You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గొటాబయ రాజపక్షకు వ్యతిరేకంగా మాల్దీవుల్లో శ్రీలంక జాతీయుల నిరసన
శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు మాల్దీవ్స్ ఆశ్రయం ఇవ్వడంపై అక్కడ శ్రీలంక జాతీయులు నిరసనలకు దిగారు.
లైవ్ కవరేజీ
తెలంగాణలో భారీ వర్షాలు: ప్రమాదకర స్థితిలో కడెం ప్రాజెక్టు, పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. ఇలాగే వరద వస్తే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉన్నందున దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రాజెక్టు అధికారులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
ఎగువ ప్రాంతంలో ఇటు ఎస్సారెస్పీ నుంచి అటు బోథ్ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.
ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని తెలిపారు.
‘‘ప్రస్తుతం వర్షాలు తగ్గితేనే వరద నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొద్దిగా వరద నీటి ప్రవాహం తగ్గింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం’’ అని చెప్పారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తాజా వార్తాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్లను ఇక్కడ చదవండి.