You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీజేపీకి ఒక్క చాన్సివ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాం - బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర భైంసా నుంచి ప్రారంభమైంది. ఈ సభకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దశాబ్దాలుగా చేస్తున్న ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు దొరకనుంది.
ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
వైఎస్ షర్మిల పై దొంగతనం సహా పలు సెక్షన్ల కింద కేసులు, బెయిల్ మంజూరు
గాడిద పాలతో కోట్లు సంపాదిస్తున్న తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు
షర్మిల యోధురాలు.. ఆమె పోరాటం కొనసాగుతుంది: బ్రదర్ అనిల్ కుమార్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను నాంపల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు.
ఈ మేరకు ఆమెను జడ్జి ఇంటికి తీసుకెళ్తున్నారు.
కాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడారు.
షర్మిల యోధురాలని.. ఆమె పోరాటం కొనసాగిస్తారని చెప్పారు.
పోలీసులపై షర్మిల చేయిచేసుకున్నారనడం తప్పని, అది వాస్తవం కాదని ఆయన అన్నారు.
బండి సంజయ్: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్రభైంసా నుంచి ప్రారంభమైంది.
కాగా ఈ సభకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
భైంసా సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరును మైసా(మహిష)గా మారుస్తామని ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అప్పులపాల్జేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని సంజయ్ ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతో పాటు పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.
బీజేపీకి ఒక్క చాన్సిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు సంజయ్.
ధారావి పునరభివృద్ధి ప్రాజెక్ట్ దక్కించుకున్న అదానీ గ్రూప్
ముంబయిలోని ధారావి ప్రాంత పునరభివృద్ధి ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్ దక్కించుకుంది.
ఆసియాలోని పెద్ద మురికివాడల్లో ధారావి ఒకటి.
ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం బిడ్ ఓపెన్ చేశాయి.
మొత్తం మూడు బిడ్‌లు వచ్చినట్లు ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ సీఈవో ఎస్‌వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. మూడింట్లో నమన్ గ్రూప్ వేసిన బిడ్ అర్హత సాధించలేదు.
అదానీ రియాల్టీ రూ. 5,069 కోట్లకు... డీఎల్ఎఫ్ రూ. 2,025 కోట్లకు బిడ్ దాఖలు చేశాయి. అదానీ గ్రూప్ బిడ్ దక్కించకుంది.
ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు చేశారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉన్న ఆయన ఈ రోజు మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వంమంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.
దీంతో ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
జవహర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నెల 30న సాయంత్రం ఆయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారని ఏపీ సమాచార శాఖ వెల్లడించింది.
'మియా' మ్యూజియం: అస్సాంలోని 'ముస్లిం' మ్యూజియంపై వివాదం ఏంటి?
షర్మిళను 10 నిమిషాల్లో విడుదల చేయాలి: వైఎస్ విజయమ్మ డిమాండ్
వైఎస్ షర్మిళ అరెస్ట్ నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు ఆమె ఇంటి వద్దే అడ్డుకున్నారు.
దీంతో ఆమె తన ఇంటి వద్దే ధర్నాకు కూర్చున్నారు.
పది నిమిషాల్లో తన కుమార్తె షర్మిళను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ ఫౌండేషన్: దళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 2.50 లక్షల కానుక... ఈ పథకం గురించి మీకు తెలుసా?
బ్రేకింగ్ న్యూస్, షర్మిల కారు అద్దాలు తెరిచే ప్రయత్నం చేస్తున్న పోలీసులు
ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సొంత వాహనంలోనే వైఎస్ షర్మిల ఉన్నారు. కారు దిగడానికి ఆమె నిరాకరిస్తున్నారు.
ఆమెతో మాట్లాడి కిందకు దించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. లాఠీలతో కారు అద్దాలను కిందకు దించాలని వారు చూస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు షర్మిల తరలింపు
వైఎస్ షర్మిల కూర్చొని ఉన్న కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు లాక్కొని వచ్చారు.
ప్రస్తుతం ఆమె కారులోనే కూర్చొని ఉన్నారు. ఆమెను దిగమని పోలీసు అధికారులు కోరుతున్నారు.
ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిన్న పాదయాత్రలో జరిగిన దాడి ధ్వంసమైన కారును నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, వైఎస్ షర్మిల కారులో ఉండగానే లాక్కొని వెళ్లిన పోలీసులు
పంజాగుట్ట చౌరస్తా వద్ద వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
నిన్న జరిగిన దాడిలో ధ్వంసమైన కారును ఆమె నడుపుకుంటూ ప్రగతి భవన్ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.
ఆమె కారు నుంచి దిగడానికి నిరాకరించారు. దాంతో షర్మిల కారులో ఉండగానే టోయింగ్ లారీ తీసుకొచ్చి ఆ కారును పోలీసులు లాక్కొని వెళ్లారు.
పీరియడ్స్: భారత్‌లో అమ్ముతున్న శానిటరీ ప్యాడ్స్‌లో ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయా... వాటి వల్ల క్యాన్సర్ వస్తుందా?
‘భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మారవు’
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ‘వల్గర్’గా ఉందంటూ ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యల వల్ల భారత్‌తో తమ సంబంధాలు దెబ్బతినవని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలన్ అన్నారు.
అవి ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలనీ కానీ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు అంతకంటే బలమైనవని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆయన అన్నారు.
ఎలాన్ మస్క్: యాపిల్ మీద ట్విటర్ బాస్ ‘యుద్ధం’
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ఇప్పుడు యాపిల్ మీద ‘యుద్ధం’ ప్రకటించినట్లుగా కనిపిస్తోంది.
యాపిల్ సంస్థ గురించి వరుసగా ఆయన ట్వీట్లు చేస్తున్నారు.
యాప్ స్టోర్‌లో ట్విటర్ యాప్‌ను బ్లాక్ చేస్తానని యాపిల్ బెదిరిస్తోందంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
అంతేకాదు ‘వినియోగదారులను ప్రభావితం చేసేలా తాను తీసుకున్న అన్ని సెన్సార్‌షిప్ చర్యలను యాపిల్ బహిర్గతం చేయాలి’ అంటూ మస్క్ ట్విటర్ పోల్ కూడా పెట్టారు.
‘యాప్ స్టోర్‌లో ఏం కొన్నా యాపిల్ 30శాతం ట్యాక్స్‌ను రహస్యంగా విధిస్తోందనే విషయం మీకు తెలుసా?’ అంటూ మరొక ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్.
లైవ్ పేజీకి స్వాగతం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.