నేటి ముఖ్యాంశాలు...
- బంగ్లాదేశ్‌లోని సీతకుండ పట్టణంలో కంటైనర్ స్టోరేజి డిపోలో సంభవించిన భారీ పేలుడుకు 16 మంది చనిపోయారు.
- బీజేపీ తన అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
- హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలిక కారులో సామూహిక అత్యాచారానికి గురైనట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
- దిల్లీలోని మంగేశ్‌పూర్‌లో ఆదివారం గరిష్టంగా 47.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
- బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఆయన కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.