బసవరాజ్ బొమ్మై: ‘మత మార్పిళ్లను నిషేధించే ఆర్డినెన్స్ మీద కేబినెట్‌లో నిర్ణయం’

ఫొటో సోర్స్, Facebook/Basavaraj Bommai
మత మార్పిళ్ల నిషేధం మీద ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈమేరకు నేడు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
మత మార్పిళ్ల నిషేధం ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
గతంలో మత మార్పిళ్ల నిషేధం బిల్లును కర్నాటక తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి, ఉద్యోగాలు వంటివి ఆశ చూపి ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్చడాన్ని ఈ బిల్లు నిషేధిస్తోంది.
దీనిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
అయితే ఈ విషయం మీద ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులు, యువతకు ఉపాధి దొరికే కార్యక్రమాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది







