You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

హోరాహోరీ పోరులో విజేత అర్జెంటీనా... షూటౌట్‌లో ఫెయిలైన ఫ్రాన్స్

కొదమ సింహాల మధ్య జరిగిన హోరాహోరీ పోరు‌లో ఇరు జట్లూ సమంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే చేయగా, అర్జెంటీనా 4 గోల్స్ చేసి విజేతగా నిలిచింది.

లైవ్ కవరేజీ

  1. హస్తప్రయోగం చేసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

  2. యాదాద్రి భువనగిరి జిల్లా ఎయిమ్స్ బీబీనగర్‌ను సందర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

    కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్' ప్రారంభోతవ్సానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎయిమ్స్ బీబీనగర్‌కు చేరుకున్నారు.

    కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మన్సుఖ్ మానడవీయకు స్వాగతం పలికారు.

    "దేశంలోని ప్రతి పౌరుడికి, పేద, ధనిక వర్గాల తేడా లేకుండా అందరికీ అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు అందాలి. అందుకే, దేశవ్యాప్తంగా మొత్తం 1.33 లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం" అని మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

  3. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం అనుమతి కోరిన ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రుద్రరాజు

    కాంగ్రెస్ ప్రతినిధి బృందం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, సీఎం జగన్‌ను కోరారు. అందుకు ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

    ఈ ప్రతినిధి బృందంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రులతో పాటు నిపుణులు కూడా ఉంటారని తెలిపారు.

    ప్రాజెక్ట్‌ను సందర్శించి, పనులు ఎంతవరకు వచ్చాయో అంచనా వేయడానికి తప్ప ఇది రాజకీయం చేయడానికి కాదని, అనుమతులు లభించిన వెంటనే వివరాలన్నీ సంబంధిత అధికారులకు తెలియజేస్తామని రుద్రరాజు సీఎంకు రాసిన లేఖలో తెలిపారు.

  4. సోక్రటీస్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు.. ప్రపంచ కప్ గెలవలేకపోయాడు

  5. బ్రిటన్‌కు చైనాతో ముప్పు ఉందని ప్రకటించాలని రిషి సునక్‌ను కోరిన పార్లమెంటరీ కమిటీ

    బ్రిటన్ విదేశాంగ విధానాన్ని సమీక్షించి, చైనాను బ్రిటన్‌కు ముప్పుగా అధికారికంగా ప్రకటించాలని బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీ ప్రధాని రిషి సునక్‌ను కోరింది.

    చైనా మేధో సంపత్తిని దొంగిలిస్తోందని, బ్రిటీష్ పౌరులను బెదిరిస్తోందని, తైవాన్ పట్ల దూకుడుగా వ్యవహరిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హానికరమైన విధానాలను అమలు చేస్తోందని బ్రిటన్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆరోపించింది.

    ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిటన్, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    అయితే, వాణిజ్యం, వాతావరణ మార్పుల విషయంలో బ్రిటన్‌కు చైనాతో భాగస్వామి తప్పదని నిపుణులు అంటున్నారు.

  6. రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా.. జపాన్ కారిడార్‌లో పడవచ్చని ఆందోళన

    ఉత్తర కొరియా ఆదివారం కొరియా ద్వీపకల్పంలోని తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

    ఈ సమాచారాన్ని దక్షిణ కొరియా సైన్యం అందించిందని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

    ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక కారిడార్ వెలుపల పడే అవకాశం ఉందని జపాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి తోషిరో ఇనో అన్నారు.

    ఈ క్షిపణులు 550 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లగలవు. 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని జపాన్ రక్షణ శాఖ తెలిపింది.

    అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి తెలిపారు.

    ఉత్తర కొరియా గురువారం హై థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్‌ని కూడా పరీక్షించింది. ఇది బాలిస్టిక్ క్షిపణిని వేగంగా ప్రయోగించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

    ఈ పరీక్షపై స్వయంగా ఉత్తర కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ దృష్టిపెట్టారు.

    ఉత్తర కొరియా ఈ ఏడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సహా పలు క్షిపణులను పరీక్షించింది. ఇవి అమెరికా వరకు చేరుకోగల సామర్థ్యం ఉన్నవి. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.

  7. హత్యచేసి డెడ్‌బాడీలు ఫ్రిజ్‌లు, సూట్‌కేసులలో పెడుతున్నారు.. ఇలాంటి క్రూరమైన హత్యలకు ఐడియాలు ఎక్కడినుంచంటే..

  8. తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం... 188 పరుగుల తేడాతో గెలుపు

    బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఘోర పరాజయం తరువాత, భారత్ టెస్ట్ సిరీస్‌లో శుభారంభం చేసింది.

    చిట్టగాంగ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

    భారత స్పిన్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్లు పడగొట్టడంతో, తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది.

    రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్ల తీయడంతో బంగ్లాదేశ్‌ను 324 పరుగులకు ఆలౌట్ చేసింది.

    అయిదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించేసింది.