ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు
ఇంతటితో ఈనాటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో లైవ్ పేజీలో కలుద్దాం.
ధన్యవాదాలు!
లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నేతలు తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కల్వకుంట్ల కవిత అన్నారు
ఇంతటితో ఈనాటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో లైవ్ పేజీలో కలుద్దాం.
ధన్యవాదాలు!

ఫొటో సోర్స్, Getty Images
ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి, బీజేపీలో చేరితే సీఎం పదవి ఇస్తామంటూ తనకు బీజేపీ నుంచి టెక్ట్స్ మెసేజ్ వచ్చిందన్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి స్పందించారు.
‘‘తన ఫోన్ ను సీబీఐ అధికారులు తీసుకెళ్లారని సిసోడియా చెప్పారు. అలాంటప్పుడు, ఆ మెసేజ్ ఎవరి ఫోన్‌కు వచ్చిందో సిసోడియా వెల్లడించాలి’’ అని ట్వీట్ చేశారు మనోజ్ తివారీ.
‘‘ఎవరి ఫోన్‌కు ఆ మెసేజ్ వచ్చిందో వారి పేరు చెప్పండి. ఆ ఫోన్‌ను విచారణ అధికారులకు అప్పగించండి. అప్పుడు పాలు ఏవో, మద్యం ఏదో తేలిపోతుంది’’ అని మనోజ్ తివారీ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @bandisanjay_bjp
లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నేతలు తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కల్వకుంట్ల కవిత అన్నట్లు ఏఎన్ఐ తన ట్వీట్‌లో వెల్లడించింది.
దిల్లీ లిక్కర్ పాలసీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినట్లు ఈ ట్వీట్ పేర్కొంది.
ఈ వ్యవహారంలో బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, పోరాడి తీరతామని కవిత అన్నారని వెల్లడించింది.
అంతకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేశారు.
దిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో స్కామ్ జరిగిందని, అందులో కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని సంజయ్ కుమార్ అన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు దిల్లీలోని ఓ హోటల్ లో లిక్కర్ మాఫియా సభ్యులతో సమావేశమైంది నిజమా కాదా అని ప్రశ్నించారు.
వారు దిల్లీ ప్రయాణానికి కూడా ఆ మాఫియా లీడరే విమానం ఏర్పాటు చేశారని కూడా బండి సంజయ్ ఆరోపించారు.
దిల్లీ, ఇతర రాష్ట్రాలలో పర్యటనల పేరుతో కేసీఆర్ లిక్కర్ సిండికేట్‌లతో సమావేశమవుతున్నారని సంజయ్ కుమార్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే తనపై వచ్చిన ఆరోపణలను కల్వకుంట్ల కవిత తిప్పికొట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @msisodia
పార్టీలోకి రావాల్సిందిగా బీజేపీ నేతలు ఆహ్వానాలు పంపుతారని, అలా రానివారిని తమ దారికి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగిస్తారని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు.
తనకు కూడా బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం వచ్చిందని, ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చాలని, బీజేపీలో చేరాలని తనను కోరారని సిసోడియా ఓ ట్వీట్‌లో వెల్లడించారు.
మీరు బీజేపీలోకి వస్తే, ఈడీ, సీబీఐ కేసులన్నీ క్లోజ్ చేస్తామని ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించినట్లు మనీష్ సిసోడియా వెల్లడించారు.
ఆ ఆహ్వానానికి సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాను రాజపుత్రుడినని, మహారాణా ప్రతాప్ వారసుడినని, అవసరమైతే తల తెగనరుక్కుంటాను తప్ప, కుట్రదారుల ముందు తలవంచనని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ గురువని, ఆయనను ఎప్పటికీ మోసం చేయనని సిసోడియా అన్నారు.
ముఖ్యమంత్రి కావడానికి తాను రాజకీయాలలోకి రాలేదని, దేశంలో ప్రతి చిన్నారికి మంచి విద్య అందించడమే తన లక్ష్యమని బీజేపీ నేతలకు చెప్పానని సిసోడియా వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
సల్మాన్ రష్దీపై దాడిని ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇసా ఖండించారు. ఇస్లాం ఇలాంటి దాడులను అనుమతించదని అన్నారు.
అరబ్ న్యూస్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇస్లాం హింసకు వ్యతిరేకమని, హింస ఏ రూపంలో ఉన్నా అంగీకరించదని అన్నారు. మతపరమైన, మేధోపరమైన విషయాలను పూర్తిగా లేదా పాక్షికంగానైనా తెలుసుకోగలిగితే హింసకు తావు ఉండదని అన్నారు.
ఇస్లాం గ్రంథాలో హింసను వ్యతిరేకించే పాఠాలు స్పష్టంగా ఉన్నాయని అబ్దుల్ కరీమ్ అల్ ఇసా అన్నారు. అల్ ఇసా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ హలాల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. ఆయన ఇంతకు ముందు సౌదీ న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అల్-ఇసా ఉదారవాద ఇస్లాం ప్రసంగాలను ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తారు. మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ప్రజల మధ్య సంయమనం, సహకారం, సోదరభావాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసలు అందుకుంది.
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై ఆగస్టు 12న ఒక వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాసిన 'ద సాటానిక్ వెర్సెస్'లోని కొన్ని అంశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ 1990లలో అనేక దేశాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. రష్దీని చంపేందుకు 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫత్వా జారీ చేశారు. నాడు కొన్ని సంవత్సరాల పాటు 'చంపు'తామనే బెదిరింపులు ఆయనకు వచ్చాయి.
అంతకుముందు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా సల్మాన్ రష్దీపై దాడిని ఖండించారు.

ఫొటో సోర్స్, ANI
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను (AIFF) నిర్వహించే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ (సీఓఏ)ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికలను ఒక వారం పాటు వాయిదా వేసింది.
ఏఐఎఫ్‌ఎఫ్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం ఫిఫా (FIFA) విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే అవకాశం కల్పించేందుకే సీఓఏను రద్దు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది.
ఫిఫా నిషేధం కారణంగా, భారతదేశం అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే అవకాశం కోల్పోయింది. అలాగే, అంతర్జాతీయ ఈవెంట్‌లలో భారతదేశ ప్రాతినిధ్యంపై కూడా వేటు పడింది.
"థర్డ్ పార్టీ అనవసర జోక్యం" కారణంగా (ఏఐఎఫ్ఎఫ్)ను రద్దు చేస్తున్నట్లు ఫిఫా గత వారం ప్రకటించింది.
వాస్తవానికి, ఏఐఎఫ్ఎఫ్‌ను నడపడానికి సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీని నియమించింది. కానీ, ఫిఫా మార్గదర్శకాల ప్రకారం, దీన్ని 'జోక్యం'గా పరిగణిస్తారు. అందువల్ల ఫిఫా, ఏఐఎఫ్ఎఫ్‌ను సస్పెండ్ చేసింది.
ఆగస్టు 28న ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు అది వారం రోజులు వాయిదా పడింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకుముందు సోమవారం, మాజీ భారత ఫుట్‌బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియా ఏఐఎఫ్ఎఫ్‌లో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గతంలో భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన భైచుంగ్ భూటియా, సీఓఏ (సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిర్వాహకుల కమిటీ) ఇచ్చిన నియమావళి ముసాయిదాను ఏఐఎఫ్ఎఫ్ కొత్త నియమావళిగా ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి భైచుంగ్ భూటియా నామినేషన్ దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల బెయిల్ మంజూరయింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు రక్షణాత్మక బెయిల్ మంజూరు చేస్తూ, ఆగస్టు 25న ఉగ్రవాద నిరోధక (యాంటీ-టెర్రరిజం) కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఇమ్రాన్ ఖాన్ ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో తెలిపారు. ఆయనకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు, ఏనాడూ శిక్ష పడలేదని.. అలాగే, ఇమ్రాన్‌ఖాన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వలన సాక్ష్యాధారాలను పాడుచేసే అవకాశం లేదని లాయర్లు అన్నారు.
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ముందస్తు బెయిల్ పిటీషన్‌పై రిజిస్ట్రార్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ వద్ద బయోమెట్రిక్ లేదని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ హైకోర్టుకు కాకుండా తీవ్రవాద వ్యతిరేక కోర్టుకు వెళ్లవలసిందని రిజిస్ట్రార్ కార్యాలయం అన్నది.
యాంటీ టెర్రరిజం కోర్టు జడ్జి సెలవులో ఉన్నారని, అందుకే ఆయన హైకోర్టును ఆశ్రయించారని ఇమ్రాన్ ఖాన్ వర్గం తెలిపింది.
శనివారం జరిగిన ఒక ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పోలీసులను, న్యాయవ్యవస్థను బెదిరించారనే ఆరోపణలతో, ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద పాకిస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నేరపూరిత కుట్ర, మోసం ఆరోపణలపై తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేశారు.
జస్టిస్ యుయు లాటి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 25న జరగనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తీస్తా సెతల్వాద్‌ను అదుపులోకి తీసుకున్నారని, ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసినందున ఆమె ఇంకా కస్టడీలోనే ఉన్నారని సుప్రీంకోర్టు ఆ నోటీసులో పేర్కొంది.
తన బెయిల్‌ను రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు తీస్తా సెతల్వాద్. అక్కడ సెప్టెంబర్ 19న విచారణ జరగనుంది. అందుకే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముంబైలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. పత్రా చాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూలైలో అరెస్టు చేసింది.
ఈమధ్యే సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం వర్షా రౌత్, సంజయ్ రౌత్‌ల సన్నిహితులు ఇద్దరి దగ్గరి నుంచి 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముంబైలోని గోరేగావ్‌లోని పత్రా చాల్ పునర్నిర్మాణం విషయంలో సంజయ్ రౌత్, ఆయన సహచరులు 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.కాగా, సంజయ్ రౌత్ పలుమార్లు ఈ ఆరోపణలను ఖండించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AP CMO
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వారి సమావేశం అరగంట పాటు జరిగింది. ఏపీకి సంబంధించిన వివిధ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి.
పోలవరం సమస్యను ప్రధానంగా ప్రస్తావించినట్టు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా పెంపుదల చాలాకాలంగా పెండింగులో ఉంది.
దానికి తోడు, ఇటీవల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పోలవరం పనులకు ఆటంకం ఏర్పడింది. ఇటీవల గోదావరి వరదల సమయంలో పోలవరం ముంపు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 41.15 అడుగుల వరకూ కాంటూర్ 1గా పరిగణించి, వారందరికీ సెప్టెంబర్ నెలాఖరులోగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తామని వరద బాధిత ప్రాంతాల పర్యటన సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, AP CMO
పునరావాసం కూడా పోలవరం నిర్మాణంలో భాగంగా పరిగణించి, దానికి అనుగుణంగా నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ విషయాన్ని సీఎం కూడా ప్రధానికి విన్నవించారని ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతోంది.
విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలతో పాటుగా ఇతర సమస్యలను కూడా జగన్, మోదీకి నివేదించారని, కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందనే అశాభావంతో ఉన్నట్టు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విభాగం విప్ మార్గాని భరత్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, AP CMO
ప్రధాన మంత్రితో సమావేశం తర్వాత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కూడా సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. దానికి అనుగుణంగా సోమవారం సాయంత్రం వరకూ దిల్లీలో సీఎం పర్యటన ఉంటుంది. ఆ తర్వాత బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
యూపీఐ చెల్లింపులు మునుపటిలా ఉచితంగానే కొనసాగుతాయని, దానిపై ప్రభుత్వం ఎలాంటి రుసుము వసూలు చేయబోదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
కొన్ని రోజుల క్రితం, యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరింది. ఆ మేరకు ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. దాంతో, యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేస్తూ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రజలకు ఉపయోగకరమైన డిజిటల్ సర్వీస్ అని, దానిపై ఛార్జీలు విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొంది.
"యూపీఐ, ప్రజలకు సౌకర్యవంతమైన డిజిటల్ సేవ. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచే సాధనం. యూపీఐ సేవలపై చార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సర్వీసు ప్రొవైడర్లు తమ సమస్యలకు వేరే పరిష్కార మార్గాలను అన్వేషించాలి" అంటూ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరొక ట్వీట్‌లో, "డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గత సంవత్సరం ఆర్థిక సహాయం అందించింది. ఈ సంవత్సరం కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఉపయోగించడానికి సులువుగా ఉంటూ, ఆర్థిక లాభాలను అందించే ఈ డిజిటల్ సేవలను మరింత ఎక్కువమంది ప్రజలు వినియోగించేలా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వం ఆలోచన" అని ఆర్థిక శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోలీసులను, న్యాయవ్యవస్థను బెదిరించారనే ఆరోపణలపై విచారణ మొదలైంది. ఆయన శనివారం చేసిన రాజకీయ ప్రసంగంలో ప్రభుత్వాధికారులను బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ వార్త బయటకు రాగానే ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో మద్దతుదారులు చేరుకున్నారు. దీంతో, ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేస్తే రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన మద్దతుదారులు హెచ్చరించారు.

ఫొటో సోర్స్, ANI
మిజోరం ముఖ్యమంత్రి జోరాంథంగా కుమార్తె మిలారీ ఛంగ్తే ఒక వైద్యుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన కుమార్తె వ్యవహారాన్ని సమర్థించలేమని చెబుతూ ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ఈ సంఘటనపై ఆగ్రహం చెందిన స్థానిక వైద్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారని, సుమారు 800 మంది డాక్టర్లు ఇందులో పాల్గొన్నారని పీటీఐ తెలిపింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సభ్యులు నిరసనగా విధుల్లో నల్లబెల్టులు ధరించారు.
సీఎం కుమార్తె గత బుధవారం ఐజ్వాల్‌లో ఒక చర్మవ్యాధి నిపుణుడి వద్దకు వెళ్లారు. ముందు అపాయింట్మెంట్ తీసుకోమని డాక్టరు చెప్పడంతో, ఆమె ఆయన్ను చెంప దెబ్బ కొట్టారని నిరసనకారుల్లో ఒకరు పీటీఐకి తెలిపారు.
అయితే, తన కూతురు ఆ డాక్టరుకు క్షమాపణలు చెప్పారని జోరాంథంగా ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించారు. అలాగే, ఐఎంఏ సభ్యులు తన కూతురిపై కఠిన చర్యలు తీసుకోనందుకు కృతజ్ఞతలు తెలిపారు.
"మా అమ్మాయి వ్యవహారం సమర్థించడానికి వీలు లేనిది. డాక్టరుకు, ప్రజలకు మేం క్షమాపణలు తెలియజేస్తున్నాం" అని ఆయన అన్నారు.
మిలారీ ఛంగ్తే అన్నయ్య రాంథాన్సియామా కూడా తన సోదరి ప్రవర్తనకు సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె అలా ప్రవర్తించిందని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
నేడు దిల్లీలోని జంత మంతర్ వద్ద రైతులు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సింఘు బోర్డర్, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు.