బోరిస్ జాన్సన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా మద్దతు కోరుతూ ఎంపీలకు బ్రిటన్ ప్రధాని లేఖలు

ఈ ఓటింగ్‌లో ఓడిపోతే, ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కన్వర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. సల్మాన్ ఖాన్‌ను, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. ఎఫ్ఐఆర్ నమోదు

    సలీమ్ ఖాన్, సల్మాన్ ఖాన్

    ఫొటో సోర్స్, ANI

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లకు చంపేస్తామంటూ ఆదివారం బెదిరింపు లేఖ అందింది. దీనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    ఆదివారం నాడు రోజు వారీ ఉదయపు నడక ముగించుకుని బాంద్రాలోని బాండ్‌స్టాండ్ వద్ద ఒక బెంచీ మీద కూర్చుని ఉన్న సలీమ్ ఖాన్ వద్దకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఈ లేఖను ఇచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.

    సలీమ్ ఖాన్‌ను, సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామనే బెదిరింపులు ఆ లేఖలో ఉన్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

    ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచి 8:00 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

    సలీమ్ ఖాన్ తన భద్రతా సిబ్బంది సాయంతో పోలీసులను సంప్రదించారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 506(2) కింద కేసు నమోదు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. 26 మంది యాత్రికుల మృతి

    ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక యాత్రికుల బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 26 మంది యాత్రికులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

    ఈ యాత్రికులు మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన వారని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది. వీరు ఉత్తరకాశిలోని యమునోత్రి ఆలయానికి వెళుతుండగా 94వ నంబర్ జాతీయ రహదారి మీద రిఖావు ఖాడ్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.

    ప్రమాదానికి గురైనపుడు బస్సులో 28 మంది యాత్రికులు సహా మొత్తం 30 మంది ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    బస్సు ప్రమాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఉత్తరాఖండ్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

    ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించటానికి ఏర్పాట్లు చేయటం జరిగిందని, మృతదేహాలన్నిటినీ బయటకు తీశారని ఆయన ఒక ట్వీట్‌లో చెప్పారు. ‘‘మృతుల కుటుంబాలతో మేం మాట్లాడుతున్నాం’’ అని పేర్కొన్నారు.

    రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్‌లు ఈ ప్రమాదం పట్ల సంతాపం తెలిపారు.

    మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50 వేలు చొప్పున సాయం అందిస్తామన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  3. నైజీరియాలో చర్చి మీద దుండగుల కాల్పులు.. 50 మంది మృతి

    నైజీరియాలో చర్చి మీద కాల్పులు

    నైజారియాలోని నైరుతి రాష్ట్రం ఓండో రాష్ట్రంలో ఓ చర్చిలో ఆదివారం నాడు ప్రార్థనలు చేస్తున్న జనం మీద సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 50 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

    ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో కాల్పులు జరిపిన సాయుధులు.. చర్చి పూజారిని, కొందరు భక్తులను కిడ్నాప్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    ‘‘నరక లోకపు రాక్షసులు మాత్రమే ఈ దురాగతానికి తెగబడగలరు’’ అని నైజారియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ వ్యాఖ్యానించారు.

    ఈ దాడిలో చనిపోయిన వారి సంఖ్య గానీ, అపహరణకు గురైన వారి సంఖ్య గానీ అధికారికంగా నిర్ధారించలేదు.

    కొందరు భక్తుల మృతదేహాలను ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు స్థానిక ఆస్పత్రి వైద్యుడు ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు రాష్ట్ర శాసనసభ్యుడు ఒగున్మోలాసుయి ఒలువొలె చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది.

    ఇటీవలి నెలల్లో నైజీరియాలో హింస పెరిగింది. దేశమంతటా కిడ్నాప్‌లు, దాడులు జరుగుతున్నాయి.

    నైజీరియాలో చర్చి మీద కాల్పులు
  4. ‘యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తే కొత్త లక్ష్యాలపై దాడు చేస్తాం’ – పుతిన్ హెచ్చరిక

    వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు దూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను సరఫరా చేసినట్లయితే యుక్రెయిన్‌లో తాము దాడులు చేసే లక్ష్యాల జాబితాను విస్తరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

    పుతిన్ ఆదివారం నాడు రష్యా ప్రభుత్వ టీవీ చానల్‌లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యుక్రెయిన్‌కు ‘‘అదనపు ఆయుధాలను సరఫరా చేస్తామంటున్న ఈ గొడవ అంతటికీ ఒకటే లక్ష్యం.. ఈ సాయుధ సంఘర్షణను ఎంత కాలం వీలైతే అంత కాలం సాగదీయటం’’ అని వ్యాఖ్యానించారు.

    కీయెవ్ నగరం మీద తాజా దాడులు

    ఫొటో సోర్స్, Reuters

    మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరం మీద కొన్ని వారాల విరామం తర్వాత ఆదివారం నాడు తొలిసారి గగనతల దాడులు జరిగాయి.

    యూరప్ దేశాలు సరఫరా చేసిన యుద్ధ ట్యాంకుల మీద తాము దాడులు చేసినట్లు రష్యా చెప్తోంది. అయితే రైల్వే మరమ్మతు పరిశ్రమ మీద దాడులు జరిగాయని యుక్రెయిన్ చెప్తోంది.

    ఇదిలావుంటే దోన్బాస్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైనిక జనరల్ ఒకరు చనిపోయారు.

    మార్చి చివర్లో కీయెవ్ నగరం నుంచి వెనుదిరిగిన రష్యా.. దోన్బాస్ ప్రాంతం మీద తన సైనిక చర్యలను కేంద్రీకరించింది.

    హిమార్స్ రాకెట్ సిస్టమ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, అమెరికా తమ అధునాతన హిమార్స్ రాకెట్ వ్యవస్థలను యుక్రెయిన్‌కు అందిస్తామని ప్రకటించింది

    రష్యాతో తలపడుతున్న యుక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలను పంపిస్తామని పలు దేశాలు ప్రకటించాయి.

    అమెరికా తమ ఎం142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ (హిమార్స్)ను యుక్రెయిన్‌కు అందిస్తామని ప్రకటించింది. ఈ వ్యవస్థల ద్వారా 70 కిలోమీటర్ల వరకూ దూరంలోని లక్ష్యాల మీద కచ్చితమైన గురితో దాడి చేసే గైడెడ్ మిసైళ్లను పేల్చవచ్చు.

    బ్రిటన్ కూడా తమ ఎం270 మల్టిపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థలను యుక్రెయిన్‌కు అందిస్తుందని యూకే రక్షణ మంత్రి బెన్ వాలెస్ తాజాగా ప్రకటించారు. ఈ వ్యవస్థల ద్వారా ఒక నిమిషం వ్యవధిలో 12 రాకెట్లను పేల్చవచ్చు. అవి 80 కిలోమీటర్ల వరకూ దూరంలోని లక్ష్యాల మీద దాడి చేయగలవు.

    జర్మనీ సైతం తన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరిస్-టిని యుక్రెయిన్‌కు పంపిస్తామని హామీ ఇచ్చింది.

    బ్రిటన్ ఎం270 రాకెట్ వ్యవస్థలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, బ్రిటన్ కూడా తమ అధునాతన ఎం270 రాకెట్ వ్యవస్థలను యుక్రెయిన్‌కు పంపిస్తామని చెప్పింది
  5. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.