వైఎస్ జగన్: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితే రెగ్యులర్‌గానే పరిగణిస్తాం

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్‌గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. నేటి ముఖ్యాంశాలు

    యువతకు దేశ సేవ చేసే అవకాశం కల్పించడానికి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

    పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్‌గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

    కేంద్ర ప్రభుత్వంలో రానున్న 15 నెలల్లో సుమారు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆయా శాఖలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్లు పిఎంఓప్రకటించింది.

    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు, టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.ఈ సందర్భంగా పలువురు మహిళలు గాయపడ్డారు. ఓ పోలీస్ అధికారి కిందపడిపోయారు.

    దేశంలో రాళ్లదాడులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. కొందరు దేశంలో అస్థిరతను వ్యాప్తి చేయాలని చూస్తున్నారని.. అందుకే దేశంలో చాలాచోట్ల ప్రణాళికాబద్ధంగా రాళ్లదాడులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేడు కూడా ఈడీ ప్రశ్నించనుంది. సోమవారం సుమారు 11 గంటలపాటు ఆయనను ఈడీ విచారించింది.

    మొహమ్మద్ ప్రవక్త మీద బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యూపీలో చేపట్టిన నిరసనలకు సంబంధించి ఇప్పటి వరకు 337 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్‌గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

    పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధం ఉందన్న ఆరోపణతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఇంతటితో నేటి లైవ్ ముగిస్తున్నాం. అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి.

  2. నాలుగేళ్ల పాటు సైన్యంలో ఉద్యోగం, వేలలో జీతం, సర్వీస్ పూర్తయ్యాక సమగ్ర ఆర్థిక ప్యాకేజ్

  3. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ అరెస్ట్

    పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధం ఉందన్న ఆరోపణతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. నూపుర్ శర్మకు మద్దతుగా హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తల ర్యాలీ

    హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు మాజీ నేత నూపుర్ శర్మకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నూపుర్ శర్మ ఇటీవల మొహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు గాను, పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది.

    అయితే, హైదరాబాద్‌లో ర్యాలీని నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టారు. దీంతో, మరో గ్రూపు సభ్యులు ఈ ర్యాలీ నిర్వహణకు అభ్యంతరం తెలిపారు.

    పోలీసులు ర్యాలీ జరుగుతున్న స్థలానికి చేరుకొని గుంపును చెల్లాచెదురు చేశారు. 7గురు బీజేపీ కార్యకర్తల పై కేసులు నమోదు చేసినట్లు బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?

  6. Siddipet : గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన.. హుస్నాబాద్‌లో ఉద్రిక్తత

    Husnabad

    ఫొటో సోర్స్, UGC

    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు, టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

    పైపులు, కర్రలతో రైతులు, పోలీసులు పరస్పరం దాడి చేసుకున్నారు.

    ఈ సందర్భంగా పలువురు మహిళలు గాయపడ్డారు. ఓ పోలీస్ అధికారి కిందపడిపోయారు.

    ఆందోళనకారుల్లో కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

    గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం గుడాటిపల్లిలో సోమవారం (జూన్ 13) తెల్లవారుజామున కొంతమంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

    అరెస్టును నిరసిస్తూ మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి గుడాటిపల్లి గ్రామస్థులు హుస్నాబాద్ చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

    ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులను (సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ) లను నిర్వాసితులు నిలదీశారు.

    ఈ సందర్భంగా నాయకులు, నిర్వాసితుల మధ్య ఘర్షణ పెరిగింది. ఈ సందర్భంలో తోపులాట జరిగింది.

    వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

    పరిహారం ఇవ్వకుండా భూములు సర్వే చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

    మరోవైపు, గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణానికి మద్దత్తుగా హుస్నాబాద్‌లో కొంతమంది ర్యాలీ నిర్వహించారు.

    నిర్వాసితులకు మద్దతుగా ఈ రోజు (మంగళవారం) హుస్నాబాద్ బంద్‌కు కాంగ్రేస్ పార్టీ పిలుపు ఇచ్చింది.

  7. సాక్షి మహరాజ్: ‘‘శుక్రవారం రాళ్లు విసిరితే.. శనివారం బుల్డోజర్ వస్తుంది’’

    sakshi maharaj

    ఫొటో సోర్స్, Getty Images

    దేశంలో రాళ్లదాడులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. కొందరు దేశంలో అస్థిరతను వ్యాప్తి చేయాలని చూస్తున్నారని.. అందుకే దేశంలో చాలాచోట్ల ప్రణాళికాబద్ధంగా రాళ్లదాడులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ జీ ఉన్నారు. శుక్రవారం రాళ్లు విసిరితే.. శనివారం బుల్డోజర్ వస్తుంది" అని సాక్షి మహరాజ్ అన్నారు.

    మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నూపుర్ శర్మను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నవీన్ జిందాల్‌ను బహిష్కరించింది. అయితే, నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రార్థనల తర్వాత, పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు,రాళ్ల దాడులు జరిగాయి.

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు పలు నగరాల్లో హింస చెలరేగింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 300 మందికి పైగా అరెస్టు చేశారు.

    ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్న జావేద్ మహ్మద్ ఇంటిని ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఎ) బుల్డోజర్‌తో కూల్చివేసింది.

    Prayagraj

    ఫొటో సోర్స్, ANI

  8. వాయు కాలుష్యం: మీ ఆయుర్దాయం ఎంత తగ్గుతోందో తెలుసా?

  9. సంత్ తుకారం మందిరాన్ని ప్రారంభించిన మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    పుణెలో సంత్ తుకారం మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ‘జగద్గురు శ్రీసంత్ తుకారాం మహారాజ్ టెంపుల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఆయన బోధనలు అందరికీ ఆదర్శం.’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

    సంత్ తుకారాం 17వ శతాబ్దానికి చెందిన మరాఠీ కవి. భక్తి ఉద్యమంలో నాడు ఆయన తన వంతు పాత్ర పోషించారు.

    ఈ సందర్భంగా మోదీ చిడతలు పట్టుకుని భజన చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. వైఎస్ జగన్: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితే రెగ్యులర్‌గానే పరిగణిస్తాం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, Facebook/APCMO

    పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్‌గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

    ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 67శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు.

    సుమారు 30శాతానికిపైగా విద్యార్థులు ఫెయిల్ కావడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.

    ఈ విమర్శలను వైఎస్ జగన్ తిప్పికొట్టారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి బదులు వారిని రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

    మరొక నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జగన్ తెలిపారు.

  11. రాంచీలో హింస ఎలా మొదలైంది? పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారు?

  12. ‘ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రభుత్వ హింసను అడ్డుకోండి’

    ఉత్తర్ ప్రదేశ్‌లో ఇళ్లు కూల్చుతున్న బుల్ డోజర్‌

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తర్ ప్రదేశ్‌లో నిరసనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మాజీ న్యాయమూర్తులు, సీనియర్ లాయర్లు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

    అక్రమంగా నిర్బంధించడం, పోలీసు కస్టడీలో ఉన్న వాళ్లపై హింసకు పాల్పడటం వంటి చట్టవ్యతిరేక పనులను సుప్రీం కోర్టు వెంటనే అడ్డుకోవాలని పిటీషన్‌లో వారు అభ్యర్థించారు.

    శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వకుండా నిరసనకారులను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తోందని వారు ఆరోపించారు.

    మొహ్మద్ ప్రవక్త గురించి బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనకు దిగారు.

    ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

    ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకున్న ఘటనలో నిందితుల ఇళ్లను బుల్‌డోజర్‌తో ధ్వంసం చేశారు.

  13. రాజస్థాన్: ఎడారి గ్రామాలకు మంచి నీరు ఎలా దొరుకుతోంది?

    భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20 కోట్ల కుటుంబాలకు, ఇళ్లలో కుళాయిలు లేవు. ఈ కుటుంబాల్లోని మహిళలు నడిచి వెళ్తూ, గంటలపాటు క్యూలో నిలుచుని నీళ్లు ఇంటికి తీసుకొస్తున్నారు.

    ఈ సవాలును ఎదుర్కోడానికి మోదీ ప్రభుత్వం 2019లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు అందించడానికి జల్ జీవన్ మిషన్ ప్రకటించింది. 2024 నాటికి అన్ని ఇళ్లలో కుళాయి పెట్టాలి.

    ఇప్పటివరకూ 10 కోట్ల ఇళ్లకు కుళాయిలు పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం ఎంత సఫలమైంది? దీనిలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?

    గతంలో తీవ్రమైన నీటి కొరత చవి చూసిన మూడు ప్రాంతాలకు బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య వెళ్లారు.

    ఈ సిరీస్‌లో మొదటి మజిలీ రాజస్థాన్ థార్ ఎడారిలోని బడ్మేర్ జిల్లా. ఈ మిషన్ ద్వారా ఎడారిలోని ఇళ్ల వరకూ నీళ్లను ఎలా చేరుస్తున్నారో ఈ ప్రత్యేక కథనంలో చూడండి.

    రిపోర్టర్: దివ్యా ఆర్య, కెమెరా-ఎడిటింగ్: దెబ్లిన్ రాయ్

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  14. కోనసీమ హింస: వైసీపీ నేతల మీద కూడా కేసు

    అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు మార్పునకు వ్యతిరేకంగా జరిగిన హింస

    ఫొటో సోర్స్, UGC

    కోనసీమ హింసకు సంబంధించి నలుగురు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసు పెట్టారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.విశ్వరూప్‌ అనుచరులుగా గుర్తింపు పొందడం చర్చనీయాంశంగా మారింది.

    కేసు నమోదైన వారిలో సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టిపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘు ఉన్నారు. ఈమేరకు అమలాపురంలో కేసు నమోదైంది.

    అమలాపురం ప్రాంతంలో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన ఏ-222 చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చడానికి వ్యతిరేకంగా పోయిన నెలలో నిరసనలు చెలరేగాయి. అమలాపురంలో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.

    ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 142 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు.

  15. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఈ హిమాలయ గ్రామాలకు నీరు చేరుతోందా?

  16. ‘ఖార్కీవ్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది’ - ఆమ్నెస్టీ ఆరోపణ

  17. భారత సైన్యంలో ‘అగ్నివీరులు’

    భారత సైనికులు

    ఫొటో సోర్స్, Facebook/Indian Army

    యువతకు దేశ సేవ చేసే అవకాశం కల్పించేందుకు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

    భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం దేశ యువతను వినియోగించుకోవాలి భావిస్తున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.

    అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పని చేయొచ్చు.

    ప్రస్తుతం అబ్బాయిలకే మాత్రమే అవకాశం. అమ్మాయిలకు తరువాత అవకాశం కల్పిస్తారు.

    వయసు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.

    తొలి ఏడాది రూ.4.76 లక్షల ప్యాకేజీ చెల్లిస్తారు. నాలుగో ఏడాదిలో రూ.6.92 లక్షలు లభిస్తాయి.

    అగ్నివీరులు భవిష్యత్తు సైనికులు అవుతారని, చాలా కఠినమైన పద్ధతిలో వారి నియామకాలు చేపడతామని సైన్యం తెలిపింది.

    ఈ పథకం ద్వారా సైన్యంలో చేరే 25 శాతం మంది యువతను తర్వాత రీటెయిన్ చేస్తారు. అంటే 100లో 25 మందికి శాశ్వత సేవలు అందించే అవకాశం లభిస్తుంది.

    ఈ పథకం కింద నాలుగేళ్లకు దాదాపు 45 వేల మంది యువతీయువకులను భర్తీ చేస్తామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు.

  18. యుక్రెయిన్: ఖార్కివ్ రీజియన్‌లో రష్యా కదలికలు మళ్లీ మొదలు

    దెబ్బతిన్న రష్యా యుద్ధ ట్యాంక్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని ఖార్కివ్ రీజియన్‌లో రష్యా బలగాల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్లు బ్రిటన్ తెలిపింది. రష్యా సైన్యం మళ్లీ ముందుకు కదులుతున్నట్లుగా వెల్లడించింది.

    యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా, రక్షణ బడ్జెట్‌ను 20శాతం పెంచొచ్చని అంచనా వేసింది.

    సెవరదోనియెస్క్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు ఆ నగరానికి వెళ్లే మూడు వంతెనలను ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఆయన చెబుతున్న ప్రకారం పౌరులకు ఆహారం అందించడం కానీ, వారిని బయటకు తరలించడం కానీ ఇప్పుడు సాధ్యం కాదు.

  19. భారత్Xదక్షిణాఫ్రికా: నేడు విశాఖలో మూడో టీ20, శ్రీనివాస్ లక్కోజు

    భారత క్రికెటర్ రిషభ్ పంత్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టీ20 ఇవాళ విశాఖలో జరగనుంది. ఇంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా వరుసగా గెలిచింది. ఈ టీ20 సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి.

    తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ నెగ్గి సీరీస్ దక్కించుకోవాలని చూస్తుండగాఆ జట్టు స్పీడ్‌కు బ్రేకులు వేసి, సీరీస్ మీద ఆశలు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది.

    ‘విశాఖ ఏసీఏ, వీడీసీఏ స్టేడియం భారత్‌ జట్టుకు కలిసివచ్చే వేదిక. ఇక్కడ జరిగిన వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో ఎక్కువగా ఇండియానే నెగ్గింది. ఈ స్టేడియం బ్యాటింగుకు అనుకూలంగా ఉంటుంది. ముందు బ్యాటింగ్‌ చేసిన జట్టు 200పైగా పరుగులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.’ అని విశాఖ క్రికెట్ క్లబ్ సభ్యుడు రమణ చెప్పారు.

    ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ప్రేక్షకులని 5 గంటల నుంచి స్టేడియం లోపలకి అనుమతిస్తారు.

    మధ్యాహ్నం 12 గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయి. స్టేడియం వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.

  20. నరేంద్ర మోదీ: ‘10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’

    భారత ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Reuters

    వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయా ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

    అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యకు సంబంధించి ప్రధాని నిర్వహించిన సమీక్షలో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    ఎంతో కాలంగా నిరుద్యోగం మీద ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. ఇటీవలే మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయంటూ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కూడా మోదీని ప్రశ్నించారు.

    కేంద్ర ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో సుమారు 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అంచనా.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది