'మనీష్ సిసోడియాను ఇంకో రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయవచ్చనిపిస్తోంది'- అరవింద్ కేజ్రీవాల్
గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పెరుగుతోందని, ఈ అంశమే మనీష్ సిసోడియాను అరెస్టు చేసేందుకు సీబీఐపై ఒత్తిడి చేస్తోందని అన్నారు.
లైవ్ కవరేజీ
బ్రేకింగ్ న్యూస్, బీజేపీ నేత, సినీ నటి సోనాలి ఫోగట్ గుండె పోటుతో మృతి
ఫొటో సోర్స్, Sonali Phogat
బీజేపీ నేత, సినీ నటి సోనాలి ఫోగట్ గుండె పోటుతో
చనిపోయారు. ఆమె తన సిబ్బందిలో కొందరితో కలిసి గోవా వెళ్లారని, అక్కడ చనిపోయారని
వార్తలు వచ్చాయి.
హరియాణా గత అసెంబ్లీ ఎన్నికల్లో సోనాలి ఫోగట్
బీజేపీ అభ్యర్థిగా.. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ (మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు) మీద పోటీ చేసి ఓడిపోయారు.
కుల్దీప్ బిష్ణోయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి
బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సోనాలి ఫోగట్‌ను కూడా కలిశారు.
సోనాలి ఫోగట్ రియాలిటీ షో బిగ్ బాస్ – 14లో కూడా
పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు, బళ్ల సతీష్, బీబీసీ ప్రతినిధి
ఫొటో సోర్స్, ANI
మహమ్మద్ ప్రవక్త మీద అవమానకర వ్యాఖ్యలు చేశారన్న
అభియోగం మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్
చేశారు.
ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ పై కొన్ని వ్యాఖ్యలు
చేస్తూ రాజాసింగ్ విడుదల చేసి వీడియో వివాదాస్పదం అయింది. సోమవారం రాత్రి నుంచి
పాత నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, కూడళ్లలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాజా సింగ్ ను
అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఐపీసీ సెక్షన్లు 295(ఎ), 153(ఎ) సహా పలు
సెక్షన్ల కింద రాజాసింగ్ మీద కేసు హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం
రాజాసింగ్‌ను ఆయన కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఇటీవల మునావర్ ఫారూఖీ అనే ఒక స్టాండప్ కమెడియన్
హైదరాబాద్‌లో షో నిర్వహించారు. దాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్ ప్రయత్నించారు.
అప్పుడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
రాముడు, సీతపై మాట్లాడిన ఫారూఖీ షోను హైదరాబాద్‌లో అనుమతిస్తే, ఆగస్టు 23న తాను కూడా ఒక కామెడీ షో చేస్తానని, ఆ తరువాత దేశం మొత్తం మతపరమైన వాతావరణం
వస్తుందని అప్పుడు రాజా సింగ్ హెచ్చరించారు.
ఫొటో సోర్స్, UGC
ఆ క్రమంలోనే రాజా సింగ్ వీడియో విడుదల చేశారు. 10 నిమిషాల పైనే నిడివి ఉన్న వీడియోలో ఫారూఖీని బూతులు తిట్టారు. తరువాత మహమ్మద్ ప్రవక్త పేరును ప్రత్యక్షంగా చెప్పకుండా, పరోక్షంగా అర్థం వచ్చేలా అనేక వ్యాఖ్యలు చేశారు. మునావర్ ఫారూఖీ షోను హైదరాబాద్‌లో అనుమతించడానికి నిరసనగానే తాను ఈ వీడియో చేస్తున్నట్టుగా చెప్పారు రాజాసింగ్.
మరోవైపు పాత నగరంలోని పలు చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మత కలహాలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
బండి సంజయ్ అరెస్ట్...
మరోవైపు.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు.
దిల్లీ లిక్కర్ కేసులో
ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన బీజేపీ కార్యకర్తల అరెస్టులపై సంజయ్
నిరసన తెలపడంతో ఆయననూ అరెస్ట్ చేశారు.
ఎన్నడూ తుపాకీ పట్టని నా బిడ్డను యుక్రెయిన్‌లో యుద్ధానికి పంపారు - రష్యాకు చెందిన ఓ అమ్మ ఆవేదన
బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - బ్రెజిల్‌లో ఏం జరుగుతోంది
డోనాల్డ్ ట్రంప్: ‘ఎఫ్‌బీఐ దర్యాప్తును నిలిపివేయాలి’ - ఫ్లోరిడా కోర్టులో మాజీ అధ్యక్షుడి కేసు, మాక్స్ మాట్జా, బీబీసీ న్యూస్
ఫొటో సోర్స్, REUTERS
అమెరికా మాజీ
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. అమెరికా న్యాయ శాఖ మీద కేసు వేశారు.
ఇటీవల తన
నివాసంలో ఎఫ్‌బీఐ ఆకస్మిక సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల మీద న్యాయశాఖ దర్యాప్తును
స్తంభింపజేయాలని ఆయన ఈ కేసులో కోరారు.
ఫ్లోరిడాలోని
ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఫైళ్లను
పర్యవేక్షించటానికి స్వతంత్ర న్యాయవాదిని నియమించాలని ట్రంప్ తరఫు న్యాయవాదుల
బృందం కోరింది.
మార-అ-లాగోలోని
ట్రంప్ నివాసంలో ఆగస్టు 8వ తేదీన తమ ఏజెంట్లు సోదాలు నిర్వహించి 11 సెట్ల అధికారిక
రహస్య ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ చెప్పింది.
అధికారిక
పత్రాల నిర్వహణలో తప్పులకు పాల్పడ్డారన్న అంశంపై ట్రంప్ మీద దర్యాప్తు
చేస్తున్నారు.
ఫ్లోరిడాలోని
వెస్ట్ పామ్ బీచ్‌లో ఒక జడ్జి కోర్టులో ట్రంప్ న్యాయవాదుల బృందం ఈ కేసు వేసింది. ఆ
జడ్జిని 2020లో ట్రంప్ నామినేట్ చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.