అరుణాచల్: 'తవాంగ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ఎవరూ చనిపోలేదు' - రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, sansad tv
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడారు.
"2022 డిసెంబర్ 9న, తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సేలో చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. కానీ భారత సైన్యం వారిని అడ్డుకుంది. ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. మనవైపు సైనికులు ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. భారత సైనిక కమాండర్లు సకాలంలో జోక్యం చేసుకోవడంతో, చైనా సైన్యం వెనక్కు మళ్లింది" అని రాజ్‌నాథ్ సింగ్ సభకు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"డిసెంబరు 9న, చైనాకు చెందిన పీఎల్ఏ దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే వద్ద వాస్తాధీన రేఖను ఆక్రమించాయి. స్టేటస్ కో మార్చడానికి ప్రయత్నించాయి. మన దళాలు దీన్ని తిప్పికొట్టాయి. పీఎల్ఏ మన భూభాగంలోకి చొరబడకుండా నిలువరించాయి. వారిని వెనక్కు మళ్లేలా చేశాయి" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఈ ఘటన తరువాత డిసెంబర్ 11న ఏరియా స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, ఈ ఘటనపై చర్చించారు. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్దారన్న వాదనలను తిరస్కరించింది. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించమని చెప్పింది" అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అంతకుముందు హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మన భూభాగంలో ఒక అంగుళం భాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు.
"డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్‌లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమాన్ని అభినందిస్తున్నాను" అని అమిత్ షా అన్నారు.