కెనడాలో హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్.. కుమార్తెకు గాయాలు

పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తుండగా కారుకు యాక్సిడెంట్ జరిగిందని సినీనటి రంభ తెలిపారు. కెనడాలో ఈ యాక్సిడెంట్ జరిగింది.

లైవ్ కవరేజీ

  1. వరస క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా, వైమానిక దాడులకు చేస్తామని దక్షిణ కొరియా హెచ్చరిక

    ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు

    ఫొటో సోర్స్, Reuters

    ఉత్తర కొరియా కనీసం పది క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటిగా ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం బుధవారం ఉదయం తెలిపింది.

    ఈ బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి దక్షిణ కొరియా సముద్రం సరిహద్దు మీదుగా మొదటిసారి పడింది. దీంతో ఉత్తర కొరియా ద్వీపంపై వైమానిక దాడులు చేస్తామని దక్షిణ కొరియా హెచ్చరించింది.

    ఉత్తర కొరియా క్షిపణులు దక్షిణ కొరియా జలాల సమీపంలో పడటం ఇదే తొలిసారని దక్షిణ కొరియా పేర్కొంది. ఉత్తర కొరియా ప్రయోగం ఏమాత్రం ఆమోదనీయం కాదని దక్షిణ కొరియా అధికారులు స్పష్టం చేశారు.

    ఈ క్షిపణులను ప్రయోగించే ముందు దక్షిణ కొరియా, అమెరికా మధ్య జరుగుతున్న వైమానిక దళ డ్రిల్స్ నిలిపివేయాలని ఉత్తర కొరియా కోరింది.

    అయితే, దక్షిణ కొరియా-అమెరికా మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసే ఏ ప్రయత్నమూ విజయవంతం కాదని ఆయన అన్నారు.

    ఉత్తర కొరియా దూకుడుపై సత్వరమే స్పందిస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యుల్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. అనంతపురం: కూలీల మీద పడిన విద్యుత్ తీగలు, నలుగురు మృతి

  3. T20WorldCup: సెమీ ఫైనల్ రేసులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కడ?

  4. జాన్వీ కపూర్: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’

  5. మోర్బిలో కూలిన బ్రిడ్జిని పరిశీలించి, బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలోని మోర్బి నగరంలో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు.

    అనంతరం బ్రిడ్జి కూలినప్పుడు నదిలో పడిపోయిన ప్రజలను రక్షించిన అధికారులు సిబ్బందిని కలిసి వారిని అభినందించారు.

    అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

    ఈ ఘటనలో ఇప్పటి వరకూ 135 మంది చనిపోగా, చాలామంది గాయాలపాలయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 4

  6. ఖాళీ గిన్నెలు, ప్లేటులు పట్టుకుని చైనా మహిళలు ఈ బాలీవుడ్ పాటను ఎందుకు వైరల్ చేస్తున్నారు?

  7. మోర్బీ బ్రిడ్జి: 150 ఏళ్ల ఈ వంతెన చరిత్ర ఏంటి?

  8. అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    అమరావతి రాజధాని పరిరక్షణ సమితి పాదయాత్రకు అనుమతులు రద్దు చేయాలని ఏపీ పోలీసులు వేసిన పిటీషన్ ని హైకోర్టు తిరస్కరించింది.

    పాదయాత్ర నిర్వహణకు అడ్డంకులు కల్పించవద్దని ఆదేశించింది.

    ప్రభుత్వ పిటీషన్ ని కొట్టివేస్తూ గతంలో ఇచ్చిన అనుమతికి అనుగుణంగా 600 మందితో యాత్ర కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

    ఐడీ కార్డులు ఉన్న వారు మాత్రమే పాదయాత్రలో ఉండాలని తెలిపింది.

    పాదయాత్రకు ఏరూపంలోనయినా సంఘీభావం తెలియజేసే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

    గతంలో విధించిన నిబంధనలు సవరించాలని పరిరక్షణ సమితి తరుపున కోరినప్పటికీ హైకోర్టు అంగీకరించలేదు.

    షరతులకు లోబడి పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపింది.

    డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునయినా పోలీసులకు చూపించాలని ఆదేశించింది.

    కోర్టు ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని తెలిపింది.

    అమరావతి నుంచి అరసవల్లి వరకూ మహాపాదయాత్ర కోర్టు అనుమతితో సాగింది.

    గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు, పశ్చిమ , తూర్పు గోదావరి దాటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకి చేరిన తర్వాత రామచంద్రాపురంలో ఈ యాత్రను నిలిపివేశారు.

    పోలీసుల ఆంక్షల కారణంగా యాత్రను నిలిపివేస్తున్నట్టు దీపావళికి ముందు ప్రకటించారు.

    తాజాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో యాత్ర ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని రైతులు చెబుతున్నారు.

  9. శ్రీరామ్ కృష్ణన్: ఎలాన్ మస్క్ కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఈ సౌత్ ఇండియన్ ఎవరు?

  10. ఒకప్పటి హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్.. కుమార్తెకు గాయాలు

    హీరోయిన్ రంభ కారు

    ఫొటో సోర్స్, Rambha

    పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తుండగా కారుకు యాక్సిడెంట్ జరిగిందని సినీనటి రంభ తెలిపారు. కెనడాలో ఈ యాక్సిడెంట్ జరిగింది.

    ఈ మేరకు మంగళవారం రంభ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

    స్కూలు నుంచి పిల్లలను ఇంటికి తీసుకొస్తుండగా తమ కారు వేరొక కారును ఢీకొట్టిందని ఆమె పేర్కొన్నారు.

    ‘‘యాక్సిడెంట్ అయినప్పుడు కారులో నేను, తన పిల్లలు, (పిల్లల బాధ్యతలు చూసుకునే) నానీ ఉన్నాం. అందరం చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాం. కానీ మా సాషా మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. చెడు రోజులు, చెడు సమయం. మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకెంతో విలువైనవి’’ అని రంభ తన పోస్టులో పేర్కొన్నారు.

    రంభ పోస్టుపై ఒకప్పటి హీరోయిన్లు స్నేహ, మీనా సహా పలువురు సినీ నటులు స్పందించారు.

    విజయవాడలో జన్మించిన రంభ తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సహా పలు భారతీయ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు.

    Rambha

    ఫొటో సోర్స్, Rambha

  11. డ్రై షాంపూలను యూనిలీవర్ ఎందుకు రీకాల్ చేసింది?

  12. మాస్టర్ ప్లాన్ మార్పుతో అమరావతి భవితవ్యం మారిపోతుందా? పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?

  13. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ఆమోదం తెలిపిన ఏపీ గవర్నర్

    ఎన్టీఆర్‌ యూనివర్సిటీ

    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరును 'డాక్టర్‌ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌'గా మార్చేందుకు ఆమోదం తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 21న అసెంబ్లీ, శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టింది. ఉభయ సభలు దీనిని ఆమోదించాయి.

    ఇప్పుడు గవర్నర్ ఆమోదించడంతో ఇది చట్టంగా మారుతుంది.

    ఇప్పటికే ఈ యూనివర్సిటీ పేరు మూడుసార్లు మారింది. ఇప్పుడు నాలుగోసారి మారబోతోంది.

  14. కోమటిరెడ్డి రూ. 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరారా, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆరోపణలేంటి, కోమటిరెడ్డి జవాబేంటి?

  15. చీరలు, దోమతెరల్లాంటి వలలకు మాత్రమే దొరికే అరుదైన చేప

  16. బ్రెజిల్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలలో పైచేయి సాధించిన లూలా డ సిల్వా

  17. మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై నవంబర్ 14న సుప్రీంకోర్టులో విచారణ

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన వంతెన ప్రమాదంపై భారత అత్యున్నత న్యాయస్థానం నవంబర్ 14 ఆదివారం విచారణ చేపట్టనుంది.

    ఈ వంతెన ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 135 మంది చనిపోయినట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేసింది.

    దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

    ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతూ సోమవారం లాయర్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    తివారీ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నవంబర్ 14న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

    ఈ కేసుపై ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాత నిర్మాణాల భద్రతా తనిఖీలు జరపాలని లాయర్ తివారీ తన పిటిషన్‌లో కోరారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి విపత్తు దర్యాప్తు బృందాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఈ పిల్‌ను బీబీసీ చూసింది. పర్యావరణ భద్రత కోసం పాత స్మారక చిహ్నాలు, వంతెనలను సర్వే చేసి, కూలిపోయే ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకను దిశానిర్దేశం చేయాలని తివారీ సుప్రీంకోర్టును కోరారు.

    గుజరాత్

    ఫొటో సోర్స్, BIPIN TANKARIA

    రాష్ట్రాలలో నిర్మాణ సంఘటనల దర్యాప్తు విభాగాలను (కన్స్ట్రక్షన్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సత్వర చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని పిల్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ నిర్మాణాల భద్రత, పర్యవేక్షణ కూడా ఈ విభాగం విధుల్లో భాగం కావాలని కోరారు.

    మోర్బీ బ్రిడ్జి కూలిపోవడంపై తివారీ మాట్లాడుతూ, "ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ అధికారుల బాధ్యతా లోపం, తీవ్ర నిర్లక్ష్యం, పరిపాలన వైఫల్యాని తెలియజేస్తాయి" అన్నారు. అందుకే, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమషంలో పూర్తి విచారణ జరగాలని కోరుతున్నట్టు బీబీసీతో చెప్పారు.

    వంతెన నిర్వహణ, మరమ్మత్తులను ఒక ప్రైవేట్ ఆపరేటర్‌కు అప్పగించారని, వారు ఈ పనిలో పూర్తిగా విఫలమయ్యారని తివారీ పిల్‌లో పేర్కొన్నారు.

    "ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి, ప్రజా సంక్షేమానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని, సుప్రీంకోర్టు ఈ విషయంపై ఒత్తిడి తేవాలని" తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

  18. ట్విట్టర్‌కు తనను తాను సీఈఓగా ప్రకటించుకున్న ఈలాన్ మస్క్

    ట్విట్టర్‌

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఈలాన్ మస్క్

    ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన ఈలాన్ మస్క్ తనను తాను కంపెనీకి కొత్త సీఈఓగా, డైరెక్టర్‌గా నియమించుకున్నారు. సెక్యూరిటీ ఫైలింగ్‌లో కంపెనీ దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది.

    ట్విటర్ కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ కంపెనీలో అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మరికొందరు ఉన్నతాధికారులను తొలగించడంతో ఈ మార్పులు ప్రారంభమయ్యాయి.

    ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించడం ద్వారా మస్క్ తనను తాను కంపెనీకి ఏకైక డైరెక్టర్‌గా మార్చుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దీనితోపాటు, కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి డీలిస్ట్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించింది.

    ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్విటర్ ఒక ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఆ తర్వాత నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా ఉండదు.

    కంపెనీలో అవసరమైన మార్పులు చేసిన తర్వాత, మస్క్ మరోసారి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చని టెక్ వరల్డ్ నిపుణులు ఊహిస్తున్నారు.

    అలాగే, ట్విట్టర్‌లో బ్లూ టిక్‌లను ఉపయోగించేందుకు రుసుము ఉంటుందని మంగళవారం ఈలాన్ మస్క్ తెలిపారు.

    ట్విట్టర్ ప్రారంభం నుంచి ప్రముఖ వ్యక్తులు, సంస్థలకు బ్లూ టిక్‌లను ఇస్తోంది. క్రమంగా సోషల్ మీడియా ప్రపంచంలో ఇదొక ప్రతిష్టగా మారింది. ఇనాళ్లు ఇది ట్విట్టర్లో ఫ్రీగానే లభ్యమవుతూ వచ్చింది. కానీ, మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తరువాత, దానిని చెల్లింపు సేవగా మార్చవచ్చని రిపోర్టులు వచ్చాయి.

    ఇదే వార్తపై వ్యాఖ్యానిస్తూ, అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ ట్వీట్ చేస్తూ, "బ్లూ టిక్ కోసం నేను ప్రతి నెలా 20 డాలర్లు వెచ్చించాలా? నిజానికి, బదులుగా వారే మాకు డబ్బు ఇవ్వాలి. ఇది అమలులోకి వస్తే ఎన్రాన్ లాగా నేను కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోతాను" అన్నారు.

    దీనిపై ఈలాన్ మస్క్ స్పందిస్తూ, "మేము కూడా మా బిల్లులు చెల్లించాలి. ట్విట్టర్ పూర్తిగా ప్రకటనదారులపై మాత్రమే ఆధారపడదు. 8 డాలర్లు అయితే ఓకేనా?" అని అడిగారు.

    "దీన్ని అమలు చేయడానికి ముందే దీని వెనుక కారణాలను సుదీర్ఘంగా వివరిస్తాను. భాట్స్, ట్రోల్స్ నియంత్రించడానికి ఇదొక్కటే మార్గం" అని కూడా ఈలాన్ మస్క్ ట్వీట్ చేశారు.