You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జీ-7 దేశాల నాయకులు రష్యా, చైనా, ఇరాన్‌ల గురించి ఏమన్నారు?

మూడు రోజుల సదస్సులో చివరి రోజైన మంగళవారం నాడు జీ7 దేశాల అధినేతలు రష్యా, చైనా, ఇరాన్ దేశాలపై ఇంధనం, ఆహారం, భద్రత, వాతావరణ మార్పులు, కరోనా వంటి అంశాలకు సంబంధించి ఆంక్షలు విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

లైవ్ కవరేజీ

  1. అమెరికా: కంటైనర్ ట్రక్కులోని మృత దేహాలు వలసదారులేవేనా?

    అమెరికాలోని కంటైనర్‌లో దొరికిన మృత దేహాలు సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన వలసదారులవని భావిస్తున్నారు.

    ఏసీ పని చేయని, మంచి నీళ్లు కూడా లేని ట్రక్కులో వారిని తరలించారు. తీవ్రంగా ఉన్న ఎండలతో డీహైడ్రేషన్‌కు లోనై వారు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.

    ఎంతో మంది చనిపోతున్నా సిండికేట్ ముఠాలు అక్రమంగా వలసదారులను తరలించడాన్ని ఆపడం లేదని స్థానికులు అంటున్నారు.

    2017లోనూ 10 మంది వలసదారులు ఇలాగే ట్రక్కులో మరణించి కనిపించారు.

    వలసదారులతో అమెరికాలోకి అక్రమంగా వచ్చే పెద్దపెద్ద కంటైనర్ ట్రక్కులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటూ ఉంటాయి.

  2. బ్రేకింగ్ న్యూస్, అమెరికా: కంటైనర్ ట్రక్కులో ఇద్దరు గ్వాటమాలాకు చెందిన వ్యక్తులు

    అమెరికాలో 46 మృతదేహాలు లభించిన ట్రక్కులో 16 మంది సజీవంగా దొరికారు.

    బతికున్న వారిలో ఇద్దరు గ్వాటమాలకు చెందిన పౌరులుగా మెక్సికో విదేశాంగశాఖ తెలిపింది.

  3. యుక్రెయిన్: షాపింగ్ మాల్ మీద ‘రష్యా’ మిసైల్ దాడి... 16 మంది మృతి

  4. బ్రేకింగ్ న్యూస్, అమెరికా: 46కు పెరిగిన మృతుల సంఖ్య

    అమెరికా కంటైనర్ ట్రక్కులో లభించిన మృతదేహాల సంఖ్య 46కు చేరింది.

    నలుగరు పిల్లలతో సహా బతికున్న 16 మందిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

    ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల బాధితులకు వడదెబ్బ తగిలి ఉండొచ్చని భావిస్తున్నారు. సోమవారం శాన్ ఆంటోనియోలో ఉష్ణోగ్రత 39.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

    కంటైనర్ ట్రక్కులో ఏసీ పని చేయడం లేదని, లోపల తాగడానికి నీళ్లు కూడా లేవని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

    అమెరికా-మెక్సికో సరిహద్దుకు శాన్ ఆంటోనియో సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

    ఈ మార్గం ద్వారా తరచూ అక్రమంగా వలసదారులను తరలిస్తుంటారు.

  5. అమెరికా: కంటైనర్ ట్రక్కులో 40 మృత దేహాలు

    అమెరికాలోని ఒక కంటైనర్ ట్రక్కులో భారీ సంఖ్యలో మృత దేహాలు లభించాయి.

    టెక్సస్‌లోని శాన్ ఆంటోనియో శివార్లలో ఆ లారీని పోలీసులు గుర్తించారు. సుమారు 16 మంది అందులో ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

    ఘటనాల స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

    శాన్ ఆంటోనియోలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఆ ట్రక్కు ఉన్నట్లు కేశాట్ టీవీ వెల్లడించింది.

    అమెరికా-మెక్సికో సరిహద్దుకు శాన్ ఆంటోనియో సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్ల అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వచ్చే ప్రయత్నంలో వీరు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

    అయితే చనిపోయిన వారు ఎవరు? ఏ దేశస్థులు? చనిపోవడానికి కారణాలు ఏంటి? అనే విషయాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

    ఇక పరారీలో ఉన్న టక్కు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.