తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
ఉబర్: వ్యాపారంలో లాభాల కోసం చట్టాల్ని మార్చేందుకు నేతలతో లాబీయింగ్.. లీకైన పత్రాలు చెప్పిన రహస్యం
మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?
వరవరరావుకు బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI
బీమా కోరెగామ్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు అనారోగ్య పరిస్థితుల రీత్యా మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు పొడిగించింది.
వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్‌పై జూలై 19న విచారిస్తామని జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
ఎన్ఐఏ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, ఈకేసును రేపటికి వాయిదా వేయాలని కోరారు. బాంబే హైకోర్టు, వరవరరావుకు ఇచ్చిన మెడికల్ బెయిల్ నేటితో ముగుస్తుందని, దీన్ని పొడిగించవచ్చని అన్నారు.
దీనికి రావు తరఫున వాదిస్తోన్న సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
దీంతో ఈ కేసును జూలై 19కి వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు ఆయన బెయిల్‌ను పొడిగించింది.
శాశ్వత బెయిల్ కావాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను తొలుత బాంబే హైకోర్టును తిరస్కరించింది. బాంబే హైకోర్టు తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
జార్ఖండ్ గఢ్వా జిల్లాలోని ఒక పాఠశాల తాజాగా వార్తల్లో నిలిచింది. కోర్వాడీ గ్రామంలోనున్న ఈ స్కూల్ గురించి జులై 4న ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘ఇక్కడ ఉండే ప్రజల్లో 75 శాతం మంది ముస్లింలే ఉన్నారు. కాబట్టి నిబంధనలు కూడా మాకు అనుగుణంగానే ఉండాలి’’అనే శీర్షిక ఆ వార్తకు పెట్టారు.
ఈ స్కూల్‌పై స్థానిక ముస్లింలు ఒత్తిడి తీసుకొచ్చి ప్రార్థన చేసే విధానాన్ని మార్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఇకపై చేతులు జోడించి చేసే నమస్కారానికి బదులుగా ఇక్కడి విద్యార్థులు చేతులు కట్టుకొని ప్రార్థన చేస్తారని వివరించారు.
ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
శ్రీలంక అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస తాను దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తానని బీబీసీతో చెప్పారు. పారిపోయిన దేశాధ్యక్షుడు గొటాబయ ఆ పదవి నుంచి అధికారికంగా తప్పుకున్న తరువాత తాను బరిలోకి దిగుతానని సజిత్ అన్నారు.
సజిత్ నేతృత్వంలోని సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ)పార్టీ మిత్రపక్షాలతో చర్చలు జరిపిన తరువాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు.
అనూహ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రజాందోళనలు తీవ్రంగా మారాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
దేశంలో నగదు నిల్వలు హరించుకుపోయాయి. కనీస అవసరాలైన ఆహారం, ఇంధనం, ఔషధాలు కూడా ఆ దేశం దిగుమతి చేసుకోలేకపోతోంది.
అధ్యక్షుడు రాజపక్ష తాను ఈ వారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తదుపరి అధ్యక్షుడిని జూలై 20 ఎన్నుకుంటామని పార్లమెంట్ స్పీకర్ తెలిపారు.
INDvENG: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం
ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
శ్రీలంక అధ్యక్ష భవనంలో నిరసనకారులు ఏం చేస్తున్నారంటే..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. చెరువుల దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించిన ప్రభుత్వం
అసదుద్దీన్ ఓవైసీ: ‘జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రధాని రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు’

ఫొటో సోర్స్, Twitter/NarendraModi
కొత్తగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనం మీద జాతీయ చిహ్నం మూడు సింహాల పిల్లరను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
కానీ ఇలా ప్రధాని ఆవిష్కరించడాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. పార్లమెంటు మీది జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ద్వారా మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
‘పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలకు వేరువేరు అధికారాలను రాజ్యాంగం ఇచ్చింది. ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రధాని పార్లమెంటు మీద ఉన్న ఉన్న జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించకూడదు. లోక్‌సభకు ప్రతినిధి అయిన స్పీకర్, ప్రభుత్వం కంటే తక్కువ కాదు. ప్రధాని రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారు.’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఘర్షణ వీధుల్లో కొట్టుకునేదాకా ఎందుకు వచ్చింది?
ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
గుర్రం మీద ‘స్విగ్గీ డెలివరీ’... నెటిజన్లను ఫిదా చేసిన ఆ కుర్రాడు ఇతనే..
భారతదేశంలో ఉన్నట్లు బ్రిటన్‌కు చట్టబద్ధమైన రాజ్యాంగం ఎందుకు లేదు?
శ్రీలంక: అధ్యక్ష భవనం లోపలే మకాం వేసిన నిరసనకారులు
శ్రీలంక: ‘రాజీనామాకు సిద్ధమైన గోటాబయ రాజపక్ష’

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష రాజీనామా చేసేందుకు అంగీకరించారని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
బుధవారం అంటే 13వ తారీఖున ఆయన రాజీనామా చేస్తారని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ ఇంతకు ముందు తెలిపారు.
కొద్ది రోజులుగా గోటాబయ రాజపక్ష ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. అయితే ఆయన ఒక నేవి నౌకలో సముద్రం మీద ఉన్నారని కొన్ని వర్గాలు బీబీసీకి తెలిపాయి.
శ్రీలంక అధ్యక్ష భవనం ఇప్పుడు నిరసనకారులతో నిండి ఉంది.
