ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
ఎస్ఎస్ రాజమౌళి సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’ రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీతోపాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటునాటు సాంగ్ నామినేట్ అయ్యింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల్లో ఒకరికి బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు ఆ దేశ న్యాయవిభాగం తెలిపింది.
మజీద్ రజా అనే వ్యక్తి భద్రతా దళాలకు చెందిన ఇద్దరిని కత్తితో పొడిచి చంపినట్లు విచారణలో తేలడంతో అతనికి మరణశిక్ష విధించినట్లు వెల్లడించింది.
పోయిన గురువారం కూడా మొహసిన్ షెకారీ అనే వ్యక్తిని ఉరి తీశారు.
హిజాబ్ వ్యతిరేకంగా ఇరాన్‌లో మొదలైన నిరసనలు సుమారు మూడు నెలలుగా సాగుతున్నాయి.

ఫొటో సోర్స్, YEARS
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌పై నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేశారు.
అక్రమ నగదు చెలామణీ కేసులో ఈ ఇద్దరు నటీమణులూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి విలువైన బహుమతులు తీసుకున్నట్లు జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో నోరాను కూడా ఈడీ విచారించింది.
అయితే, తనపై జాక్వెలిన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రస్తుతం నోరా పరువు నష్టం దావా వేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, YEARS
ఎస్ఎస్ రాజమౌళి సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’ రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది.
బెస్ట్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీతోపాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటునాటు సాంగ్ నామినేట్ అయ్యింది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా గత మార్చిలో విడుదలైంది. దీనిలో
ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్‌లు కూడా నటించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 11 నెలల కనిష్ఠ స్థాయిలో 5.88 శాతంగా నమోదైంది.
సోమవారం కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేసింది.
తొలిసారి ఈ నవంబర్ నెలలో రిజర్వు బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్య స్థాయి 2 నుంచి 6 శాతం మధ్యలోకి ఈ ద్రవ్యోల్బణ రేటు దిగొచ్చింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతంగా నమోదైనప్పటి నుంచి ఈ రేటు పెరుగుతూనే ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 7.79 శాతం వద్ద అత్యధిక స్థాయిలను ఈ రేటు చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణ రేటు తగ్గడం వరుసగా ఇది రెండో నెల. అక్టోబర్ నెలలో ఈ రేటు 6.77 శాతంగా నమోదైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో చైనా వ్యాపారవేత్తలు బస చేసిన ఓ గెస్ట్ హౌస్ సమీపంలో పేలుడు సంభవించిందని, కాల్పులు చోటుచేసుకున్నాయని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది.
సెంట్రల్ కాబుల్‌లోని షెహర్ ఎ నూ వద్ద ఈ పేలుడు సంభవించింది.
చైనాకు చెందిన వార్తా ఏజెన్సీ కూడా కాబుల్‌లో చైనీయులు ఉన్న గెస్ట్ హౌస్ సమీపంలో పేలుడు జరిగినట్లు వెల్లడించింది.
కాల్పులు, పేలుడులో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు.
అయితే, చైనా ప్రభుత్వం కానీ, తాలిబాన్లు కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హైదరాబాద్‌లోని ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిశ్చార్జ్ అయ్యారు.
పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తన నివాసం వద్ద ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
దీంతో బలవంతంగా పోలీసులు షర్మిలను ఆదివారం ఆసుపత్రికి తరలించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Pawan Kalyan/Facebook
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించనున్న ‘వారాహి’ వాహనానికి అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు.
వారం క్రితమే రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన వెల్లడించారు.
టీఎస్13ఈఎక్స్8384 అనే నెంబర్‌ను వారాహి వాహనానికి కేటాయించారు. వాహన రంగును ఎమరాల్డ్ గ్రీన్‌గా పేర్కొన్నారు.
సైనిక వాహనాలు వాడే రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ కొద్ది రోజులుగా దాని మీద చర్చ నడిచింది.

ఫొటో సోర్స్, Upasana Konidela/Facebook
నటుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన తొలి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన ట్విటర్ పోస్టులో పేర్కొన్నారు.
2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగింది.
అపోలో హాస్పిటల్స్‌కు చెందిన శోభన కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె ఉపాసన.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.
355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 328 పరుగులకే ఆలవుట్ అయింది.
మార్క్ ఉడ్ 4 వికెట్లు, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీశారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281, రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 202 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది.
తొలి టెస్టులో కూడా 74 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.
ఆఖరిదైన మూడో టెస్ట్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు.
టీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గుజరాత్‌లో బీజేపీ గెలిచింది. 182 సీట్లకు గాను 156 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో వరుసగా ఏడోసారి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
కాంగ్రెస్‌కు 17 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 5 సీట్లు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
కేరళలోని శబరిమల గుడికి రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారు. లక్ష మందికిపైగా భక్తులు దర్శనం కోసం బుక్ చేసుకున్నారు.
సోమవారం 1,07,260 మంది దర్శనం కోసం బుక్ చేసుకున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.