థాయిలాండ్ నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు... 14 మంది మృతి

థాయ్‌లాండ్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగిన దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకూ గాయపడ్డారు.

లైవ్ కవరేజీ

  1. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు

    మార్గరేట్ అల్వా

    ఫొటో సోర్స్, ANI

    ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.

    టీఆర్‌ఎస్ ఎంపీలు అందరూ ఆమెకు ఓటు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

  2. సొంత డబ్బుతో చెక్‌డ్యాం నిర్మించిన వృద్ధురాలు

    తమ ఊరిలో పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఓ ఆదివాసీ రైతు చేశారు.

    సొంత డబ్బులతో పెద్ద చెక్ డ్యాం నిర్మించి ఇచ్చారు.

    పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  3. 2022-23 ద్రవ్యోల్బణం 6.7శాతం

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి వడ్డీ రేట్లు పెంచింది.

    50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.4శాతానికి చేరింది. అగస్ట్ 2019 తరువాత వడ్డీ రేట్లు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

    అంతర్జాతీయంగా అలుముకుంటున్న ఆర్థికమాంద్యం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం, తైవాన్-చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత ఆర్థికవ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి.

    ఆర్‌బీఐ అంచనాలు:

    2022-23 ద్రవ్యోల్బణం: 6.7శాతం

    2023-24 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం: 5శాతం

    2022-23 జీడీపీ: 7.2శాతం

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. బ్రేకింగ్ న్యూస్, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంపు

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి వడ్డీ రేట్లు పెంచింది.

    50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.4శాతానికి చేరింది.

  5. తైవాన్: ‘విభజన రేఖను దాటిన చైనా విమానాలు’

    చైనా యుద్ధ విమానం

    ఫొటో సోర్స్, CCTV

    రెండో రోజు కూడా తైవాన్ సంధిలోని మధ్యరేఖను చైనా షిప్పులు, విమానాలు దాటినట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది.

    చైనా, తైవాన్‌ మధ్య తైవాన్ సంధిలో ఉన్న అనధికారిక విభజనరేఖను మధ్యరేఖ అంటారు.

    నేడు కూడా చైనా సైనిక విన్యాసాలు కొనసాగనున్నాయి. నిన్న జరిపిన విన్యాసాల్లో భాగంగా తైవాన్‌కు సమీపంలోని సముద్రజలాల్లో మిసైల్స్ లాంచ్ చేసింది చైనా.

    మరొక వైపు తాను తైవాన్‌లో శాంతి ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అన్నారు.

    గత 25 ఏళ్లలో తైవాన్‌లో అడుగు పెట్టిన ఉన్నత స్థాయి రాజకీయనేతల్లో పెలోసీ ఒకరు.

    ఆమె పర్యటనకు ముందు తైవాన్‌కు రావొద్దంటూ పెలోసీని చైనా హెచ్చరించింది.

  6. మండే ఎండలతో ఉద్యోగులకు సెలవులు

    ఇరాక్‌లో వేడికి అల్లాడిపోతున్న ప్రజలు

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    ఇరాక్‌లో ఎండలు మండిపోతుండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు.

    ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నారు.

    సుమారు 10 ప్రావిన్సులలో పనులు నిలిపివేసినట్లు కర్దిస్తాన్‌24 రిపోర్ట్ చేసింది.

    ఇరాక్‌లో ఎండలు కొత్తకాదు కానీ ఈసారి మాత్రం బాగా మండిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

    పోర్టు ప్రాంతమైన బాస్రాలో నాలుగు రోజులు సెలవు ప్రకటించారు.

  7. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.