శ్రీలంక సంక్షోభం: ఈ వారంలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తా – గోటాబయ రాజపక్స

పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’’ వ్యవస్థను రద్దుచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోటాబయ రాజపక్స చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లు ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం ఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నేటి ముఖ్యాంశాలు

    నిరసనకారుల దాడుల నడుమ శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స కొలంబోలోని ఒక నావికా దళ స్థావరంలో తలదాచుకున్నారు.

    శ్రీలంకలో దోపిడీలు, దౌర్జన్యాలు, నిరసనల నడుమ ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు.

    ఈ వారంలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తానని శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్స వెల్లడించారు.

    జార్ఖండ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను అక్రమ నగదు కేసులో అరెస్టు చేశారు.

    విశాఖపట్నంలో ఒక శిశువును ధన్‌బాద్-అలప్పుజ రైలు బాత్‌రూమ్ వాష్ బేసిన్‌లో వదిలేసి వెళ్లారు.

    భార్యకు ఇష్టం లేకుండా భర్త ఆమెతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే అంశంపై దిల్లీ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

  3. ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు.. ఎందుకంటే

  4. శ్రీలంక: ఈ వారంలోనే కొత్త ప్రధానిని, మంత్రివర్గాన్ని నియమిస్తా: గోటాబయ రాజపక్స

    గోటాబయ రాజపక్స

    ఫొటో సోర్స్, ani

    నిరసనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ఈ వారంలోనే కొత్త ప్రధానమంత్రిని, కొత్త మంత్రివర్గాన్ని నియమిస్తానని దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స బుధవారం వెల్లడించారు.

    నిరసనల నడుమ ఆయన సోదరుడు మహింద రాజపక్ష ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

    మరోవైపు పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’’ వ్యవస్థను రద్దుచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోటాబయ రాజపక్స చెప్పారు.

    ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకలో నిరసనలు, దోపిడీలు, దౌర్జన్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో సోమవారం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. 200 మందికిపైగా ప్రజలు గాయాలపాలయ్యారు.

  5. భారతీయులు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారా?

  6. అసాని తుపాను: తీరానికి కొట్టుకొచ్చిన రాజమందిరం

  7. శ్రీలంక సంక్షోభం: నావికా దళ స్థావరంలో తలదాచుకున్న మాజీ ప్రధాని

    గొటాబయ రాజపక్స (కుడివైపు వ్యక్తి), మహింద రాజపక్స

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    అల్లర్లు, నిరసనలతో శ్రీలంక అట్టుడుకుతోంది. దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడే వారిని కాల్చిపారేయాలని భద్రతా దళాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

    దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ బుధవారం కూడా దోపిడీలు, దాడులు కొనసాగాయి.

    కొలంబోకు సమీపంలోని దుకాణాలను నిరసనకారులు దోచుకెళ్లారు. మరోవైపు మాజీ ప్రధాని మహింద రాజపక్స కుమారుడి రిసార్టుపైనా దాడులు జరిగాయి.

    నిరసనల నడుమ తన పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. నిరసనకారుల దాడుల నడుమ ఒక నావికా దళ స్థావరంలో ఆయన తలదాచుకున్నారు.

    సోమవారం నుంచి చోటుచేసుకున్న నిరసనలు, దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా గాయపడ్డారు.

    అధ్యక్షుడు గోటాబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులు చేస్తున్నారు.

  8. కంప్యూటర్ షార్ట్‌కట్స్: కీబోర్డుపై F1 నుంచి F12 వరకు ఉండే ఈ కీస్ ఎందుకో తెలుసా?

  9. పూజ సింఘాల్: అక్రమ నగదు కేసులో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారిణి

    పూజ

    ఫొటో సోర్స్, IPRD JHARKHAND

    అక్రమ నగదు కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది.

    ఇప్పటికే ఆమె సీఏ సుమన్ కుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి నుంచి రూ.17 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

    ప్రస్తుతం జార్ఖండ్ మైనింగ్ శాఖ కార్యదర్శిగా పూజ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె 2000 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి.

    అక్రమ నగదు ఆరోపణలపై ఇటీవల పూజ అత్తారింటిలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

    ఉపాధి హామీ పథకం నిధులను కూడా పక్కదారి పట్టించినట్లు పూజపై ఆరోపణలు వచ్చాయి.

  10. నేపాల్‌, బ్రిటన్ నుంచి భారత్ నేర్చుకోవాల్సింది ఏమిటి?

  11. ఒకేసారి మూడు పెళ్లిళ్లు.. కరెంట్ పోవడంతో మారిపోయిన పెళ్లికూతుళ్లు..

  12. విశాఖ: అప్పుడే పుట్టిన శిశువును రైలు బాత్రూం వాష్‌ బేసిన్‌లో వదిలేసి వెళ్లారు

    ధన్‌బాద్- అలెప్పి ఎక్స్‌ప్రెస్ రైలు బాత్రూం వాష్ బేసిన్‌లో అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలేశారు. బీ-1 బోగి టాయిలెట్ వాష్‌ బేసిన్‌లో మగ శిశువును వదిలి వెళ్లిపోయారు. ట్రైన్ విశాఖ చేరుకునే సమయానికి టాయ్‌లెట్ నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దాంతో ప్రయాణికులు శిశువును గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

    రైలు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయానికి ఆర్పీఎఫ్ పోలీసులు వైద్య సిబ్బందితో సిద్ధంగా ఉండి, ప్రాధమిక పరీక్షల అనంతరం శిశువును రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పుడే పుట్టిన శిశువును ఎవరు వదిలేసి వెళ్లారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

    విశాఖ

    ఫొటో సోర్స్, ugc

  13. అసాని తుపాన్ తాకిడితో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు

  14. దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?

  15. యుక్రెయిన్: సుమారు 26,350 రష్యా సైనికుల మృతి

    రష్యా యుద్ధ వాహనాలు

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు రష్యాకు చెందిన సుమారు 26,350 మంది సైనికులు మృతి చెందారని యుక్రెయిన్ రక్షణ మంత్రత్వ శాఖ తాజాగా తెలిపింది.

    రష్యా నష్టపోయినట్లుగా చెబుతూ యుక్రెయిన్ విడుదల చేసిన జాబితా

    1,187 ట్యాంకులు

    2,857 ఆయుధ వాహనాలు

    528 ఆర్టిలరీ సిస్టమ్స్

    185 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్

    8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్

    199 విమానాలు

    160 హెలికాప్టర్లు

    290 మానవరహిత ఏరియల్ వెహికల్స్

    94 క్రూయిజ్ మిసైల్స్

    12 నౌకలు

    1,997 మోటార్ వెహికిల్స్, ట్యాంక్ ట్రక్స్

    41 స్పెషల్ ఎక్విప్‌మెంట్ యూనిట్లు

    బీబీసీ ఈ వివరాలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

  16. మారిటల్ రేప్: భార్యతో బలవంతంగా లైంగిక చర్యలపై దిల్లీ హైకోర్టు తీర్పు

    దిల్లీ హైకోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    భార్యకు ఇష్టం లేకుండా భర్త ఆమెతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే అంశంపై దిల్లీ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

    భార్య అనుమతి లేకుండా ఆమెతో బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొంటే నేరంగానే పరిగణించాలని జస్టిస్ రాజీవ్ షక్‌దీర్ తీర్పునిచ్చారు.

    భార్య అనుమతి లేకుండా లైంగిక చర్యలో పాల్గొనడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.

    అయితే, ఆయన వాదనతో ధర్మాసనంలోని రెండో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ విభేదించారు.

    మారిటల్ రేప్‌కు సంబంధించిన ఐపీసీలోని సెక్షన్ 375 (2).. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలేదని హరిశంకర్ అభిప్రాయపడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇద్దరు న్యాయమూర్తులు ఈ అంశంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఇకపై ఈ అంశాన్ని సుప్రీం కోర్టు విచారించనుంది.

    భారతదేశంలో భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడాన్ని నేరంగా పరిగణించరు.

    మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌ పట్ల స్పందిస్తూ ఇది వివాహ వ్యవస్థను అస్థిరం చేస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది.

  17. ఒక విగ్రహం, రెండు జెండాలు ఆ ప్రశాంత నగర చరిత్రను ఎలా మార్చేశాయంటే

  18. ఏ తుపాను వచ్చినా ఉప్పాడ తీరం మీదే ఎందుకు ప్రభావం పడుతుంది?

  19. అసాని తుపాను: ‘వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి రూ. 2000’ – సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

    అసాని తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తోన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు.

    తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సమీక్ష జరిపారు.

    ‘‘తీరం వెంబడి తుపాను ప్రయాణిస్తోంది. కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం. అయితే, తుపాను బలహీనపడటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైనచోట పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయండి. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు, కుటుంబానికి రూ. 2000 చొప్పున ఇవ్వండి. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు’’ అని కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు.

  20. ‘అధికారానికి అద్ధం చూపడం జాతీయవాదం... దేశ ద్రోహం కాదు’ – కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా

    రణ్‌దీప్ సూర్జేవాలా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా

    దేశద్రోహం చట్టం అంశంపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ‘చారిత్రక నిర్ణయం’గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అభివర్ణించారు.

    సుప్రీం కోర్టు సందేశం స్పష్టంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ‘‘ప్రజా వ్యతిరేక విధానాలపై వచ్చే విమర్శలను అణచివేయలేమని అధికారపీఠంపై కూర్చొన్న పాలకులు తెలుసుకోవాలి. అధికారానికి అద్ధం చూపడం దేశద్రోహం కాదు, జాతీయవాదం అవుతుంది’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    సుప్రీం కోర్టు నిర్ణయాన్ని సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ ప్రశంసించారు.

    ‘‘దేశ ద్రోహ చట్టాన్ని పెద్ద స్థాయిలో దుర్వినియోగం కాకుండా నిరోధించే ఈ ఉత్తర్వును వెలువరించిన సుప్రీంకోర్టుకు సెల్యూట్’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2