You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

సోనియా గాంధీ: ‘భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అంతం చేయడమే బీజేపీ విధానం’

రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తూ బీజేపీ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని సోనియా గాంధీ ఆరోపించారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. హైస్కూలు విద్యార్థులకు ఆటపాటలు, కళారూపాలతో సోషల్ పాఠాలు చెబుతున్న టీచర్

    విజయనగరం జిల్లాలో శంకరరావు అనే ఉపాధ్యాయుడు పాటలు, కోలాటాలు, జానపద నృత్యాలు, బుర్రకథ లాంటి కళారూపాలతో హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. తన వినూత్న బోధనతో ఇద్దరు భారత రాష్ట్రపతుల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన ఎందుకిలా చేస్తున్నారు, ఆయన లక్ష్యం ఏంటి?

  2. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి విలువ... మీ జేబుపై పడే భారమెంత?

  3. తమిళనాడు: బీఫ్ బిర్యాని తొలగించడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ నోటీసులు

    తమిళనాడులో జరిగే ఆంబూర్ బిర్యాని ఫెస్టివల్ నుంచి బీఫ్ బిర్యాని తొలగించడంపై ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది.

    బీఫ్ బిర్యానిని తొలగించడమంటే ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పట్ల వివక్ష చూపించినట్లేనని కమిషన్ వ్యాఖ్యానించింది. దీని మీద తిరుపత్తూర్ కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

    ఆంబూరులో మూడు రోజుల పాటు నిర్వహించనున్న బిర్యాని ఫెస్టివల్‌లో 20 రకాల బిర్యానీలు ఉంటాయని అంతకు ముందు తిరుపత్తూర్ కలెక్టర్ తెలిపారు.

    హిందువుల మనోభావాలు దెబ్బతినుకుండా ఉండేందుకు బీఫ్, పోర్క్ బిర్యానీలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

    వాస్తవానికి ఈ బిర్యాని ఫెస్టివల్ ఈ నెల 13 నుంచి 15 వరకు జరగాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక దాన్ని వాయిదా వేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

  4. ‘జమ్మూ కశ్మీర్‌లో ముస్లింలను మైనారిటీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’

    జమ్మూ కశ్మీర్‌లో ముస్లింలను మైనారిటీలుగా మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు.

    పాకిస్తాన్ పార్లమెంటులో తొలిసారి మాట్లాడిన ఆయన, కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ విమర్శించారు.

    భారత్ చట్టవ్యతిరేకంగా ఆర్టికల్-370ని రద్దు చేసిందని, జమ్మూ కశ్మీర్‌లో జనాభా నిష్పత్తిని మార్చాలని చూస్తోందని బిలావల్ ఆరోపించారు.

  5. కాకినాడ: తుపాకీతో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య

    కాకినాడలో గోపాల కృష్ణ అనే సబ్ ‌ఇన్‌స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన పని చేస్తున్నారు.

    గురువారం ముఖ్యమంత్రి బందోబస్తుకు వెళ్లివచ్చిన గోపాల కృష్ణ, ఈరోజు తెల్లవారు జామున ఇంట్లోనే గన్‌తో కాల్చుకున్నారు.

    ఈమేరకు ఆయన మరణాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించారు.

    గోపాల కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  6. నేడు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇటీవల కొద్ది రోజులుగా మార్కెట్లు నష్టపోతూ వస్తున్న విషయం తెలిసిందే.

    ప్రస్తుతం నిఫ్టీ 145 పాయింట్లు పెరిగి 15,954 వద్ద ట్రేడవుతుంటే, సెన్సెక్స్ 420 పాయింట్లు పెరిగి 53,353 వద్ద ట్రేడవుతోంది.

    ఐటీ, ఫార్మా, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

  7. ఉత్తర కొరియాలో ‘తొలి’ కరోనా మరణం

    కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశం కరోనా మరణాలను అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.

    జ్వరంతో బాధపడుతూ ఆరుగురు చనిపోయారని, వారిలో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.

    జ్వరంతో బాధపడుతున్న సుమారు లక్ష 87వేల మందిని ఐసోలేట్ చేసినట్లు వెల్లడించింది.

  8. నరేంద్ర మోదీ: ‘రెండు సార్లు ప్రధాని అయితే చాలదా? అని ఒక సీనియర్ నేత అన్నారు.’

    రెండు సార్లు ప్రధాని కావడమంటే జీవితంలో అన్ని సాధించినట్లేనని ఒక సీనియర్ ప్రతిపక్ష నేత తనతో అన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.

    కానీ, దేశంలో వంద శాతం సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూడటమే తన లక్ష్యమని ఆయన అన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన మరొకసారి ప్రధాని కావాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

    గుజరాత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘ఒక రోజు ఒక సీనియర్ నేత నన్ను కలిశారు. రాజకీయంగా ఆయన మమ్మల్ని తరచూ వ్యతిరేకిస్తుంటారు. అయినా నేను ఆయనను గౌరవిస్తా.

    ఇటీవల కొన్ని విషయాలు నచ్చక, ఆయన నన్ను కలవడానికి వచ్చారు. ఈ దేశం నిన్ను రెండు సార్లు ప్రధానిని చేసిందని, అంతకంటే నీకు ఏం కావాలంటూ ఆయన నన్ను అడిగారు.

    ఒకరు రెండు సార్లు ప్రధాని కావడమంటే జీవితంలో అన్నీ సాధించినట్లే అన్నది ఆయన ఉద్దేశం.’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

    శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తికి గురైన ఎన్‌సీపీ నేత శరద్ పవార్ కొద్ది రోజుల కిందట మోదీని కలిశారు.

    ఈ నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

  9. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.