తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

    శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు

    ఫొటో సోర్స్, ugc

    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు

    ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది.

    విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలోని గరివిడిలో 17 సెం.మీ., చీపురుపల్లిలో 13, తెర్లాంలో 12 సె.మీ. వర్షపాతం కురిసింది.

    ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు తిరుపతిలోనూ 3 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది.

    శ్రీకాకుళం

    ఫొటో సోర్స్, ugc

    ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు ఎత్తారు. శనివారం సాయంత్రానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లినట్లు గేట్ల పర్యవేక్షణ ఈఈ చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

    కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంకరేవు వద్ద వశిష్ఠగోదావరి అనుబంధ పాయలోని తాత్కాలిక దారి తెగిపోయింది. 4 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.

    విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు అడుగుమేర ఎత్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి జలాశయం 2 గేట్లు ఎత్తారు.

  2. అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు

  3. Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?

  4. హజ్‌ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?

  5. గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది

  6. తెలంగాణ: అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు.. మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు, శుభం ప్రవీణ్ కుమార్, బీబీసీ కోసం

    వర్షాలు

    ఫొటో సోర్స్, ugc

    అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

    ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలోని గోదావరి, ప్రాణహిత బేసిన్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది.

    మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.

    గడిచిన 7 గంటల్లో అత్యధికంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాటారంలో 32.3 సెం.మీ., ముత్తారం మహదేవ్‌పూర్‌లో 32 సెం.మీ., నిర్మల్ జిల్లా ముధోల్‌లో 22.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

    వర్షాలు

    ఫొటో సోర్స్, ugc

    నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 48.94 టీఏంసీల నీరు నిల్వ ఉంది. దీని పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు.

    కృష్టా పరివాహక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.

    ఆదిలాబాద్‌లోని ముధోల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భైంసాలోనూ ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది.

  7. అమెరికా అబార్షన్ హక్కుల కోసం వైట్‌హౌస్ వెలుపల మహిళల నిరసన

    అబార్షన్ హక్కులు

    ఫొటో సోర్స్, EPA

    అబార్షన్ హక్కుల కోసం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో వేల మంది మహిళలు నిరసనలు చేపట్టారు.

    రెండు వారాల క్రితం ‘‘రో వర్సెస్ వేడ్’’ కేసులో అమెరికా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 50ఏళ్ల క్రితం అబార్షన్‌ను దేశ వ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును కోర్టు కొట్టివేసింది.

    దీనికి వ్యతిరేకంగా శనివారం వేల మంది మహిళలు వైట్‌హైస్ వెలుపల నిరసన చేపట్టారు. ‘‘మేం హక్కుల విషయంలో వెనకడుగు వేయాలని అనుకోవట్లేదు’’అని వారు నినాదాలు చేశారు.

    అబార్షన్ హక్కులను పరిరక్షించే ఒక ఆదేశంపై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పుకు ఆయన వ్యతిరేకంగా వెళ్లలేరు.

    ‘‘బైడెన్ అధికారానికి పరిమితులు ఉన్నాయని తెలుసు. కానీ, ఆ పరిమితులకు ఎదురువెళ్లి ఆయన మా హక్కులను పరిరక్షించాలి’’అని నిరసనలు చేపడుతున్న రేచల్ కర్మోనా వ్యాఖ్యానించారు.

  8. ‘దేశాన్ని బీజేపీకి రాసివ్వలేదు... టీఆర్ఎస్, జాతీయ పార్టీగా మారితే తప్పేంటి?’- కేసీఆర్

  9. Sri Lanka: అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెడుతుంటే ఎవరూ ఆపలేకపోయారు

  10. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    శ్రీలంకలో తాజా పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఈ లింకును క్లిక్ చేయండి.

  11. బ్రేకింగ్ న్యూస్, శ్రీలంక: ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు

    ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు
    ఫొటో క్యాప్షన్, ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు

    శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.

    కొలంబోలోని ప్రధాని నివాసం ముందు కొన్ని గంటలుగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.

    ‘‘ప్రధాని రణిల్ విక్రమ సింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడిన నిరసనకారులు నిప్పంటించారు’’ అని ఆయన కార్యాలయ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తన పదవికి రాజీనామా చేసేందుకు విక్రమసింఘే అంగీకరించిన కొంతసేపటికే ఈ ఘటన జరిగింది. పదవికి రాజీనామా చేస్తానని రణిల్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  12. ఆంగ్లేయులను 26 నిమిషాల్లోనే ఓడించిన అమెరికా ‘హైదర్ అలీ’ ఎవరు?

  13. ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్‌ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..

  14. శ్రీలంక: అధ్యక్ష భవనాన్ని నిరసనకారులు ఎలా ముట్టడించారో చూడండి...

    అధ్యక్ష భవనం

    ఫొటో సోర్స్, epa

    కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాదిమంది ప్రజలు ముట్టడిస్తున్నట్లు తెలిపే వీడియోను శ్రీలంక వార్తా సంస్థ న్యూస్ వైర్ విడుదల చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆ వీడియోలో వేలాదిమంది నిరసనకారులు, అధ్యక్ష భవనంలోకి వెళ్లడాన్ని చూడొచ్చు.

    శ్రీలంకలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతకు నిరసనగా శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

    ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కొలంబోకు చేరుకొని అధ్యక్ష నివాసం వద్ద గుమిగూడారు.

    గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ఆందోళనకారులు భారీగా తరలిరావడంతో అధికారులు వారిని ఆపలేకపోయారు.

    సోషల్ మీడియాలో కనిపిస్తోన్న వీడియో ఫుటేజీల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంలో తిరుగుతూ, విలాసవంతమైన గదుల్లో విశ్రాంతి తీసుకుంటూ, స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  15. వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా

  16. శ్రీలంక: దేశాధ్యక్షుడు, ప్రధాని నివాసాలపై ప్రజల దండయాత్ర.. పారిపోయిన గొటాబయ, రాజీనామాకు సిద్ధమన్న పీఎం

  17. దేశాధ్యక్షుడి ఇంటిపై ప్రజల దండయాత్ర.. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టిన నిరసనకారులు

  18. వైఎస్సాఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్

    ప్లీనరీ, జగన్

    ఫొటో సోర్స్, YSRCP/ FACEBOOK

    వైఎస్సాఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

    అనంతంర వైఎస్ జగన్ ప్లీనరీ ముగింపు ప్రసంగం చేశారు. విజయవాడ- గుంటూరు మధ్య మహా సముద్రం కనిపిస్తోందని, ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా ఉందని ఆయన అభివర్ణించారు.

    ‘’13 ఏళ్లుగా నాపై ఇదే ప్రేమ, అభిమానం, నమ్మకం చూపిస్తున్నారు. వర్షం పడుతున్న ఎవరూ చెదరలేదు. ఇది ఆత్మీయుల సునామీ. మహా సైన్యానికి ప్రేమతో సెల్యూట్ చేస్తున్నా. కార్యకర్తల కష్టం వల్లనే మన ప్రభుత్వం ఏర్పడింది. నన్ను టార్గెట్ చేసిన పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్, టీడీపీలు కలిసి నాపై అక్రమ కేసులు పెట్టాయి. ఓదార్పు యాత్ర చేయొద్దని వ్యతిరేకించాయి. ఆనాడు లొంగిపోయి ఉంటే ఈరోజు జగన్ మీ ముందు ఉండేవాడు కాదు. దేవుడు స్క్రిప్టు మరోలా రాశాడు. ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై నేడు 150 మందికి చేరాం. ఒక్క ఎంపీ నుంచి 22మందికి చేరాం. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. జగన్ కనపడకుండా పోవాలని కుట్రలు చేశారు’’ అని అన్నారు.

    ప్లీనరీ

    ఫొటో సోర్స్, yspcp/face book

    టీడీపీని పెత్తందార్ల పార్టీ అని పిలిచారు. ‘వెన్నుపోటు’ అనేది చంద్రబాబు పార్టీ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వమే కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా మార్చిందని గుర్తు చేశారు.

    ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించడమే మా లక్ష్యం. అందుకే బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. కానీ, చంద్రబాబు దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా 19వేల కోట్లు చెల్లించాం. నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ధర్మం వైపు మనం ఉన్నాం, అధర్మం వైపు వాళ్ళు ఉన్నారు. మూడేళ్లలో మేనిఫెస్టోలో పేర్కొన్న 95 శాతం హామీలు నెరవేర్చాం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నాం. జగన్ చెప్పేది నిజమని నమ్మితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి’’ అంటూ ఆయన ప్రసంగించారు.

  19. అమర్‌నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్: ‘నేను, నా కుటుంబం సేఫ్.. కళ్లముందే టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయి’

  20. Investment: మ్యూచువల్ ఫండ్స్ వాడుకుని ఇల్లు కొనుక్కోవచ్చా?