UPSC2021: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు వీళ్లే..

2021 వ సంవత్సరానికిగానూ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా మొదటి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు సివిల్స్ పరీక్షలో అర్హత సాధించారు. 50లోపు మూడు ర్యాంకులు వచ్చాయి.

లైవ్ కవరేజీ

శారద మియాపురం and బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  1. చికెన్‌: కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

  2. నేపాల్ విమాన ప్రమాదంలో అందరూ మృతి... 22 మృత దేహాలు గుర్తింపు

    నేపాల్ విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. మొత్తం 22 మృత దేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. బ్లాక్ బాక్స్‌ను కూడా రిట్రైవ్ చేసినట్లు తెలిపారు.

    వాతావరణం అనుకూలిస్తే మృత దేహాలను ఖాఠ్మాండు తరలిస్తామని నేపాల్ ఆర్మీ ప్రతినిధి వివరించారు.

    ఆదివారం ఉదయం పర్యాటక ప్రాంతమైన పొఖారా నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే తారా ఎయిర్‌కు చెందిన విమానం కూలి పోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. క్వినెస్ జెంగ్: ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో నెలసరి నొప్పి.. మ్యాచ్ ఓడిపోయిన చైనా క్రీడాకారిణి

  4. 'నా భర్త చైన్ స్మోకర్... నాకు క్యాన్సర్ వచ్చింది'

  5. నేటి ముఖ్యాంశాలు

    దిల్లీలోని కేజ్రీవాల్ ఆమ్ఆద్మీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

    2021 వ సంవత్సరానికిగానూ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా మొదటి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే ఉన్నారు. శృతి శర్మ మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్ రెండవ ర్యాంకు, గామిని సింగ్లా మూడవ ర్యాంకు, ఐశ్వర్య వర్మ నాలుగవ ర్యాంకు సాధించారు. యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంకు సాధించారు.

    దిల్లీలో సోమవారం సాయంత్రం కొద్దిసేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రంగా వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు కూడా కూలిపోయాయి. కొద్దిసేపు వెలుతురు తగ్గిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఎదురైంది.

    షాంఘై నగరంలో వ్యాపార కార్యకలాపాలపై విధించిన కోవిడ్ 19 లాక్‌డౌన్‌ను బుధవారం నుంచి ఎత్తేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    బెంగళూరులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్‌పై నల్ల ఇంకుతో దాడి జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    నేపాల్‌లో ఆదివారం కూలిపోయిన విమాన శకలాలు లభ్యమయ్యాయి. వీటి నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం సోమవారం 14 మృతదేహాలను వెలికితీసింది.

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదైనట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 17,698కి చేరింది.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

  6. తెలంగాణ: LED లైట్లతో డ్రాగన్ ఫ్రూట్ సాగు, ఎకరాకు రూ.15 లక్షల వరకు లాభం

  7. ‘ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయనుకున్నా...’ చిన్నప్పుడే విడిపోయిన అక్క, తమ్ముడు 42 ఏళ్ల తర్వాత ఎలా కలిశారు?

  8. ఆంధ్రప్రదేశ్: అడవిలో పక్షులు, జంతువుల దాహం తీరుస్తున్న వృద్ధుడు

  9. UPSC2021: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు వీళ్లే.., బళ్లా సతీశ్, బీబీసీ ప్రతినిధి

    56వ ర్యాంకర్ కొప్పిశెట్టి కిరణ్మయి, 161 ర్యాంకర్ బొక్క చైతన్య రెడ్డి
    ఫొటో క్యాప్షన్, 56వ ర్యాంకర్ కొప్పిశెట్టి కిరణ్మయి, 161 ర్యాంకర్ బొక్క చైతన్య రెడ్డి

    2021 వ సంవత్సరానికిగానూ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా మొదటి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే ఉన్నారు.

    శృతి శర్మ మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్ రెండవ ర్యాంకు, గామిని సింగ్లా మూడవ ర్యాంకు, ఐశ్వర్య వర్మ నాలుగవ ర్యాంకు సాధించారు.

    యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంకు సాధించారు.

    టాపర్ శృతి శర్మ దిల్లీ విశ్వవిద్యాలయం, జేఎన్యూలలో చదివారు. అంకిత అగర్వాల్ కూడా దిల్లీ యూనివర్సిటీలో చదివారు.

    మొత్తం దేశవ్యాప్తంగా 685 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, వారిలో జనరల్ కేటగిరీ 244 మంది, ఈడబ్ల్యుఎస్ (ఆర్థికంగా వెనుకబడ్డ జనరల్ కేటగిరీ) 73 మంది, ఓబీసీ 203 మంది, ఎస్సీ 105 మంది, ఎస్టీ 60 మంది ఎంపిక అయ్యారు.

    వీరిలో ఐఎఎస్ 180 మంది, ఎఎఫ్ఎస్ 37 మంది, ఐపిఎస్ 200 ఎంపిక చేసుకున్నారు. 2022 జనవరిలో వ్రాత పరీక్ష, 2022 ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్వ్యూలు జరిగాయి.

    తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు సివిల్స్ పరీక్షలో అర్హత సాధించారు. 50లోపు మూడు ర్యాంకులు వచ్చాయి.

    తెలుగు రాష్ట్రాల నుంచి వందలోపు ర్యాంకులు వచ్చిన అభ్యర్థుల వివరాలు:

    • యశ్వంత్ కుమార్ రెడ్డి – 15
    • పూసపాటి సాహిత్య – 24
    • మంత్రి మౌర్య భరద్వాజ్ -28
    • కొప్పిశెట్టి కిరణ్మయి – 56
    • తిరుమాని శ్రీపూజ – 62
    • పాణిగ్రాహి కార్తీక్
    • గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి – 69
    • మాలెంపాటి నారాయణ అమిత్ – 70
    • మాదాల తరుణ్ పట్నాయక్ – 99

    వీరు కాకుండా ఆకునూరి నరేశ్, కన్నెధార మనోజ్ కుమార్, చైతన్య రెడ్డి, ఆకవరం సస్య రెడ్డి, కమలేశ్వర రావు, నల్లమోతు బాలకృష్ణ, ఉప్పులూరు చైతన్య, సంతోష్‌ కుమార్ రెడ్డి, మన్యాలఅనిరుధ్, బిడ్డి అఖిల్, ముత్యపు పవిత్ర, గొల్ల రాజారత్నం, ధరావత్ సాయి ప్రకాశ్, బచ్చు స్మరణ్ రాజ్ లు కూడా ర్యాంకు సాధించిన వారిలో ఉన్నారు.

    తెలుగు వారిలో నర్సీపట్నంకు చెందిన మంత్రిమౌర్య భరద్వాజ్ జాతీయ స్థాయిలో 28వ ర్యాంకు సాధించారు. ఈయన వరంగల్ నిట్ లో చదివారు. ఆయన తండ్రి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు కాగా, తల్లి వైద్య శాఖ ఉద్యోగిని. 2017 నుంచి సివిల్స్ కి సన్నద్ధం అవుతున్నారు.

    డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి కాకినాడకు చెందిన వ్యక్తి.

    వరంగల్ జిల్లాకు చెందిన బొక్క చైతన్య రెడ్డికి 161 ర్యాంక్ లభించింది. చైతన్య ప్రస్తుతం నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు.

    28 ర్యాంకు సాధించిన మంత్రి మౌర్య భరద్వాజ్
    ఫొటో క్యాప్షన్, 28 ర్యాంకు సాధించిన మంత్రి మౌర్య భరద్వాజ్
  10. బ్రేకింగ్ న్యూస్, దిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

    సత్యేందర్ జైన్

    ఫొటో సోర్స్, facebook/AAPSatyendarJain

    దిల్లీలోని కేజ్రీవాల్ ఆమ్ఆద్మీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

    కోల్‌కతాకు చెందిన ఒక కంపెనీ హవాలా లావాదేవాల కేసుకు సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

    కాగా, సత్యేందర్ జైన్‌పై పెట్టింది ఫేక్ కేసు అని, గత ఎనిమిదేళ్లుగా ఇది కొనసాగుతూనే ఉందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు.

    చాలా సంవత్సరాలుగా ఈ కేసు విచారణకు సత్యేందర్ జైన్‌ను ఈడీ పిలుస్తూనే ఉందని, అయినా ఏమీ కనుగోలేకపోయిందని పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్నారని, అందుకే ఈ అరెస్ట్ జరిగిందని ఆరోపించారు.

    ఈ కేసు బోగస్ కాబట్టి, ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి కొన్ని రోజుల్లోనే ఆయన విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  11. UPSC 2021: మొదటి ముగ్గురు టాపర్స్ మహిళలే

    కార్టూన్

    ఫొటో సోర్స్, bbc

  12. దిల్లీలో ఈదురుగాలులు, వర్షం.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లో విరిగిపడ్డ చెట్లు

    ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లో విరిగిపడ్డ చెట్లు
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లో విరిగిపడ్డ చెట్లు

    దిల్లీలో సోమవారం సాయంత్రం కొద్దిసేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

    తీవ్రంగా వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు కూడా కూలిపోయాయి. కొద్దిసేపు వెలుతురు తగ్గిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఎదురైంది.

    ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్‌లో కొన్ని చెట్లు కూలిపోయాయి.

    తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్, ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌లు ఆస్తి నష్టాన్ని పరిశీలించారు.

    వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లో విరిగిపడ్డ చెట్లు
    ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లో విరిగిపడ్డ చెట్లు
  13. ‘పుతిన్‌‌కు క్యాన్సర్’ పుకారేనా? ఆయన అనారోగ్యంపై రష్యా ఏమంటోంది?

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యానికి గురయ్యారని వస్తున్న వదంతులను ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఖండించారు.

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిరోజూ బహిరంగంగా కనిపిస్తున్నారని, తెలివిగల వాళ్లు ఎవరికీ ఆయన అనారోగ్యానికి గురయ్యారనే సంకేతాలు కనిపించవని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.

    ఫ్రెంచ్ టీవీ టీఎఫ్1 ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    పుతిన్ ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బహుశా ఆయనకు క్యాన్సర్ సోకి ఉండొచ్చని పలు నిరాధార మీడియా వార్తలు వెలువడుతున్నాయి.

  14. Monkeypox: మంకీపాక్స్ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా? ఇది బయోలాజికల్ ఆయుధమా? లాక్‌డౌన్లు తప్పవా?

  15. షాంఘైలో వ్యాపారాలపై లాక్‌డౌన్ ఎత్తేసిన చైనా

    షాంఘై

    ఫొటో సోర్స్, Getty Images

    షాంఘై నగరంలో వ్యాపార కార్యకలాపాలపై విధించిన కోవిడ్ 19 లాక్‌డౌన్‌ను బుధవారం నుంచి ఎత్తేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    ఈ నియంత్రణల వల్ల నగరంలో వ్యాపార వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో నగర ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ప్రణాళికలు కూడా ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.

    చైనాలో ప్రముఖ వాణిజ్య ప్రాంతమైన షాంఘై దాదాపు రెండు నెలల పాటు కఠినమైన లాక్‌డౌన్‌లో ఉంది.

    కాగా, చైనా రాజధాని నగరం బీజింగ్‌లో పౌర రవాణా వ్యవస్థలు కొన్నింటిని పాక్షికంగా ప్రారంభించారు.

    కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని షాపింగ్ మాల్స్‌, ఇతర వేదికలను కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.

    షాంఘైలో 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆదివారం 122గా నమోదైంది. శనివారం ఈ సంఖ్య 170గా ఉంది.

    కేసుల సంఖ్య తగ్గడంతో కోవిడ్ 19 మార్గదర్శకాలను, ఉద్యోగులు విధుల్లోకి తిరిగి వచ్చే మార్గదర్శకాలను పునఃసమీక్షిస్తామని అధికారులు ప్రకటించారు.

    జూన్ 1వ తేదీ నుంచి పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. పరిశ్రమలు తిరిగి ప్రారంభం కావడానికి అవి ఇకపై ‘వైట్‌లిస్ట్’లో ఉండాల్సిన పనిలేదు.

  16. యూపీఎస్‌సీ 2021 ఫలితాల విడుదల, టాపర్‌గా శ్రుతి శర్మ

    యూపీఎస్‌సీ

    ఫొటో సోర్స్, ANI

    యూపీఎస్‌సీ- 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తొలి మూడు ర్యాంకులను అమ్మాయిలే సాధించారు.

    సివిల్స్ టాపర్‌గా శ్రుతి శర్మ నిలవగా... అంకిత అగర్వాల్ రెండో ర్యాంకును, గామిని సింగ్లా మూడో ర్యాంకును దక్కించుకున్నారు. మొత్తం 685 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

    పూర్తి ఫలితాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూడవచ్చు.

    యూపీఎస్‌సీ

    ఫొటో సోర్స్, goi

  17. Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ అంటే ఏంటి? బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

  18. ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనే బీజేపీ డిమాండ్, హిందువులకే చేటు చేస్తుందా?

  19. రాకేశ్ టికాయత్‌పై నల్ల ఇంకుతో దాడి

    బెంగళూరులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్‌పై నల్ల ఇంకుతో దాడి జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    స్థానిక పోలీసులు తనకు ఎలాంటి భద్రతను కల్పించలేదని, ఈ ఘటనలో ప్రభుత్వ ప్రమేయం ఉందని రాకేశ్ టికాయత్ ఆరోపించినట్లు ఏఎన్ఐ చెప్పింది.

    రాకేశ్ టికాయత్‌పై ఇంకు చల్లినందుకుగానూ హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  20. ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?