You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసదుద్దీన్ ఓవైసీ: ‘ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలి’
నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చట్టం కూడా తన పని చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.
లైవ్ కవరేజీ
సోనియా గాంధీ: కోవిడ్ సమస్యతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు
నేటి ముఖ్యాంశాలు
- ఐక్యరాజ్యసమితిలో ముఖ్యమైన సమాచారాన్ని హిందీ సహా అధికార, అనధికార భాషల్లో అందించటాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ ఆమోదించింది.
- బీజేపీ సస్పెండ్ చేసిన పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, బీజేపీ బహిష్కరించిన పార్టీ నాయకుడు నవీన్ జిందాల్‌లు.. మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
- చెప్పులు వేసుకొని తిరుమల మాడ వీధుల్లో నడవడంపై నయనతార-విఘ్నేశ్ దంపతులు క్షమాపణలు చెప్పారు.
- మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని అసదుద్దీన్ ఒవైసీడిమాండ్ చేశారు.
- చైనా నుంచి తైవాన్‌ను స్వతంత్రంగా మార్చే ఏ ప్రయత్నమైనా... సైనిక చర్యను ప్రేరేపిస్తుందని అమెరికాను చైనా హెచ్చరించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
‘జల్ జీవన్ మిషన్’ 20 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీరందించిందా?
అమెరికాకు చైనా హెచ్చరిక: 'తైవాన్ స్వతంత్రం కోసం ప్రయత్నిస్తే యుద్ధం తప్పదు'
నూపుర్ శర్మ: ‘ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆమెను అరెస్ట్ చేయాలి’- అసదుద్దీన్ ఓవైసీ
మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని అసదుద్దీన్ ఒవైసీడిమాండ్ చేశారు .
గుజరాత్‌లోని భుజ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై ఎంఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఆరోపణలు చేశారు. సకాలంలో నూపుర్ శర్మపై పార్టీ చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో ఇంత పెద్ద వివాదం చెలరేగిందని వ్యాఖ్యానించారు.
‘‘నూపుర్ శర్మను ఇంకా అరెస్ట్ చేయడం లేదు. చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేయాలి. మీరు ఆమెపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు’’ అని ప్రశ్నించారు.
నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చట్టం కూడా తన పని చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.
నూపుర్ శర్మ ఒక టీవీ డిబేట్‌లో మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. అనేక నగరాల్లో రాళ్లదాడి, కాల్పులు, నిప్పంటించడం లాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ హింసాత్మక ఘటనలపై అసదుద్దీన్ మాట్లాడుతూ... ప్రజలు, హింసకు పాల్పడకూడదని అన్నారు. అలాగే పోలీసులు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు.
అమెరికాలో మండిపోతున్న ధరలు... 40 ఏళ్ల గరిష్టానికి పెరిగిన ద్రవ్యోల్బణం
ఎనిమిదేళ్లలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరింత తేలిక చేశాం: ప్రధాని మోదీ
‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’ సూత్రంతో తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో.. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాలం చెల్లిన చట్టాలను తొలగించి, పలు సంస్కరణలను ప్రవేశపెట్టిందని.. తద్వారా దేశంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరింత మెరుగుపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
గత ఎనిమిదేళ్లలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణల గురించి ట్వీట్ల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనివల్ల ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాదిలో 8.7 శాతం వృద్ధి చెందింది. ఇది.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు.
దీనితోపుట.. పెరుగుతున్న జీడీపీ గురించి కూడా మోదీ ప్రస్తావించారు.
కోవిడ్‌తో చనిపోయిన భర్త అస్థికలను ఆమె లాకెట్‌లో పెట్టుకుని బతుకుతున్నారు...
కోవిడ్ వల్ల వాసన శక్తి కోల్పోయినప్పుడు ఎదురయ్యే 6 సమస్యలివే...
పాదరక్షలతో తిరుమల మాడవీధుల్లో సంచారం.. నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతుల క్షమాపణ, తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం
జూన్ 9వ తేదీన పెళ్లిచేసుకున్న సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు.. ఆ మరుసటి రోజు శుక్రవారం నాడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
అయితే, నయనతార, విఘ్నేశ్ శివన్‌లు చెప్పులు వేసుకుని తిరుమాడ వీధుల్లో నడవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై టీటీడీ చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ బీబీసీతో మాట్లాడారు. మాడవీదుల్లో ఎవరూ పాదరక్షలతో తిరగకూడదని.. నయనతార పాదరక్షలతో కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారని ఆయన చెప్పారు.
దీనిపై నయనతార దంపతులకు టీటీడీ నోటీసులు జారీ చేసిందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు నయనతార క్షమాపణలు చెప్పారని ఆయన తెలిపారు.
‘‘ఈ వివాదంపై నయనతార, విగ్నేశ్ శివన్ దంపతులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. తిరుపతిలో వివాహం చేసుకోవాలని అనుకున్నామనీ.. కొన్ని కారణాల వల్ల చెన్నైలో చేసుకున్నామని చెప్పారు. వివాహం అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చామనీ, రద్దీ కారణంగా త్వరగా పోటో తీసుకోవాలనే ఆతృతలో పాదరక్షలతో వచ్చేశామని వివరణ ఇచ్చారు’’ అని ఆయన పేర్కొన్నారు.
నిత్యం దేవాలయాలకు వెళ్లే దంపతులమని, దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్న వాళ్లమనీ.. గత 30 రోజుల్లో ఐదుసార్లు తిరుమలకు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఈ పొరపాటుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని ఈ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
పీటర్ ద గ్రేట్‌తో తనను పోల్చుకున్న పుతిన్.. యుక్రెయిన్ యుద్ధం ఆక్రమణే అని చాటిన రష్యా అధ్యక్షుడు
గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు: ‘ఇక్కడ మాకేం భయం లేదు.. మాపై వివక్ష లేదు’
Ramsay Hunt syndrome: జస్టిన్ బీబర్‌ను బాధపెడుతున్న ఈ వ్యాధి ఎలాంటిది?
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం: జార్ఖండ్‌లో హింసాత్మక నిరసనలు, ఇద్దరు మృతి
బీజేపీ సస్పెండ్ చేసిన పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, బీజేపీ బహిష్కరించిన పార్టీ నాయకుడు నవీన్ జిందాల్‌లు.. మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం ప్రార్థనల అనంతరం మొదలైన ఈ నిరసనలో రాళ్లు విసరటం, పలు వాహనాలకు నిప్పుపెట్టటం, ఆస్తుల విధ్వంసం జరిగింది.
ఈ హింసలో గాయపడ్డ ఇద్దరు చనిపోయారని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) అధికారులు ధృవీకరించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.
జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి హింస చెలరేగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉన్నా అదుపులో ఉందని రాంచీ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ అనిష్ గుప్తా చెప్పారు.
మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యల పట్ల అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం.. పంజాబ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి.
ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషకు స్థానం.. భారత తీర్మానానికి సర్వసభ్య సభ ఆమోదం
ఐక్యరాజ్యసమితిలో ముఖ్యమైన సమాచారాన్ని హిందీ సహా అధికార, అనధికార భాషల్లో అందించటాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ ఆమోదించింది. భారతదేశం ప్రతిపాదించిన ఈ తీర్మానంలో తొలిసారిగా హిందీ భాషను ప్రస్తావించారు.
‘‘మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఈ తీర్మానంలో హిందీ భాష ప్రస్తావన వచ్చింది. బంగ్లా, ఉర్దూ భాషల ప్రస్తావన కూడా ఈ తీర్మానంలోకి తొలిసారిగా వచ్చింది. ఈ చేర్పులను మేం ఆహ్వానిస్తున్నాం’’ అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టి.ఎస్.త్రిమూర్తి తెలిపారు.
బహుభాషా విధానం ఐరాస కీలక విలువల్లో ఒకటి అని ఆయన చెప్పారు. దీనికి ప్రాధాన్యం ఇచ్చినందుకు ఐరాస సెక్రటరీ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ (డీజీసీ)తో భారతదేశం 2018 నుంచి భాగస్వామ్యంతో పనిచేస్తోంది. వార్తలు, మల్టీమీడియా సమాచారాన్ని హిందీ భాషలో క్రోడీకరించటానికి అదనపు బడ్జెట్‌ను అందిస్తోంది’’ అని త్రిమూర్తి వివరించారు.
ఇందులో భాగంగా 2018లో ‘Hindi @ UN’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితిని హిందీ భాషలో ప్రజల దగ్గరకు తీసుకెళ్లటం, హిందీ మాట్లాడే కోట్లాది మందిలో ప్రపంచ అంశాలపై అవగాహన పెంపొందించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలు ఐక్యరాజ్యసమితి ఆరు అధికారిక భాషలుగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కార్యనిర్వాహక భాషలుగా ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలు కొనసాగుతున్నాయి.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.