శరద్ పవార్: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరణ

‘‘దిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నా పేరును విపక్షాలు సూచించినందుకు ధన్యవాదాలు. అయితే, ఆ అభ్యర్థనను నేను తిరస్కరిస్తున్నాను’’అని శరద్ పవర్ ట్వీట్ చేశారు.

లైవ్ కవరేజీ

  1. ఐసీఎంఆర్: ‘బాగా పని చేస్తున్న కోవాగ్జిన్ బూస్టర్ డోస్’

    భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్

    ఫొటో సోర్స్, Getty Images

    డెల్టాతోపాటు ఒమిక్రాన్ బీఏ.1.1, బీఏ.2 వేరియంట్ల మీద కోవాగ్జిన్ బూస్టర్ డోస్‌ ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)-ఎన్ఐవీ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. పెట్రోలు ఆదాకు పని చేసే చిట్కాలు

    పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంధనాన్ని ఆదా చేసే మార్గాల కోసం వెతకడం అనివార్యంగా మారింది. అయితే, కారు నడుపుతున్నప్పుడు పెట్రోలు లేదా డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో కొన్ని నిజాలు, మరికొన్ని అపోహలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  3. పాకిస్తాన్: 'దేశ ప్రజలారా.. టీ తాగడం తగ్గించండి.. ఆర్థికవ్యవస్థను కాపాడండి' - ప్రభుత్వం విజ్ఞప్తి

  4. తెలంగాణ ఆర్టీసీలో తిరుమల దర్శనం టికెట్లు, బళ్ల సతీశ్

    టీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుమల దర్శనం టికెట్లు

    తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తులు ఇకపై టీఎస్ఆర్టీసీ ద్వారా కూడా 300 రూపాయల ప్రత్యేక దర్శనం బుక్ చేసుకోవచ్చు.

    టీటీడీ రోజుకు 1000 ప్రత్యేక దర్శనం టికెట్లను టీఎస్ఆర్టీసీకి ఇవ్వనుంది. దీంతో తిరుపతికి ఆర్టీసి బస్సులో ప్రయాణం టికెట్, 300 రూపాయల దర్శనం టికెట్లను కలపి ప్యాకేజీగా తీసుకోవచ్చు.

    తెలంగాణ ఆర్టీసీ వెబ్ సైట్‌లో తిరుపతికి టికెట్ తీసుకునేప్పుడే దర్శనం బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో ఏపీఎస్ఆర్టీసీకి ఈ వెసులుబాటు ఉండగా ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీకి కూడా ఇచ్చారు.

    తిరుపతి చేరిన 3-4 గంటల తరువాత దర్శనం స్లాట్ ఉండేలాఅంటే టీఎస్ఆర్టీసీ బస్సు తిరుపతి చేరుకున్న తరువాత తగిన విరామం ఉండి, ఆ తరువాత దర్శనం చేసుకునేలా స్లాట్ బుకింగ్ వెసులుబాటు ఉంటుంది.

    ఇది తక్షణం అమల్లోకి వస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సాధారణంగా 300 రూపాయల టికెట్లు తీసుకోవడానికి నెలల ముందు రిజర్వు చేసుకోవాలి. కానీ ఆర్టీసీ ద్వారాఖాళీలను బట్టి రెండు రోజుల ముందు కూడా రిజర్వు చేసుకునే వెసులుబాటు ఉంది.

  5. ‘సీఆర్‌పీ‌ఎఫ్‌’ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీరులకు ప్రాధాన్యం... అమిత్ షా

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

    ఫొటో సోర్స్, Facebook/Amit Shah

    ‘అగ్నిపథ్’ స్కీంలో భాగంగా సైన్యంలో పని చేసే ‘అగ్నివీరుల’కు కేంద్ర హోంశాఖ ప్రాధాన్యం ఇస్తుందని ఆ శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.

    కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో ‘అగ్నివీరుల’కు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

    దేశ సేవ చేయాలనుకునే యువతకు సైన్యంలో పని చేసే అకాశం కల్పించేందుకు ‘అగ్నిపథ్’ అనే కొత్త స్కీంను తీసుకొచ్చారు.

    తద్వారా భారత సైన్యం మరింత యూత్ ఫుల్‌గా మారుతుందని సైనిక అధికారులు తెలిపారు.

    ఈ కొత్త స్కీంలో భాగంగా 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న వారిని నాలుగేళ్ల కాలానికి నియమించుకుంటారు.

    ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది 46 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నారు.

    అగ్నివీరులకు నెలకు రూ.30 నుంచి 40 వేల వరకు జీతం లభిస్తుంది.

  6. మూడో రోజూ ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుసగా మూడో రోజు ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నారు.

    సోమవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ, మంగళవారం కూడా ఎనిమిది గంటలకుపైగా రాహుల్ గాంధీని విచారించింది.

    రాహుల్ గాంధీ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

    ఆయా రాష్ట్రాల నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతలు దిల్లీకి చేరుకుని నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో పలు చోట్ల పోలీసులు 144 సెక్షన్ పెట్టారు.

    నిరసనలకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.

    నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

    ఫొటో సోర్స్, ANI

  7. ముస్లింల అణచివేతను ఆపండి అంటూ భారత్‌ను కోరిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

    మొహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ముస్లింలను అణచి వేయడాన్ని ఆపాలంటూ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వాన్ని కోరింది.

    నిరసనకారుల మీదకు భారీ సంఖ్యలో బలాలను పంపిస్తున్నారని, ఇప్పటి వరకు ఈ హింసలో ఒక చిన్నారితో సహా సుమారు ఇద్దరు చనిపోయారని ఆ సంస్థ పేర్కొంది.

    ‘మహ్మద్ ప్రవక్త మీద, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, జమ్మూ కశ్మీర్ వంటి ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వేల మంది వీధుల్లోకి వస్తున్నారు.

    కానీ శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిని భారత ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తోంది.’ అని ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తన ప్రకటనలో పేర్కొంది.

  8. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.