‘పెరియార్’ పేరు పెట్టినందుకు రెస్టారెంట్ మీద హిందుత్వవాదుల దాడి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ‘పెరియార్’ పేరుతో పెట్టిన రెస్టారెంట్ మీద ‘హిందూ మున్నానీ’కి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. పుట్టగానే ఆసుపత్రిలో తారుమారయ్యారు.. ఇరవై ఏళ్ల తరువాత వాళ్లిద్దరే పెళ్లి చేసుకున్నారు

  2. బ్లాక్ వాటర్: టాలీవుడ్, బాలీవుడ్ అందగత్తెలు తాగే ఈ నీటి ప్రత్యేకత ఏమిటి

  3. కృష్ణ వ్రింద విహారి రివ్యూ: ఎక్కడో చూసినట్లుందే అనిపించే సినిమా

  4. ఆంధ్రప్రదేశ్: వాట్సాప్‌లో పోస్టుకు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్, సీఐడీ కుట్ర కేసు ఎందుకు పెట్టింది

  5. నూపుర్ శర్మ కేసులో నావికా కుమార్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు

    నావికా కుమార్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, నావికా కుమార్‌

    మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్‌పై కూడా పలు రాష్ట్రాల నుంచి కేసులు నమోదయ్యాయి.

    తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ క్లబ్ చేయాలని కోరుతూ నావికా కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది.

    నావికా కుమార్‌పై ఉన్న "అన్ని ఎఫ్ఐఆర్‌లను దిల్లీ పోలీస్‌కు చెందిన ఐఎఫ్ఎస్ఓ యూనిట్‌కు తరలించాలని" సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

    దిల్లీ పోలీసు ఐఎఫ్ఎస్ఓ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌నే ప్రధాన కేసుగా తీసుకోవాలని తెలిపింది.

    అంతే కాకుండా, వచ్చే ఎనిమిది వారాల పాటు ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లు లేదా భవిష్యత్తులో నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి నావికా కుమార్‌పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదని వెల్లడించింది.

    జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పులో, “నావికా కుమార్ తనపై దాఖలైన ప్రధాన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది" అని వెల్లడించారు.

    నావికా కుమార్ నిర్వహించిన కార్యక్రమంలోనే నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

  6. మరింత క్షీణించిన రూపాయి విలువ.. డాలరుకు రూ. 81.27

    రూపాయి విలువ క్షీణత

    డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణత కొనసాగుతోంది.

    శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరింత పడిపోయి, కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది.

    డాలర్‌తో రూపాయి మారకంలో ఇదే కనిష్ట స్థాయి. అంటే, మీరు ఇప్పుడు ఒక డాలర్ కొనాలనుకుంటే, దానికి రూ. 81. 27 చెల్లించాల్సి ఉంటుంది.

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడమే రూపాయి పతనానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.

    రూపాయి విలువ నిరంతరం పతనం కావడం భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు విదేశీ పెట్టుబడులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. అలాగే, చమురు దిగుమతులు భారమవుతాయి.

  7. 'నా కూతురు శవాన్ని కూడా నన్ను చూడనివ్వలేదు. ఆమె గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలు'-మహసా తండ్రి ఆవేదన

  8. పీఎఫ్ఐపై ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు .. కేరళలో నేడు బంద్‌

    కేరళ

    ఫొటో సోర్స్, ANI

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సోదాలకు నిరసనగా కేరళలో నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.

    బంద్ సందర్భంగా, కొల్లం జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు పీఎఫ్ఐ మద్దతుదారులు అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారని ఏఎన్ఐ వెల్లడించింది.

    నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు గాయపడ్డారు. చాలా చోట్ల బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గురువారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పోలీను శాఖ, ఈడీలతో కలిసి దేశంలోని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో దాడులు చేసింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ మొత్తం 45 మందిని అరెస్ట్ చేసింది.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు, శిక్షణ ఇస్తున్నట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలతోపాటు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 11 మందిని, కర్ణాటకలో ఏడుగురిని, రాజస్తాన్‌లో ఇద్దరిని, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసింది.

    ఎన్‌ఐఏ సోదాలకు నిరసనగా కోయింబత్తూర్‌లో బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ నింపిన బాటిల్ విసిరారు.

  9. 'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా' - రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్

    కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. నామినేషన్ తేదీని త్వరలో నిర్ణయిస్తానని తెలిపారు.

    "దేశ పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది" అని అశోక్ గహ్లోత్ అన్నట్టు ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. INDvsAUS T20: నేనే తప్పూ చేయలేదు.. నాకేం సంబంధం లేదు- అజారుద్దీన్

  11. టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?

  12. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు... తెలుగు రాష్ట్రాల్లో అయిదుగురి అరెస్ట్

    దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గురువారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పోలీస్ శాఖ, ఈడీలతో కలిసి సంయుక్తంగా దేశంలోని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో దాడులు చేసింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ మొత్తం 45 మందిని అరెస్ట్ చేసింది.

    ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అయిదుగురు ఉన్నారు. తెలంగాణకు చెందిన అబ్దుల్ వరీస్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్, అబ్దుల్ వహీద్ అలీ, షేక్ జఫ్రుల్లా, రియాజ్ అహ్మద్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు, శిక్షణ ఇస్తున్నట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలతోపాటు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

    తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 11 మందిని, కర్ణాటకలో ఏడుగురిని, రాజస్తాన్‌లో ఇద్దరిని, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్

  14. బ్రేక్‌డాన్స్‌ ఓ క్రీడ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?

  15. ఆంధ్రప్రదేశ్: నవంబర్ 1నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఫ్లెక్సీలపై నిషేధం

    ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.

    తాజా ఉత్తర్వుల ప్రకారం ఏపిలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి ఉండదని తెలిపింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శన పైనా నిషేధం విధించింది.

    ఈ నిషేధం అమలు చేయాల్సిన బాధ్యతలు కూడా నిర్దేశించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది. గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిషేధం అమలు పర్యవేక్షణ బాధ్యత పోలీస్‌, రవాణా, జీఎస్టీ శాఖలు తీసుకోవాలని తెలిపింది.

    ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొంది.

  16. అల్జీమర్స్‌ లక్షణాలు ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  17. రూపాయి ఎందుకు పడిపోతోంది?

    బీబీసీ తెలుగు కార్టూన్
  18. హిజాబ్ ధరించని మహిళలను ‘వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?

  19. ఆంధ్రప్రదేశ్: హెల్త్ యూనివర్సిటీకి మూడోసారి పేరు మార్పు.. అభ్యంతరాలు ఎందుకు? ఇబ్బందులు ఏంటి?

  20. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్‌టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్

    ఫొటో సోర్స్, Facebook/JrNTR

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం మీద సినీనటుడు జూనియర్ ఎన్‌టీఆర్ స్పందించారు.

    ‘ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.

    ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు. అలాగని ఎన్‌టీఆర్ స్థాయిని తగ్గించదు.

    విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం ద్వారా ఎన్‌టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’ అని జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు.