నేటి ముఖ్యాంశాలు
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
- చైనాలోని గియుఝో ప్రావిన్స్‌లో శనివారం వేగంగా వెళుతున్న బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ చనిపోగా ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
- ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 36 మందిని అరెస్ట్ చేశామని, మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు.
- హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలిచింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్టేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.