యుక్రెయిన్ యుద్ధం క్రైమియాతోనే మొదలైంది, దాని విముక్తితోనే ఆగాలి - జెలియెన్‌స్కీ
క్రైమియాలోని రష్యా ఎయిర్‌బేస్‌లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో పౌరుల్లో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారని క్రైమియా ప్రభుత్వం తెలిపింది.
నొవోఫెడొరివ్కాకు సమీపంలోని సాకీ సైనిక శిబిరంలో మంగళవారం పొద్దున వరుసగా పేలుళ్లు సంభవించాయి.
సుమారు 12 సార్లు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు.
ఆయుధగారంలోని మందుసామాగ్రి పేలడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణశాఖ చెప్పింది.
ఈ దాడి వెనుక యుక్రెయిన్ ఉందని కొందరు భావిస్తుండగా అది తమ పని కాదని యుక్రెయిన్ అధ్యక్ష సహాయకుడు స్పష్టం చేశారు.
అయితే ఈ దాడి తరువాత మాట్లాడిన యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ...‘క్రైమియాతో యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైంది. క్రైమియా విముక్తితోనే ఈ యుద్ధం ముగుస్తుంది’ అని అన్నారు.