బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్‌సీ)ని కూడా అందులో విలీనం చేశారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో తిరిగి మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
‘కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న శశిథరూర్’
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌కు సోనియా గాంధీ అనుమతి ఇచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
ఈమేరకు అనుమతి కోసం ఆయన నేడు సోనియా గాంధీని కలిశారు.
అయితే అందుకు ఎవరి అనుమతి అక్కర్లేదని మరొక సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.
‘కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ. ఖాళీగా ఉంటే ప్రెసిడెంట్ పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అభిప్రాయం కూడా అదే’ అని ఆయన తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
క్వీన్ ఎలిజబెత్ 2 శకానికి తెర
బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్‌సీ)ని కూడా అందులో విలీనం చేశారు.
దేశ ప్రయోజనాల కోసం పోరాడుతున్న బీజేపీలో చేరడానికి ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ అన్నారు.
‘పంజాబ్ సరిహద్దు రాష్ట్రం. పాకిస్తాన్‌తో మన సంబంధాలు దెబ్బతింటున్నాయి. పంజాబ్‌లో అల్లర్లు సృష్టించడానికి అక్కడి నుంచి డ్రోన్లు వస్తున్నాయి. చైనా ఇక్కడకు పెద్ద దూరంలో లేదు. కాబట్టి మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది’ అని ఆయన చెప్పారు.
గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పోయిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేక పోయింది.
పాటియాల నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్ కూడా ఓడిపోయారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?
ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
సత్యేంద్ర జైన్ కేసు విచారణ పై స్టే ఆదేశించిన దిల్లీ కోర్టు

ఫొటో సోర్స్, ANI
దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పై మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబందించి బెయిల్ పిటిషన్ విచారణ పై స్టే ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
సత్యేంద్ర జైన్ కేసును మరొక జడ్జీకి బదిలీ చేయమంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అప్పీలు చేసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్ధన మేరకు ఈ కేసులో నిందితులందరికీ రౌస్ అవెన్యూ కోర్టు జిల్లా జడ్జి నోటీసు జారీ చేశారు.
ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.
ఏమి జరిగింది?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేంద్ర జైన్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఈడీ భారీగా నగదు, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతోంది.
హవాలా లావాదేవీలకు సంబంధించి ఈడీ సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసింది.
సత్యేంద్ర జైన్ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆగస్టు 25, 2017లో సీబీఐకేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా
ఈడీ కూడా సత్యేంద్ర జైన్ పై కేసు నమోదు చేసింది.
సత్యేంద్ర జైన్ నాలుగు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయారని ఈడీ వాదిస్తోంది.
సత్యేంద్ర జైన్ అధీనంలో దిల్లీ వైద్య ఆరోగ్య శాఖ,ఇంధనం, పబ్లిక్ వర్క్స్, పరిశ్రమలు, నగర అభివృద్ధి, వరదలు, జలవనరుల శాఖ కూడా ఉన్నాయి.
ఫరీద్‌కోట్ సంస్థానం: సుమారు రూ.20వేల కోట్ల ఆస్తి వివాదం- సుప్రీంకోర్టులో ఎలా పరిష్కారమైంది, నకిలీ వీలునామాలు ఎలా గుర్తించారు?
కిర్‌గిజ్‌స్తాన్- తజికిస్తాన్ సరిహద్దు ఘర్షణలు - 94 మంది మరణం

ఫొటో సోర్స్, Getty Images
కిర్‌గిజ్‌స్తాన్ - తజికిస్తాన్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో కనీసం 94 మంది మరణించారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇవి దారుణమైనవి.
శుక్రవారం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడానికి ముందు బుధవారం ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి.
మాజీ సోవియెట్ రిపబ్లిక్ లో భాగమైన ఈ రెండు దేశాల మధ్య తరచుగా సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు.
ఇరు దేశాలకు మధ్య సుమారు 1000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో మూడొంతుల సరిహద్దు గురించి తరచూ వివాదం చోటు చేసుకుంటూ ఉంటుంది.
2021లో సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల వల్ల ఇరు దేశాల మధ్య ఊహించని పోరాటానికి దారి తీసింది. ఈ ఘర్షణల్లో సుమారు 50 మంది మరణించారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో సుమారు 100 మంది మరణించారు. మృతుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముంది.
తజికిస్తాన్‍కు చెందిన 35 మంది పౌరులు మరణించగా, కనీసం 20 మందికి గాయాలైనట్లు ప్రకటించింది.
అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఇరు దేశాలు శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
చైనా తైవాన్ పై దాడి చేస్తే అమెరికా తైవాన్ పక్షాన నిలుస్తుంది - జో బైడెన్

ఫొటో సోర్స్, EPA
ఫ్రాన్సెస్ మావో
బీబీసీ న్యూస్
చైనా తైవాన్ పై ఊహించని దాడి చేస్తే అమెరికా తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
ఆయన సీబీఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. అమెరికా సేనలు తైవాన్ ను రక్షిస్తాయా అని ప్రశ్నించినప్పుడు, అవునని సమాధానం చెప్పారు.
ఈ ప్రకటన చేసి తైవాన్ పట్ల అమెరికా విధానాన్ని చాటుకున్నారు.
తైవాన్‌కు అమెరికా రక్షణ కల్పించే విషయం ఎప్పుడూ వ్యూహాత్మక అనిశ్చితితో కూడుకుని ఉంటుంది.
బీజింగ్ తైవాన్‌ను తమ దేశంలో అంతర్భాగంగా భావిస్తుంది.
అమెరికా తైవాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. ఈ దేశంతో దౌత్యపరమైన సంబంధాలేవీ లేవు కానీ తైవాన్ సంబంధాల చట్టాన్ని అనుసరించి తైవాన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తుంది.
తైవాన్ స్వీయ రక్షణ కోసం ఆ దేశానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చాలని అమెరికా వాదిస్తుంది.
లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం

ఫొటో సోర్స్, National Center for Seismology
లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.
ఈ భూకంపం కార్గిల్ కు 64కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం 9.30నిమిషాలకు సంభవించింది.
ఈ భూకంప తీవ్రత భూమిలో 10కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
యూకే: లెస్టర్ లో హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, LEICESTER MEDIA
యూకేలోని లెస్టర్‌లో శనివారం హిందూ ముస్లిం వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
పోలీసులు, స్థానిక నాయకులు ప్రజలను సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ గొడవల్లో ఇరు వర్గాలకు చెందిన యువత ఉన్నారు. ఇప్పటి వరకు ఈ గొడవలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 28న జరిగిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత కూడా ఈ ప్రాంతంలో హింస చెలరేగింది. ఆ తర్వాత ఇటీవలి కాలంలోచోటు చేసుకున్న హింసాత్మక సంఘటన ఇదే.
ఈ ప్రాంతంలో పోలీసు భద్రతను పటిష్టం చేశారు.
"వీధుల్లో మేము చూసిన సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి" అని లెస్టర్ ముస్లిం సంస్థల ఫెడరేషన్ కు చెందిన సులేమాన్ నగ్డీ అన్నారు.
"భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇక్కడ సమస్యలు మొదలయ్యాయి. సాధారణంగా ఇరు దేశాల మధ్య పోటీలు జరిగినప్పుడు ప్రజలు గుమిగూడతారు కానీ, గతంలో ఎన్నడూ ఇంత దారుణమైన పరిస్థితి తలెత్తలేదు" అని అన్నారు.
"ప్రస్తుతానికి శాంతియుత పరిస్థితులు నెలకొనాలి. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలతో మాట్లాడాలి" అని అన్నారు.
శనివారం రాత్రి జరిగిన సంఘటనలు చాలా దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించాయని హిందూ, జైన్ దేవాలయాల ప్రతినిధి సంజీవ్ పటేల్ అన్నారు.
హలో! గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
నేటి వార్తల్లో కొన్ని ముఖ్యాంశాలు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లను విచారణ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపును సవాలు చేస్తూ పార్లమెంట్ సభ్యురాలు మహువా మిత్ర వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించనున్న సుప్రీం కోర్టు
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ప్రశ్నించనున్న దిల్లీ పోలీసు ఆర్ధిక నేరాల విభాగం
చండీగఢ్ లోని ప్రైవేటు యూనివర్సిటీ కేసుకు సంబంధించిన నిందితులను కోర్టులో హాజరుపరచవచ్చు.
