క్వినెస్ జెంగ్: ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో నెలసరి నొప్పి.. మ్యాచ్ ఓడిపోయిన చైనా క్రీడాకారిణి

‘‘ఇది అమ్మాయిల సమస్య. మొదటి రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మరింత నొప్పిగా ఉంటుంది’’అని జెంగ్ అన్నారు.

లైవ్ కవరేజీ

పద్మ మీనాక్షి

  1. "130 కోట్ల జనాభాకు ప్రధాన సేవకుడిని మాత్రమే" - మోదీ

    మోదీ

    ఫొటో సోర్స్, ANI

    "గత 8 ఏళ్లలో నన్ను నేను ఎన్నడూ ఒక ప్రధాన మంత్రిగా భావించలేదు. పత్రాల పై సంతకాలు చేస్తున్న సమయంలో మాత్రమే నాకు ప్రధాని బాధ్యతలు ఉంటాయి. ఒకసారి నా దగ్గర నుంచి ఫైల్ బయటకు వెళ్ళగానే, నేను ప్రధానిని కాదు. నేను 130 కోట్ల జనాభాకు ప్రధాన సేవకుడిని మాత్రమే. నా సర్వస్వం ఈ జనాభా మాత్రమే. నా జీవితం మీ కోసమే" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన పూర్తయిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

    "నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో స్టార్ట్ అప్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశంలో సులభంగా వ్యాపారం చేయవచ్చని చెబుతోంది" అని మోదీ అన్నారు.

    మోదీ10 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లను బదిలీ చేశారు.

    మోదీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.

  2. ఫైనల్‌కు చేరుకుంటున్న భారత్ పాక్‌ల మధ్య ఇండస్ నదీ జలాల సమావేశం

    పాకిస్తాన్‌ - భారత్

    ఫొటో సోర్స్, ANI

    భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న 118వ శాశ్వత ఇండస్ కమీషన్ సమావేశం మంగళవారం తుది దశకు చేరుకుంది. ఇరు దేశాల నుంచి సానుకూల సూచనలు కనిపిస్తున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఇండస్ నదీ జలాల ఒప్పందం (1960) ప్రకారం ఇరుదేశాల మధ్య ప్రతీ ఏటా వార్షిక సమావేశం చోటు చేసుకుంటుంది. సోమవారం భారత్‌లో మొదలయిన సమావేశంలో పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం వార్షిక సమావేశం చోటు చేసుకోవడం తప్పనిసరి.

    పాకిస్తాన్ బృందంలో సయెద్ ముహమ్మద్, మెహర్ అలీ షా, సాహిబ్ జాద్ ఖాన్, హబీబుల్లా బోడ్ల, సమన్ మునీబ్, ఖలీద్ మెహమూద్ ఉన్నారు.

    భారతీయ బృందానికి కొత్తగా నియమితులైన ఇండస్ కమీషనర్ ఏకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు.

    మూడు నెలల క్రితం ఇస్లామాబాద్‌లో 117వ ఇండస్ కమీషన్ చోటు చేసుకుంది.

  3. జమ్మూ - తీవ్రవాదుల కాల్పుల్లో హిందూ టీచర్ మరణం

    జమ్మూ

    ఫొటో సోర్స్, Ge

    జమ్మూ కశ్మీర్‌లోని కుల్‌గాంలో మంగళవారం ఒక మహిళా టీచర్‌ను తీవ్రవాదులు కాల్చి చంపినట్లు ఏఎన్‌ఐ వార్తా కథనం పేర్కొంది.

    ఈ సంఘటన గోపాల్‌పురాలోని హై స్కూల్ ప్రాంతంలో జరిగింది.

    మృతురాలు జమ్మూలోని సాంబా ప్రాంతానికి చెందినవారు.

    ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు.

    "కాల్పుల్లో గాయపడి ఆమె మృతి చెందారు. ఆమె హిందూ మతానికి చెందినవారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని త్వరలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం" అని కశ్మీర్ జోన్ పోలీస్ అధికారి చెప్పారు.

  4. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్

    హార్దిక్ పటేల్

    ఫొటో సోర్స్, ANI

    గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ జూన్ 02న బీజేపీలో చేరనున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.

    ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు.

  5. బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం విశాఖపట్నం వెళుతున్న రణబీర్ కపూర్, అయన్ ముఖర్జీ

    బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, దర్శకుడు అయన్ ముఖర్జీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో కనిపించాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    వీరు బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం బయలుదేరి వెళ్లినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. వీరిద్దరూ తెలుపు రంగు కుర్తా పైజామా ధరించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఆయన కళ్ళకు నల్లని కూలింగ్ గ్లాస్ లు, బ్రౌన్ కలర్ షూస్ ధరించారని ఏఎన్‌ఐ కథనం పేర్కొంది.

    ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నారు.

  6. క్యూఆర్‌ కోడ్‌ మోసాలను ఎలా గుర్తించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    దేశంలో QR Code ద్వారా చెల్లింపులు భారీగా పెరిగాయి. దీనినే ఆసరాగా చేసుకుని కొందరు జనాలను మోసం చేస్తున్నారు. ఆ మోసాలు ఎలా చేస్తారు? వాటిని ఎలా పసిగట్టాలి? అలాంటి వారి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  7. నేపాల్ విమాన ప్రమాదంలో అందరూ మృతి... 22 మృత దేహాలు గుర్తింపు

    నేపాల్ విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. మొత్తం 22 మృత దేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. బ్లాక్ బాక్స్‌ను కూడా రిట్రైవ్ చేసినట్లు తెలిపారు.

    వాతావరణం అనుకూలిస్తే మృత దేహాలను ఖాఠ్మాండు తరలిస్తామని నేపాల్ ఆర్మీ ప్రతినిధి వివరించారు.

    ఆదివారం ఉదయం పర్యాటక ప్రాంతమైన పొఖారా నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే తారా ఎయిర్‌కు చెందిన విమానం కూలి పోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. కె.లక్ష్మణ్: తెలంగాణ నుంచి రాజ్యసభకు తొలి బీజేపీ వ్యక్తి

    తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్

    ఫొటో సోర్స్, Facebook/Dr.K.Laxman

    తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ రాజ్యసభ సభ్యుడు కానున్నారు. ఈమేరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆయన్ను బీజేపీ నామినేట్ చేసింది.

    తెలంగాణ నుంచి బీజేపీ తరుపున రాజ్యసభకు ఎన్నికవుతున్న తొలి వ్యక్తిగా లక్ష్మణ్ నిలవనున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇంతవరకు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎవరూ వెళ్లలేదు.

    ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా ఆయన ఉన్నారు.

    ఇప్పటి వరకు మొత్తం 22 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. జూన్ 10న జరగనున్న ఎన్నికల ద్వారా 57 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయనున్నారు.

    నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది.

  9. హలో ఆల్! గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.