ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’

2023వ సంవత్సరానికి గాను ఆస్కార్స్‌ బరిలో భారతదేశం తరపునుంచి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ పోటీపడుతోంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందని పీటీఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

లైవ్ కవరేజీ

  1. "ప్రపంచ పునాదులను పేదరికం, ఆకలి, అసమానతలు నాశనం చేస్తున్నాయి" - ప్రియాంక చోప్రా

    ప్రియాంక చోప్రా

    ఫొటో సోర్స్, ANI

    సినీ నటి, యూనిసెఫ్ గుడ్ విల్ రాయబారి ప్రియాంక చోప్రా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు.

    ఆమె ఈ ప్రసంగంలో ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విధ్వంసకర ప్రభావం నుంచి బయటపడేందుకు పోరాడుతున్నాయి. వాతావరణ మార్పులు జీవితాలను, జీవనాధారాలను అతలాకుతలం చేస్తున్నాయి. పోరాటాలు రగులుతున్నాయి. సుదీర్ఘ కాలం పోరాడి నిర్మించుకున్న సమానత్వంతో కూడిన ప్రపంచ పునాదులను పేదరికం, ఆకలి, అసమానతలు నాశనం చేస్తున్నాయి" అని అన్నారు.

    "ప్రపంచంలో పరిస్థితులు మెరుగ్గా లేవని అందరికీ తెలుసు. కానీ, ఈ సంక్షోభాలు అవకాశం కొలదీ ఏర్పడేవి కావు. కానీ, ప్రణాళికతో వాటిని సరిదిద్దుకోవచ్చు. మన దగ్గర ఆ ప్రణాళిక ఉంది" అంటూ ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర లక్ష్యాలను గుర్తు చేశారు.

    ప్రియాంక చోప్రా

    ఫొటో సోర్స్, ANI

    ప్రస్తుతం ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా సంఘీభావం అవసరమని ఆమె అన్నారు.

    ప్రియాంక గాంధీ ఈ సమావేశానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

    ఆధునిక యుగంలో సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను వక్కాణించారు. సుస్థిర అభివృద్ధిని సాకారం చేసేందుకు సమిష్టిగా ఏమి చేయాలో ఆలోచించాలని, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసేందుకు లేదని అన్నారు.

    ప్రియాంక ఒక సంవత్సర కాలంగా యూనిసెఫ్ తో కలిసి పని చేస్తున్నారు.

  2. నోయిడాలో గోడ కూలి నలుగురు మృతి

    జల్ వాయు విహార్ సొసైటీలోని గోడ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు.

    ఫొటో సోర్స్, ANI

    నోయిడాలోని సెక్టర్ 21లో ఉన్న జల్ వాయు విహార్ సొసైటీలోని గోడ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఎన్ డిఆర్ ఎఫ్, అగ్నిమాపక దళాలు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ ప్రచురించింది.

    సొసైటీ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న డ్రైనేజీ మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ గోడ కూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్ వై సుహాస్ చెప్పారు.

    ఈ ఘటన పట్ల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన చికిత్స చేయాలని ఆదేశించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ ఘటన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ మేయర్ లతోవీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ దేశంలో భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  3. యూకే: లెస్టర్‌లో ఉద్రిక్తతలకు సంబంధించి ఒకరికి జైలు శిక్ష

    లెస్టర్‌

    ఫొటో సోర్స్, LEICESTER MEDIA

    యూకేలోని లెస్టర్‌లో చోటు చేసుకున్న హిందూ ముస్లిం ఉద్రిక్తతలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 47 మందిని అరెస్టు చేసారు.

    లెస్టర్‌లో శనివారం రాత్రి కొంత మంది చేసిన నినాదాలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

    లెస్టర్‌కు చెందిన 20ఏళ్ల వ్యక్తి దగ్గర హానికారకమైన ఆయుధం ఉన్నట్లు అంగీకరించడంతో 10 నెలల జైలు శిక్ష విధించినట్లు లెస్టర్ పోలీసులు తెలిపారు.

    గత నెలలో దుబాయ్ లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇక్కడ ఉద్రిక్తతలు మొదలయ్యాయని ఈస్టర్న్ ఐ న్యూస్ పత్రికను ప్రచురిస్తున్న బెర్నీ చౌదరి చెప్పారు.

    ఇంటర్నెట్లో ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారం వల్ల నగరంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయని లెస్టర్ మేయర్ పీటర్ సోల్స్ బై చెప్పారు.

  4. న్యూయార్క్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్

    విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్

    ఫొటో సోర్స్, ANI

    ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచంలో వివిధ దేశాల నాయకులు న్యూ యార్క్ చేరుకుంటున్నారు.

    భారత్ తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఈ సమావేశంలో పాల్గొంటారు.

    ఈ సమావేశంలో రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.

    ఈ సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు హాజరు కావడం లేదు. ఆ దేశాల నుంచి విదేశాంగ మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశానికి సబా కరోసీ అధ్యక్షత వహిస్తున్నారు. ఎస్ జై శంకర్ కరోసీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశంలో జనరల్ అసెంబ్లీ సమావేశ ప్రాధాన్యతలకు భారత్ మద్దతు ప్రకటిస్తుందని ఎస్ జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ బహుళపాక్షిక విధానానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్ జైశంకర్ ట్వీట్ చేసారు.

    ఈ పర్యటనలో భాగంగా ఎస్ జై శంకర్ సెర్బియా, క్యూబా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఈజిప్ట్, మాల్టా, ఆల్బేనియా, ట్రినిడాడ్, టొబాగో, విదేశాంగ శాఖ మంత్రులను కూడా కలిశారు.

  5. అంతరిక్షంలో 437 రోజులు గడిపిన రష్యన్ వ్యోమగామి వలేరీ పోల్యాకోవ్ మృతి

    వలేరీ పోల్యాకోవ్

    ఫొటో సోర్స్, Getty Images

    అంతరిక్షంలో 437 రోజులు గడిపిన రష్యన్ వ్యోమగామి వలేరీ పోల్యాకోవ్ మరణించినట్లు రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.

    ఆయన వయసు 80ఏళ్ళు.

    ఆయన 1994-1995 మధ్యలో మీర్ స్పేస్ స్టేషన్ లోభూమి చుట్టూ 7000 సార్లు పరిభ్రమణం చేస్తూ 437 రోజులు గడిపారు.

    మార్స్ లాంటి గ్రహాలకు దూర ప్రయాణం చేసినప్పుడు వ్యోమగాములు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలరో లేదోననే విషయాన్ని ఆయన పరిశీలించారు.

    14నెలల పాటు చేసిన ఈ ప్రయత్నంలో ఆయన గ్రాహక శక్తికి ఎటువంటి హాని జరగలేదని ఫలితాలు తెలిపాయి.

    ఆయనకు సోవియెట్ యూనియన్ హీరో, యూ ఎస్ ఎస్ ఆర్ పైలట్ వ్యోమగామి అనే బిరుదులు ఉన్నాయి.

    మానవ శరీరానికి అంతరిక్షంలో కూడా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్ధ్యం ఉంటుందని పోల్యా కోవ్ చేసిన పరిశోధన తేల్చిందని అంతరిక్ష సంస్థ రాస్ కాస్మాస్ టెలిగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.

    పోల్యాకోవ్ 1942లో తులాలో మాస్కోలో జన్మించారు.

    ఆయన తొలుత వైద్యం అభ్యసించి, తర్వాత వ్యోమగామిగా మారారు.

    ఆయన1988 ఆగస్టులో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేపట్టి 8నెలలు కక్ష్యలో ఉన్నారు.

    ఆరేళ్ళ తర్వాత అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపి రికార్డు నెలకొల్పారు. ఇప్పటికీ ఈ రికార్డును మరొకరు అధిగమించలేదు.

    1986లో మీర్ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

  6. అమెరికాలో కోవిడ్ అంతం - బైడెన్

    జో బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో కోవిడ్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని డేటా చెబుతున్నప్పటికీ, దేశంలో కోవిడ్ మహమ్మారి అంతమయిందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

    అమెరికాలో కోవిడ్ మహమ్మారి అంతమయిందని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

    కానీ, అమెరికాలో కోవిడ్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

    "మేమింకా సమస్యల్లో ఉన్నాం, కానీ, పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి" అని బైడెన్ అన్నారు

    "కరోనా అంతమవుతున్నట్లు కనిపిస్తోంది" అని గత వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత అన్నారు.

    వైరస్ నియంత్రించేందుకు అమెరికా అనేక చర్యలు తీసుకుంటోందని బైడెన్ సీబీఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

    ఆగస్టులో యూఎస్ అధికారులు జనవరి 2020లో విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అక్టోబరు 13 వరకు పొడిగించారు.

    జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం, ప్రతి రోజు సగటున 400కు పైగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

    గత వారంలో కోవిడ్ సోకి 3000 మందికి పైగా మరణించారు.

    జనవరి 2021లోఒక వారంలో23000 మందికి పైగా మరణించారు.జనాభాలో 65 శాతం మంది పూర్తి వ్యాక్సినేషన్ తీసుకున్నారు.

    కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

  7. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.