You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

సోనియా గాంధీ: కోవిడ్ సమస్యతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు

కోవిడ్ సంబంధిత అస్వస్థత కారణంగా సోనియా గాంధీ ఆదివారం దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది: అసదుద్దీన్ ఒవైసీ

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

    అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో మునిసిపల్ ఎన్నికల నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఐఎం సన్నద్ధమవుతోందని చెప్పారు.

    ఒవైసీ శరివారం నాడు గుజరాత్‌లో భుజ్ నగరంలో మీడియాతో మాట్లాడారు.

    ‘‘గుజరాత్ ఎన్నికల్లో మేం పూర్తి శక్తితో పోరాడుతాం. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది మేం ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయంలో పార్టీ గుజరాత్ విభాగం అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగనున్నాయి.

  2. అమెరికాలో గన్ కంట్రోల్ డిమాండ్‌తో దేశమంతటా భారీ ప్రదర్శనలు

    అమెరికాలో తుపాకీ లైసెన్స్‌లకు సంబంధించి కఠిన చరట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రదర్శనలు చేపట్టారు.

    ఇటీవల రెండు సామూహిక కాల్పుల ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి. ‘‘తుపాకుల నుంచి మా ప్రాణాలను కాపాడండి’’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

    మే 24వ తేదీన టెక్సస్‌లోని యువాల్డే పట్టణంలో రాబ్ ఎలిమెంటరీ మీద తుపాకీ కాల్పులు జరపటంతో 19 మంది చిన్నారులు, ఇద్దరు వయోజనులు చనిపోయారు.

    దానికి కొన్ని రోజుల ముందు న్యూయార్క్ రాష్ట్రంలో బఫలో నగరంలో జరిగిన తుపాకీ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ రెండు ఘటనలతో దేశంలో తుపాకుల నియంత్రణకు చఠిన చట్టాలు చేయాలనే డిమాండ్ మళ్లీ బలం పుంజుకుంది. శనివారం నాడు దేశవ్యాప్తంగా 450 ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ‘మార్చ్ ఫర్ అవర్ లైవ్స్’ బృందం తెలిపింది.

    2018లో ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్క్‌ల్యాండ్ స్కూల్ కాల్పుల్లో చనిపోయిన వారి బంధువులు ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. జనం చనిపోతూ ఉంటే రాజకీయ నాయకులు చూస్తూ కూర్చోవటాన్ని తాము అంగీకరించబోమని ఈ బృందం చెప్పింది.

    తాజా నిరసనలకు దేశాధ్యక్షుడు జో బైడెన్ కూడా మద్దతు తెలిపారు. తుపాకుల నుంచి ప్రజలకు భద్రత కల్పించే చట్టాలు చేయాలని అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు.

    అయితే.. తుపాకీ చట్టాల్లో చేయతలపెట్టే మార్పులను రిపబ్లికన్లు అడ్డుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  3. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.