జ్ఞాన్‌వాపి మసీదు కేసును వారణాసి జిల్లా
జడ్జికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రాంగణంలోని జ్ఞాన్‌వాపి
మసీదు వ్యవహారంలో వీడియోగ్రఫిక్ సర్వే నిర్వహించాలంటూ వారణాసి జిల్లా కోర్టు
ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి.
ఈ కేసును
వారణాసి జిల్లా జడ్జి ఎదుట విచారణకు సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ సివిల్ కేసులో సంక్లిష్టతలు, సున్నితత్వం దృష్ట్యా వారణాసి న్యాయమూర్తి ముందున్న కేసును ఉత్తర్‌ప్రదేశ్‌కు
చెందిన అత్యున్నత, అనుభవజ్ఞుడైనన్యాయశాఖాధికారి ముందు విచారణ జరగడం మంచిదని
తాము భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తిజస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నట్లు
ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కేసును సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ వారణాసి
నుండి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నామని, అన్ని
మధ్యంతర దరఖాస్తులను కూడా అదే కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాలలో
పేర్కొంది.
జిల్లా జడ్జి దీనిని ముఖ్యమైన కేసుగా పరిగణించి విచారిస్తారని కూడా
పేర్కొంది.
ఈ మధ్యంతర ఉత్తర్వు 8 వారాలపాటు అమలులో ఉంటుందని కోర్టు
వెల్లడించింది.జ్ఞాన్‌వాపి మసీదులో
నిర్వహించినసర్వేపై జోక్యం చేసుకోవడానికి
నిరాకరించిన న్యాయస్థానం, ఈ కేసులో హిందువులు చేస్తున్న వాదనలను
పరిగణించవచ్చో లేదో పరిశీలించాలని వారణాసి జిల్లా న్యాయమూర్తిని కోరతూ కేసును జులై
రెండో వారానికి వాయిదా వేసింది.
సున్నితమైన వ్యవహారం కావడంతో కేసును వారణాసి సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.
శివలింగం ఉందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని, ముస్లింలు
నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందుల్లేకుండా అవకాశం కల్పించాలని చెబుతూ మే 17న ఇచ్చిన తమ
మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది.