"బాలీ సదస్సులో, ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం భద్రత, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి కీలక అంశాలపై జీ20 నాయకులతో చర్చిస్తాను" అని బాలీ పర్యటనకు బయలుదేరే ముందు మోదీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
టీ20లో పాకిస్తాన్ ఓడిపోవడంతో పంజాబ్‌లోని మోగాలో విద్యార్థుల మధ్య ఘర్షణలు
పంజాబ్‌లోని మోగాలో ఒక కాలేజీలో టీ20 మ్యచ్ ఫైనల్ చూస్తున్న విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ గెలిచిన తరువాత, బిహార్, కశ్మీర్ విద్యార్థులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారని పోలీసు అధికారులు చెప్పారు. కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారని పీటీఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మోగాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజీ విద్యార్థులు అంతా కలిసి కూర్చుని మ్యాచ్ చూస్తుండగా, పాకిస్తాన్ ఓటమితో బిహార్, కశ్మీర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కొద్దిసేపటికే అది తోపులాటకు దారితీసిందని, ఆపై ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, ఇటుకలతో దాడి చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం కాలేజీకి పోలీసు కాపలా పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
విద్యార్థుల మధ్య ఘర్షణలకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లు రువ్వుకోవడం కనిపిస్తోంది.
స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జస్వీందర్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, “లాలా లజపత్ రాయ్ కాలేజీలో రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఎలాంటి నినాదాలు చేసినట్లు రిపోర్ట్ లేదు" అని చెప్పారు.
అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను ఎలా గుర్తించాలి, ఎల్ఆర్ఎస్‌తో ఉపయోగం ఉంటుందా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కలిసి ఒక టాక్ షోను నిర్వహించనున్నారు.
దీని పేరు 'ది మీర్జా మాలిక్ షో'.
పాకిస్తానీ ఛానల్ 'ఉర్దుఫ్లిక్స్ అఫీషియల్'లో ఈ కార్యక్రమం ప్రసారం రానుంది. ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో టాక్ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కనిపిస్తున్నారు.
'ది మిర్జా మాలిక్ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్‌లో మాత్రమే' అని పోస్టర్’లో రాశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Instagram ముగిసింది
ఈ జంట విడిపోతున్నట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కొత్త టాక్ షో ప్రకటనతో ఈ వదంతులకు తెరపడింది.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ దుబాయ్‌లో స్థిరపడ్డారు. 2018లో వారికి ఇజాన్ పుట్టాడు.
ఈ జంట వివాహ బంధంలో కష్టాలు ఎదుర్కొంటోందని ఒక వారం క్రితం పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, షోయబ్, సానియా దీనిపై స్పందించలేదు. వారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
24 గంటలు గడిస్తేనే ఏ విషయమైనా చెప్పగలం - కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
పెళ్లికి ముందు జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టారా ? అయితే జాగ్రత్త
మళ్లీ వరదలు వస్తే ఈ నగరం తట్టుకోగలదా?
భారత్‌లో జన్మించిన వంద కోట్ల చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది?
ప్లాస్టిక్ ఏరుతూ, చెత్త శుభ్రం చేస్తూ నల్లమల అడవిలో అరుదైన మొక్కలను కాపాడుతున్న పర్యావరణ కార్యకర్త
‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ – పాకిస్తాన్ ఓటమిపై మొహమ్మద్ షమీ ట్వీట్ వైరల్
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. మూడేళ్లలో వరుసగా రెండు ప్రపంచకప్‌లు సొంతం చేసుకున్న ‘క్రికెట్ పుట్టిల్లు’
ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. ‘ఫేస్‌బుక్‌లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన ‘లవర్’
రెండు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి
టీ20 ప్రపంచకప్ ఫైనల్: 20 ఓవర్లలో పాకిస్తాన్ 137/8
ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నిర్ణీత
20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ 38, బాబర్ ఆజమ్ 32, షదాబ్ ఖాన్ 20, మొహమ్మద్
రిజ్వాన్ 15 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్ 2 వికెట్ల
చొప్పున పడగొట్టారు.
టీ-ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్: ఐదు ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు 29/1
ఫొటో సోర్స్, ANI
పురుషుల టీ20
ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్
క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.
టాస్ గెలిచిన
ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఐదు ఓవర్లు
ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది.
మొహమ్మద్
రిజ్వాన్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు.
బాబర్ వజీమ్ (11),
మొహమ్మద్ హారిస్ (0) క్రీజులో ఉన్నారు.
ఫొటో సోర్స్, ANI
ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్‌లో భారత జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
దానికిముందు మరో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
రెండు జట్లూ సెమీ ఫైనల్స్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లతోనే ఫైనల్‌లో తలపడుతున్నాయి.
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్.
హైదరాబాద్: ‘అల్లాహు అక్బర్’ అనాలంటూ తనపై దాడి చేశారని రాష్ట్రపతికి ‘లా’ కాలేజీ విద్యార్థి ఫిర్యాదు - అయిదుగురు విద్యార్థులు అరెస్ట్
సెనేట్‌ను నిలుపుకున్న డెమొక్రాట్లు - రిపబ్లికన్ల వశం కానున్న ప్రతినిధుల సభ
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఈ ఎన్నికల ఫలితాలు ఆశించిన దానికన్నా మెరుగుగా ఉన్నాయని అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తంచేశారు
అమెరికా పార్లమెంటు
అయిన కాంగ్రెస్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎగువ సభ సెనేట్ మీద అధికార డెమొక్రటిక్
పార్టీ పట్టు నిలుపుకుంది. దిగువసభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తుది ఫలితం
ఇంకా తేలలేదు.
డెమొక్రటిక్
పార్టీ, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు చివరివరకూ
తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.
సెనేట్‌లోని మొత్తం
100 సీట్లకు గాను 35 సీట్లకు మంగళవారం నాడు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాల
ప్రకారం నిన్నటివరకూ రెండు పార్టీలూ చెరో 49 సీట్లతో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి.
తాజాగా నెవాడా రాష్ట్ర ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చింది. ఆ రాష్ట్రంలో సెనెటర్
కాథరీన్ కార్టెజ్ మాస్టో తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి ఆడమ్ లాక్సాల్ట్‌ను
ఓడించనున్నట్లు ఫలితాల సరళి చెప్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నెవాడాలో సెనెటర్ కాథరీన్ కార్టెజ్ మాస్టో గెలుపు దిశగా పయనిస్తున్నారు
ఈ విజయంతో 100 సీట్లలో 50 సీట్లు డెమొక్రటిక్ పార్టీకి లభిస్తాయి. రిపబ్లికన్ పార్టీ 49 సీట్లతో నిలుస్తుంది. మరొక రాష్ట్రం జార్జియాకు వచ్చే నెలలో, అంటే డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి.
ఒకవేళ ఆ రాష్ట్రం రిపబ్లికన్ పార్టీ వశమైతే.. సెనేట్‌లో ఇరు పార్టీల బలం 50-50 గా సమమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఉపాధ్యక్షురాలైన కమలా హ్యారిస్ ఓటు నిర్ణయాత్మకమవుతుంది. ఆమె డెమొక్రటిక్ పార్టీ నేత కావటంతో సెనేట్ మీద ఆ పార్టీ పట్టు నిలుస్తుంది.
ఇక ప్రతినిధుల సభలో మొత్తం 435 సీట్లకూ మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో రెండు పార్టీలూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మెజారిటీ మార్కు 218 సీట్లు కాగా.. ఇప్పటివరకూ డెమొక్రటిక్ పార్టీ 204 సీట్లు, రిపబ్లికన్ పార్టీ 211 సీట్లు గెలుచుకున్నాయి. అయితే.. రిపబ్లికన్ పార్టీ అవసరమైన మెజారిటీ సాధిస్తుందని మిగిలిన సీట్ల తుది ఫలితాల సరళి సూచిస్తోంది.
ఈ సభను రిపబ్లికన్లు గెలుచుకున్నట్లయితే.. అధ్యక్షుడు జోబైడెన్ కార్యక్రమాలను వారు కొంత వరకూ అడ్డుకోగలరు.
అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?
రెండున్నరేళ్ల పాటు అంతరిక్షంలో విహరించి వచ్చిన మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్
ఫొటో సోర్స్, ANI
అమెరికాకు
చెందిన ఒక మానవరహిత అంతరిక్ష నౌక అత్యంత సుదీర్ఘ కాలం అంతరిక్షంలో తిరిగిన రికార్డును
నెలకొల్పి శనివారం నాడు భూమికి తిరిగి వచ్చిందని ఆ విమానాన్ని తయారు చేసిన బోయింగ్
సంస్థ తెలిపింది.
‘‘ఎక్స్-37బి
ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ (ఓటీవీ) 908 రోజుల పాటు అంతరిక్షంలో భూ కక్ష్యలో సంచరించి
శనివారం నాడు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌లో దిగింది. ఇదే నౌక గతంలో
780 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి నెలకొల్పిన రికార్డును ఇప్పుడు అధిగమించింది’’
అని బోయింగ్ ఒక ప్రకటనలో వివరించింది.
సౌరశక్తితో
నడిచే ఈ అంతరిక్ష నౌక.. 9 మీటర్ల పొడవు ఉంటుంది. తాజా ప్రయాణానికి ముందు ఐదుసార్లు
సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో విహరించింది.
ఆరోసారి 2020
మే నెలలో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కానవరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి
యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ 5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు.
తాజా ప్రయాణంతో
కలిపి ఈ విమానం ఇప్పటివరకూ మొత్తం 3,774 రోజుల పాటు అంతరిక్షంలో విహరించి, 130
కోట్ల మైళ్లు ప్రయాణించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం ఈ అంతరిక్ష నౌకలో
ప్రయోగాలు నిర్వహిస్తారు.