వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్
తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
నేటి ముఖ్యాంశాలు
జాతీయ
స్థాయిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు కేసీఆర్ దిల్లీకి
చేరుకున్నారు.
తెలంగాణ
రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగరడం
ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
పంజాబ్
కాంగ్రెస్ నేత, మాజీ
క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా జిల్లా కోర్టులో శుక్రవారం
లొంగిపోయారు.
జ్ఞాన్‌వాపి
మసీదు కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పెగాసస్
కేసులో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్టును సూపర్వైజింగ్ జడ్జ్ అధ్యయనం చేసి, నాలుగు వారాల్లోగా తన
అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇక్కడితో
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
ధోని: ‘ఇప్పుడే ఐపీఎల్‌కు థ్యాంక్యూ చెప్పడం సమంజసం కాదు’
ఫొటో సోర్స్, BBC Sport
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్
ఎమ్మెస్ ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.
వచ్చే ఏడాది కూడా తాను ఐపీఎల్ ఆడతానని ధోని స్పష్టం చేశారు.
ఈ సీజన్‌లో సీఎస్కే చివరి మ్యాచ్ సందర్భంగా టాస్
సమయంలో వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌తో ధోని ముచ్చటించారు.
మీరు వచ్చే ఏడాది తిరగొస్తారా అని బిషమ్ అడగగా
కచ్చితంగా వస్తాను అని ధోని చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘వచ్చే ఏడాది మరింత
బలంగా తిరిగొస్తాం. మేం ఇప్పుడు చెన్నైలో ఆడట్లేదు. ఇలాంటి సమయంలో ఐపీఎల్‌కు థ్యాంక్యూ
(గుడ్‌బై) చెప్పడం సమంజసం కాదు’’ అని ధోని అన్నారు.
థాయిలాండ్ ఓపెన్: వరల్డ్ నంబర్‌వన్ యామగుచిని ఓడించి సెమీస్‌కు చేరిన సింధు
ఫొటో సోర్స్, Twitter/BAI
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న క్రీడాకారిణి పీవీ సింధు థాయిలాండ్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణిపై విజయం సాధించింది.
ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్
మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ ప్లేయర్ అకానె యామగుచి (జపాన్)పై సింధు గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది. యామగుచి
ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కూడా.
శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు 21-15, 20-22,
21-13తో యామగుచిపై గెలుపొందింది.
ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ సంఘం సింధుకు శుభాకాంక్షలు చెబుతూ
ట్వీట్ చేసింది.
శనివారం జరగనున్న సెమీస్ మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ యుఫెతో సింధు
తలపడుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్
ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ఆగిపోతే ఏం జరుగుతుంది
బుద్ధ వనం చూసొద్దామా
దిల్లీ చేరుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ చేరుకున్నారు.
జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయన దేశవ్యాప్తంగా పర్యటించనున్నారని.. రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన భేటీ అవుతారని ఇప్పటికే తెలంగాణ సీఎం కార్యాలయం ప్రకటించింది.
మే 22న కేసీఆర్ దిల్లీ నుంచి ఛండీగఢ్ వెళ్తారని, రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు అందజేస్తారని తెలిపింది.
అనంతరం మే 26న కేసీఆర్ బెంగళూరు చేరుకుని అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు.
మే 29, 30 తేదీలతో పశ్చిమబెంగాల్, బిహార్ పర్యటన ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
యుక్రెయిన్‌లో ‘యుద్ధ నేరాలకు’ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విచారించటం సాధ్యమేనా
బంగ్లాదేశ్‌లో ప్రశాంత్.. భారత్‌లో శివశంకర్ - ఎన్నో దేశాల పాస్‌పోర్ట్‌లు, మరెన్నో మారు పేర్లున్న ఈ హవాలా కింగ్ ఎవరు
సినిమా రివ్యూ: ‘జోసెఫ్’ని కాపీ, పేస్ట్ చేసిన ‘శేఖర్’
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్
ఫొటో సోర్స్, Janasena
తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, భవిష్యత్తులో
తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర
పోషించిన యువత, ఆడపడుచులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు.
పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో
చర్చించుకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి సత్తా చాటుతామన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో
అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ అన్నారు.
ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసేన
పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలను పరామర్శించి రూ. 5 లక్షల సాయం అందించే
కార్యక్రమంలో భాగంగా పవన్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు.
కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
ఫొటో సోర్స్, ANI
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్
సింగ్ సిద్ధూ పాటియాలా జిల్లా కోర్టులో శుక్రవారం లొంగిపోయారు.
సుమారు 30 ఏళ్ల కిందట ఓ వ్యక్తిని కొట్టగా ఆయన
మరణించిన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు గురువారం
తీర్పు చెప్పింది.
1988లో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్ సింగ్‌లు
పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో గుర్నాంసింగ్ అనే వ్యక్తితో గొడవ పడ్డారు. ఈ
క్రమంలో వీరిద్ధరూ గుర్నాంసింగ్‌ను కొట్టారన్నది ఆరోపణ. ఆ తరువాత గుర్నాంసింగ్
మరణించారు.
ఈ కేసులోనే సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది జైలు
శిక్ష విధించింది.
బ్రేకింగ్ న్యూస్, జ్ఞాన్‌వాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జి విచారిస్తారు: సుప్రీంకోర్టు
జ్ఞాన్‌వాపి మసీదు కేసును వారణాసి జిల్లా
జడ్జికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రాంగణంలోని జ్ఞాన్‌వాపి
మసీదు వ్యవహారంలో వీడియోగ్రఫిక్ సర్వే నిర్వహించాలంటూ వారణాసి జిల్లా కోర్టు
ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి.
ఈ కేసును
వారణాసి జిల్లా జడ్జి ఎదుట విచారణకు సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ సివిల్ కేసులో సంక్లిష్టతలు, సున్నితత్వం దృష్ట్యా వారణాసి న్యాయమూర్తి ముందున్న కేసును ఉత్తర్‌ప్రదేశ్‌కు
చెందిన అత్యున్నత, అనుభవజ్ఞుడైనన్యాయశాఖాధికారి ముందు విచారణ జరగడం మంచిదని
తాము భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తిజస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నట్లు
ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కేసును సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ వారణాసి
నుండి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నామని, అన్ని
మధ్యంతర దరఖాస్తులను కూడా అదే కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాలలో
పేర్కొంది.
జిల్లా జడ్జి దీనిని ముఖ్యమైన కేసుగా పరిగణించి విచారిస్తారని కూడా
పేర్కొంది.
ఈ మధ్యంతర ఉత్తర్వు 8 వారాలపాటు అమలులో ఉంటుందని కోర్టు
వెల్లడించింది.జ్ఞాన్‌వాపి మసీదులో
నిర్వహించినసర్వేపై జోక్యం చేసుకోవడానికి
నిరాకరించిన న్యాయస్థానం, ఈ కేసులో హిందువులు చేస్తున్న వాదనలను
పరిగణించవచ్చో లేదో పరిశీలించాలని వారణాసి జిల్లా న్యాయమూర్తిని కోరతూ కేసును జులై
రెండో వారానికి వాయిదా వేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
సున్నితమైన వ్యవహారం కావడంతో కేసును వారణాసి సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.
శివలింగం ఉందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని, ముస్లింలు
నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందుల్లేకుండా అవకాశం కల్పించాలని చెబుతూ మే 17న ఇచ్చిన తమ
మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 3
పెగాసస్‌పై టెక్నికల్ కమిటీ నివేదికను బహిరంగపరచాలన్న పిటిషనర్లు-అవసరం లేదన్న ప్రభుత్వం
ఫొటో సోర్స్, Getty Images
పెగాసస్ కేసులో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్టును సూపర్వైజింగ్ జడ్జ్ అధ్యయనం చేసి, నాలుగు వారాల్లోగా తన అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ వెంకటరమణ అధ్యక్షతన , జస్టిస్ సూర్యకాంత్, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణను కొనసాగిస్తూ, 29 మొబైల్ ఫోన్లు పెగాసన్ మాల్ వేర్ బారిన పడినట్లు టెక్నికల్ కమిటీ గుర్తించిందని పేర్కొంది.
మరికొన్ని ఫోన్లను కూడా టెక్నికల్ కమిటీ పరిశీలించిందని, దీనికి సంబంధించిన కొందరికి నోటీసులు పంపినట్లు పేర్కొంది.
మరోవైపు పెగాసస్ పై తన నివేదికను మే చివరి నాటికి సమర్పిస్తామని టెక్నికల్ కమిటీ సుప్రీం కోర్టుకు తెలిపింది.
అయితే, అధ్యయనానికి సుమారు నాలుగు వారాలు పట్టొచ్చని అంచనా వేసిన సుప్రీకోర్టు,
నివేదిక వచ్చాక సుపర్వైజరీ జడ్జ్ కోర్టుకు తన అభిప్రాయాన్ని అందిస్తారని, జులైలో విచారణ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది.
అయితే ఈ కేసులో కొందరు పిటిషనర్లతోపాటు సీనియర్ లాయర్ కపిల్ ఈ నివేదికను బహిరంగ పరచాలని విజ్ఞప్తి చేయగా, ఇది మధ్యంతర నివేదిక కాబట్టి దీన్ని బహిరంగ పరచవద్దని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు.
నిజామాబాద్ గ్రౌండ్‌లో పరుగు ప్రాక్టీస్ చేసిన బక్కపల్చని అమ్మాయి బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్ ఎలా అయిందంటే
నిఖత్ జరీన్: ‘ఈ విజయం నీ కోసమే... ఇండియా’
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ నిఖత్ జరీన్
తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
‘‘2022 వరల్డ్ చాంపియన్. ఇది ఏళ్ల తరబడి చేసిన కఠోర శ్రమకు దక్కిన
ఫలితం. భారత్... ఈ విజయం నీకోసమే. మనిద్దరం కలిసి ఈ ఘనతను
సాధించాం’’ అని నిఖత్ ట్వీట్ చేశారు.
గురువారం జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన
బాక్సర్ జిట్‌పోంగ్ జుటామస్‌పై గెలుపొంది నిఖత్ జరీన్ స్వర్ణాన్ని కైవసం
చేసుకున్నారు.
టర్కీలో ఈ టోర్నీ జరిగింది. మహిళల 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్
విజేతగా నిలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం,10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలి - విచారణ కమిషన్ సిఫారసు
ఆంధ్రప్రదేశ్: అయిదేళ్లుగా అంగన్‌వాడీలకు బిల్లులు చెల్లించడం లేదు, కొత్తగా వేతనాలలో జాప్యం... ఎందుకిలా?
కరాటే కల్యాణి వివాదమేంటి, అసలేం జరిగింది... దత్తత చట్టాలు ఏం చెబుతున్నాయి?
నిఖత్ జరీన్: చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్... వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం