అమెరికా: ఆకాశంలో ఢీకొని కుప్పకూలిన పురాతన యుద్ధ విమానాలు

ఫొటో సోర్స్, Giancarlo/@giankaizen
రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు పాతకాలపు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలిన ఘోర ప్రమాదం అమెరికాలోని టెక్సస్‌లో జరిగింది.
డాలస్ దగ్గర జరుగుతున్న ఎయిర్ షోలో శనివారం నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో.. ఆ రెండు విమానాలు తక్కువ ఎత్తులోనే ఢీకొనటం, ఒక విమానం సగానికి విరిగిపోవటం కనిపిస్తోంది. అవి కూలిపోయిన తర్వాత భారీ మంట చెలరేగింది.
ఈ రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారు, ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ విమానాల్లో ఒకటి బోయింగ్ బి-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద యుద్ధంలో అమెరికా గెలవటానికి బీ-17 బాంబర్ ప్రధాన పాత్ర పోషించింది.
రెండో విమానం ‘పి-63 కింగ్‌కోబ్రా’ యుద్ధ విమానాన్ని కూడా అదే యుద్ధంలో ఉపయోగించారు. అయితే కేవలం సోవియట్ వాయుసేన మాత్రమే వీటిని యుద్ధంలో ఉపయోగించింది.
అమెరికాలో శుక్రవారం నాడు ‘వెటరన్స్ డే (మాజీ సైనికుల దినోత్సవం) గౌరవార్థం ‘వింగ్స్ ఓవర్ డాలస్ ఎయిర్‌షో’ పేరుతో రెండో ప్రపంచ యుద్ధం సంస్మరణ వైమానిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మూడు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోను 4,000 మంది నుంచి 6,000 మంది వరకూ వీక్షిస్తున్నారు.
విమానాలు ఢీకొని కుప్పకూలటం ‘ఘోర విషాద’మని డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ అభివర్ణించారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యా ఇంకా నిర్ధారణ కాలేదని, అయితే నేల మీద ఎవరూ గాయపడలేదని ఆయన ఒక ట్వీట్‌లో చెప్పారు.










