You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బీజేపీకి ఒక్క చాన్సివ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాం - బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర భైంసా నుంచి ప్రారంభమైంది. ఈ సభకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్: ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతి పూల సాగు

  2. చంద్రబాబు: నన్ను, లోకేశ్‌ను చంపేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    తనను, తన కుమారుడు లోకేశ్‌ను చంపేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు అన్నారు.

    ఏలూరు జిల్లాలోని దెందులూరులో బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్‌ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.

    లండన్‌ బాబుని శాశ్వతంగా లండన్‌ పంపిస్తా.. ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వైఎస్‌ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్‌ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.

    అత్యున్నత ధర్మాసనం చెప్పినా సీఎం నోరు విప్పకుండా ఉన్నారంటే రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.

    కేంద్రాన్ని మెప్పించి పోలవరానికి అన్ని అనుమతులు తీసుకువస్తే జగన్‌ సీఎం అయ్యాక రివర్స్‌ టెండర్‌ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేసారంటూ ఆరోపించారు.

  3. హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్

  4. 2022-23 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(జులై నుంచి సెప్టెంబర్ వరకు) భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు అంచనాలు 6.3 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    గత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంతో పోల్చితే ఇది తక్కువ.

    గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది.

    అలాగే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చినా వృద్ధిలో భారీగా తగ్గుదల నమోదైంది.

    ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకు జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం నమోదైంది.

  5. అదానీ చేతికి NDTV: దేశంలోని అగ్రస్థాయి న్యూస్ నెట్‌వర్క్‌ను గౌతమ్ అదానీ ఎలా నడపనున్నారు

  6. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

    టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్జేసీ ప్రభాకర్ రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    ప్రభాకర్ రెడ్డి సంస్థలకు చెందిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయన్నది ఆరోపణ. ఈ వ్యవహారంపై ఈడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే దివాకర్ రోడ్ లైన్స్, ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డిలకు సంబంధించిన రూ. 22.1 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

  7. కిమ్ జోంగ్ తన కుమార్తెను ఎందుకు పరిచయం చేశారు, ఆయన ప్లాన్ ఏమిటి?

  8. భారత్ X న్యూజీలాండ్: ఫలితం తేలని మూడో వన్డే... 1-0తో సిరీస్ న్యూజీలాండ్ కైవసం

    భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేకు వాన అంతరాయం కలిగించడంతో ఫలితం తేలలేదు.

    దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-0తో న్యూజీలాండ్ గెలుచుకుంది.

    మూడో వన్డేలో తొలుత టాస్ గెలిచిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

    ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ 18 ఓవర్లలో 104 పరుగుల చేసి ఒక్క వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వాన రావడంతో మ్యాచ్‌ను ఆపేశారు.

    వాన ఆగకపోవడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేక రద్దు చేశారు.

    తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. రెండో వన్డే వాన వల్ల ఆగింది.

  9. చైనాను ‘ప్రపంచ శక్తి’గా మలచిన మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి

  10. తనను రేప్ చేసిన వారిని విడుదల చేయడం మీద సుప్రీం కోర్టుకు బిల్కిస్ బానో

    తనను రేప్ చేసిన 11 మందిని శిక్ష ముగియక ముందే విడుదల చేయడం మీద బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    ఆ 11 మంది శిక్షా కాలం మీద నిర్ణయం తీసుకునేలా ఈ ఏడాది మేలో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చిన అనుమతులను సమీక్షించాలంటూ ఆమెను కోర్టును కోరారు.

    2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేయడంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేశారనే కేసులో 11మందికి జీవితకాల కారాగార శిక్ష విధించారు.

    అయితే ఇటీవలే వారిని సత్పవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.

  11. బ్రేకింగ్ న్యూస్, భారత్ X న్యూజీలాండ్: వానతో ఆగిన మ్యాచ్

    న్యూజీలాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వాన అంతరాయం కలిగించింది.

    ఆట ఆగిపోయే నాటికి న్యూజీలాండ్ 18 ఓవర్లకు 104 పరుగులు చేసింది. ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగులు చేసింది.

  12. డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?

  13. ‘ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ’

    లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం మీద సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు.

    లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులు ఉన్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది. గతంలో ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు నిర్మాత చార్మిని ఈడీ విచారించింది.

  14. షర్మిల అరెస్టు మీద తెలంగాణ గవర్నర్ తమిళసై ఆందోళన

    వైఎస్ షర్మిల కూర్చొని ఉన్న కారును తెలంగాణ పోలీసులు లాక్కుని వెళ్లడం మీద ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై స్పందించారు.

    అలా లాక్కొని వెళ్లిన దృశ్యాలు కలిచి వేశాయని ఆమె అన్నారు. నిన్న జరిగిన ఘటన మీద ఆమె ఆందోళన వ్యక్తం చేశారు అని రాజ్‌భవన్ ప్రకటించింది.

  15. డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

  16. బ్రేకింగ్ న్యూస్, భారత్ X న్యూజీలాండ్: టీం ఇండియా 219 పరుగులకు ఆలౌట్

    న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా 219 పరుగులకు ఆలౌట్ అయింది.

    వాషింగ్టన్ సుందర్ 64 బంతుల్లో 51 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 59 బంతుల్లో 49 పరుగులు చేశాడు.

    మిగతా ప్లేయర్స్ ఎవరూ పెద్దగా రాణించలేదు.

    న్యూజీలాండ్ బౌలర్లలో ఆడం, డార్లీ మిచెల్ 3 వికెట్ల చొప్పున తీశారు.

  17. ‘66 సగటు ఉన్న ఆటగాడిని పక్కన కూర్చోబెడతారా?’

    న్యూజీలాండ్ సిరీస్‌లో సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోక పోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు.

    రిషభ్ పంత్‌ స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

    కొద్ది రోజులుగా రిషభ్ పంత్‌ సరిగ్గా ఆడలేక పోతున్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లోనూ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అయినా మూడో వన్డేకు సంజు శాంసన్‌ను పక్కన పెట్టి రిషభ్ పంత్‌ను తీసుకున్నారు.

    అయితే 4వ స్థానంలో రిషభ్ పంత్ బాగా ఆడుతున్నాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.

    రాహుల్ ద్రావిడ్ విరామం తీసుకోవడంతో ప్రస్తుతం టీం ఇండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.

    వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు.

    ‘4వ స్థానంలో బాగా ఆడాడు అని వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అతను మంచి ప్లేయరే కాకపోతే ఫాం కోల్పోయాడు. గత 11 ఇన్నింగ్సులకు గాను పదింటిలో అతను విఫలమయ్యాడు. వన్డేలలో శాంసన్ సగటు 66. చివరి 5 మ్యాచుల్లో అతను పరుగులు చేశాడు. అయినా బెంచ్‌కే పరిమతమయ్యాడు’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు.

  18. పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడాలంటే హడల్, 17 ఏళ్లుగా విదేశీ జట్లు ఎందుకు భయపడ్డాయి?

  19. భారత్ X న్యూజీలాండ్: 131 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీం ఇండియా

    న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 27.5 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

    కెప్టెన్ శిఖర్ ధవన్‌తో పాటు ఓపెనర్ శుభమన్ గిల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ రాణించలేదు.

    శ్రేయస్ అయ్యర్ మాత్రమే 59 బంతుల్లో 49 పరుగులు చేసి అవుటయ్యాడు.

    న్యూజీలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నీ 3 వికెట్లు తీశాడు.

  20. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం