    దిల్లీ, యూపీ, రాజస్థాన్, బిహార్, హరియాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    బిహార్‌లో కొన్ని రైళ్లను రద్దు చేశామని మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

    రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల చలి వల్ల పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.

    మరొక రెండు మూడు రోజులు ఉత్తర భారతదేశంలో వాతావరణం ఇలాగే ఉండొచ్చని వాతావరణశాఖ తెలిపింది. చురులో ఉష్ణోగ్రతలు దాదాపు సున్నాకు పడిపోయాయి.

  2. హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో కరోనా మాక్ డ్రిల్

    దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా మాక్ డ్రిల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సన్నద్ధతను వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు.

    కరోనా కేసులు పెరిగితే హ్యాండిల్ చేసేందుకు ఆసుపత్రి ఎంత వరకు సిద్ధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి తెలిపారు.

    కరోనా కేసులు పెరిగితే వాటి తట్టుకొనేలా కోవిడ్ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకునేందుకు నేడు దేశవ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. అమెరికా: మంచు తుపానుతో సుమారు 56 మంది మృతి

    మంచు తొలగిస్తున్న వాహనం

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో మంచు తుపాను వల్ల ఇప్పటి వరకు సుమారు 56 మంది చనిపోయారు.

    న్యూయార్క్‌లోని బఫెల్లో పట్టణంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ 27 మరణాలు నమోదయ్యాయి.

    ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇదొక ‘ఎమర్జన్సీ’ అని అధికారులు చెబుతున్నారు. విపరీతంగా మంచు పేర్కొని పోవడం వల్ల అత్యవసర సిబ్బంది సాయం అందించడం కూడా కష్టమవుతోందని న్యూయార్క్ గవర్నర్ తెలిపారు.

    ‘బాంబ్ సైక్లోన్’ వల్ల అమెరికాలో మంచు తుపాను రావడంతోపాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. నివాసాలు, దారులు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి.

    బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

  4. నేడు దేశవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్

    కరోనావైరస్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా వైద్యసిబ్బందికి మాక్‌ డ్రిల్ నిర్వహిస్తున్నారు.

    ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

    దేశంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో ఈ మాక్ డ్రిల్ చేపట్టనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. సాంబారు ఎప్పుడు, ఎక్కడ పుట్టింది? చరిత్ర ఏం చెబుతోంది?

    దక్షిణ భారత వంటకం సాంబార్ దేశమంతా ఆదరణ పొందింది. ఇప్పుడు దీని రుచి భారత్ సరిహద్దులు కూడా దాటేసింది.

    సాంబార్ లేని ఇడ్లీ తినలేం. మరి, సాంబార్ చరిత్ర ఏంటి? అది ఎలా పుట్టింది? సాంబార్ అనే మాట ఎలా వచ్చింది?

    ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు మేం ప్రయత్నించాం.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  6. చైనా: విదేశీ ప్రయాణికులకు జనవరి నుంచి క్వారంటైన్ తొలగింపు

    చైనాలో కరోనా నిబంధనలు

    ఫొటో సోర్స్, Getty Images

    విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలు జనవరి 8 నుంచి తొలగించనున్నట్లు చైనా ప్రకటించింది.

    ‘జీరో కోవిడ్ పాలసీ’ విధానాన్ని తొలగించిన చైనా కొద్ది రోజులుగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

    చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, దాంతో పని ఒత్తిడి పెరుగుతోందని వైద్య సిబ్బంది చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  7. హలో ఆల్, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ,వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.