కెనడాలో హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్.. కుమార్తెకు గాయాలు

పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తుండగా కారుకు యాక్సిడెంట్ జరిగిందని సినీనటి రంభ తెలిపారు. కెనడాలో ఈ యాక్సిడెంట్ జరిగింది.

లైవ్ కవరేజీ

  1. డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

  2. మోర్బీ బ్రిడ్జి: 'బాధ్యులను ఉరి తీయాలి' - ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లి

  3. సామాజిక సేవకురాలు ఇలా భట్ మృతి

    సామాజిక సేవకురాలు ఇలా భట్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రముఖ సామాజిక సేవకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇలా భట్(89) మరణించారు.

    మహిళా సాధికారత కోసం పాటుపడిన ఆమెకు రామన్ మెగససే అవార్డు కూడా లభించింది.

    2016 నుంచి నుంచి సబర్మతి ఆశ్రమం అధ్యక్షురాలిగా ఉన్నారు. మహాత్మ గాంధీ ప్రారంభించిన గుజరాత్ విద్యాపీఠ్‌కు చాన్సెలర్‌గా కూడా పని చేశారు.

    ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

    మహిళల అభ్యున్నతికి ఆమె ఎంతో పాటుపడ్డారని మోదీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ తరువాత ట్రెండ్ అవుతున్న #cheating

    భారత్, బంగ్లాదేశ్ క్రికెటర్లు

    ఫొటో సోర్స్, ANI

    భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ తరువాత #cheating బాగా ట్రెండ్ అవుతోంది.

    ఆఖరి ఓవర్లలో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో భారత్ గెలిచింది.

    అయితే సోషల్ మీడియాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు భారత్ మోసం చేసిందంటూ ఆరోపిస్తున్నారు.

    బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాన వల్ల మధ్యలో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లలో 151గా నిర్ణయించారు.

    అయితే గ్రౌండ్ తడిగా ఉన్నప్పటికీ ఆటను మళ్లీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల భారత్‌కు అంపైర్లు ఫేవర్ చేశారని బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

    ‘వెల్ పెయిడ్ ఇండియా’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. గుజరాత్ తీగల వంతెన మరమ్మతులు చేసిన వాచీల కంపెనీ యజమాని జయ్‌సుఖ్ పటేల్ ఎవరు

  6. దేశంలో పోలీసులందరికీ ఒకే యూనిఫాం.. సాధ్యమేనా

  7. యుక్రెయిన్‌లో అంధకారం

  8. ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’

  9. పాయింట్ల పట్టికలో టీం ఇండియా టాప్, సెమీ ఫైనల్‌కు ఒక్క విజయం దూరంలో

  10. నంద్యాల: ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి

    చల్లా భగీరథ రెడ్డి

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, చల్లా భగీరథ రెడ్డి

    నంద్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(52) మరణించారు.

    ఆయన అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

    చల్లా స్వగ్రామం అవుకులో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రానున్నారు.

    చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ చనిపోవడంతో ఆయన కుమారుడు చల్లా భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

  11. బ్రేకింగ్ న్యూస్, INDvsBAN: మ్యాచ్‌కు వాన అంతరాయం... బంగ్లా స్కోరు 66/0

    ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించింది.

    భారత్ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 7 ఓవర్లకు బంగ్లాదేశ్ 66 పరుగులు చేసింది.

    వికెట్లు ఏమీ కోల్పోలేదు.

  12. అనంతపురం: కూలీల మీద పడిన విద్యుత్ తీగలు... నలుగురు మృతి

    ఆముద పొలం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు ట్రాక్టర్ మీద తెగి పడటంతో అందులో ప్రయాణిస్తున్న కూలీల్లో నలుగురు చనిపోయారు.

    బొమ్మనహళ్ మండలం దర్గా హొన్నూరుకు చెందిన కూలీలు ఆముదం పంటను కోసి ట్రాక్టర్‌లో లోడ్ చేస్తుండగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి కూలీలపై పడ్డాయి.

    దాంతో షాక్ తగిలి నలుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

  13. INDvsBAN: బంగ్లాదేశ్ టార్గెట్ 185 పరుగులు

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లకు భారత్ 184 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది.

    విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సు, 8 ఫోర్లు ఉన్నాయి.

    కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశారు.

  14. బ్రేకింగ్ న్యూస్, టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ

    భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా 16.5 ఓవర్లకు 150 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది.

    విరాట్ కోహ్లీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

    గతంలో ఈ రికార్డు మహేళ జయవర్ధనే (1,016 పరుగులు) పేరిట ఉంది.

    ఈ రికార్డును కోహ్లీ 23 ఇన్నింగ్సుల్లో సాధించాడు.

    ప్రస్తుతం విరాట్ కోహ్లీ(50), దినేశ్ కార్తీక్(7) క్రీజులో ఉన్నారు.

    ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సులు 3 ఫోర్లు ఉన్నాయి.

    మరొక ఓపెనర్ రోహిత్ శర్మ మరొకసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు.

  15. భారత్ జోడో: రాజీవ్ గాంధీ బాటలో రాహుల్ యాత్ర

  16. మోర్బీ వంతెన ప్రమాదం: కడుపులో బిడ్డ సహా తొమ్మిది మందిని కోల్పోయిన కుటుంబం

  17. ఇండోనేసియాలో పిల్లల మరణాలకు కారణమవుతున్న సిరప్

  18. హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో రాజ్‌పుత్‌లు తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యే చాన్సేలేదా?

  19. అధికార బదిలీకి ఓకే చెప్పినా, ఓటమిని ఒప్పుకోని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో

    బోల్సోనారో

    ఫొటో సోర్స్, Reuters

    బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికల్లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా విజయం సాధించారు.

    ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఇద్దరు నేతలలో ఎవరు అధ్యక్ష పీఠం వైపు అడుగులు వేస్తారనే దానిపై స్పష్టత రాలేదు. చివరకు లూలా డ సిల్వాకు 50.9 శాతం, బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి.

    కానీ బోల్సోనారో ఈ ఓటమి గురించి మొదట స్పందించ లేదు. తాజాగా ఆయన తన మౌనాన్ని వీడారు. అయితే, తన తన ఓటమిని మాత్రం అంగీకరించలేదు. అలాగని ఈ ఎన్నికల ఫలితాలను ఆయన సవాల్ చేయలేదు.

    రెండు నిమిషాల పాటు సాగిన బోల్సోనారో సంక్షిప్త ప్రసంగం తర్వాత, అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రస్తుతం ఆయనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పని చేస్తున్న అధికారి వెల్లడించారు.

    బోల్సోనారో ప్రసంగం తర్వాత బ్రెజిల్ సుప్రీంకోర్టు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

    అధికార బదిలీకి ఆమోదం తెలపడం ద్వారా బోల్సోనారో ఎన్నికల ఫలితాలను అంగీకరించారని పేర్కొంది.