You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

నరేంద్ర మోదీ: ‘భారత్‌లో పెట్టుబడులు పెట్టకపోతే.. అవకాశాన్ని చేజార్చుకున్నట్లే’

"భారతదేశంలో అమలు చేసిన సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను చూస్తే.. ఇక్కడ పెట్టుబడులు పెట్టలేని వారంతా అవకాశాన్ని కోల్పోయినట్లే" అని కోపెన్‌హాగెన్ ఇండియా -డెన్మార్క్ బిజినెస్ ఫారంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ విద్యార్థుల నిరసనలు

    రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనకు దిగారు.

    రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేయడంతోపాటు ‘గో బ్యాక్ రాహుల్ గాంధీ’ అంటూ నినాదాలు చేశారు.

    ఇక రాహుల్ గాంధీని యూనివర్సిటీలోకి అనుమతించేది లేదని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రవీంద్ర యాదవ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థులను కలవడానికి లేదని ఆయన తెలిపారు.

  2. కిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపేశాడు... చిన్న చిన్న కారణాలతో ఎందుకీ దారుణాలు?

  3. రాజస్థాన్: ఈద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ

    రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పరశురామ జయంతి సందర్భంగా జలోరీ గేట్ ప్రాంతంలో ఒక వర్గం వారు జెండాలు పెట్టడంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా అధికారులు ఇంటర్నెట్ నిలిపివేశారు.

    ఈ ఘర్షణలు సోమవారం రాత్రి మొదలయ్యాయి. పరశురామ జయంతి సందర్భంగా ఒక సముదాయం జలోరీ గేట్ ప్రాంతంలో జెండాలతో అలంకరించింది. అయితే మరొక సముదాయం ఆ జెండాలను పీకేసి తమ జెండాలను ఉంచడంతోపాటు మైకులు కూడా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

    మంగళవారం ఈద్ ప్రార్థనల తరువాత మరొక సారి జెండాల గురించి ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు.

    ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జోధ్‌పుర్ పోలీసు కమిషనర్ నవ్యజోతి గొగోయ్ తెలిపినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. వివాదానికి కారణమైన జెండాలను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు.

  4. అమెరికాలో అబార్షన్లు నిషేధిస్తారా?

    అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పిస్తున్న చట్టాలను కొట్టివేస్తుందనే వార్తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి.

    మహిళలకు అబార్షన్‌ చేయించుకునే హక్కును రాజ్యాంగం ఇస్తోందంటూ 1973లో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అంటూ జస్టిస్ శామ్యుల్ అలిటో తీర్పులో రాసినట్లు పొలిటికో అనే వెబ్‌సైట్ తెలిపింది.

    అబార్షన్ హక్కుల మీద జులైలో అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

    ఈ వార్తల మీద యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పేలోసీ స్పందించారు.

    ‘ఒకవేళ ఆ వార్తలు నిజమైతే గత 50 ఏళ్లలో హక్కులపై సుప్రీం కోర్టు కఠినమైన ఆంక్షలు విధించినట్లు అవుతుంది. ఇది మహిళల హక్కుల మాత్రమే కాదు అమెరికన్ల హక్కులకు కూడా వర్తిస్తుంది.’ అని నాన్సీ పెలోసీ, సెనేట్ నాయకుడు చక్ షూమర్ ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

  5. ఉద్యోగుల అబార్షన్ కోసం ప్రయాణ ఖర్చులు ఇవ్వనున్న అమెజాన్

    అమెరికాలో అబార్షన్ల మీద నియంత్రణ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

    అబార్షన్ కోసం వేరే ప్రాంతాలకు ప్రయాణించే ఉద్యోగులకు ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కింద ప్రతి ఏడాది 4 వేల డాలర్ల వరకు అంటే సుమారు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

    రాయిటర్స్ రిపోర్ట్ చేసిన ప్రకారం ఒక ఉద్యోగి ఇంటికి 161 కిలోమీటర్ల పరిధిలో అబార్షన్ సౌకర్యం లభించని సందర్భంలోనే ఈ సదుపాయం లభిస్తుంది.

    తమ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అబార్షన్ సౌకర్యం పొందేలా అనేక అమెరికా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.

    కడుపులోని పిండానికి కూడా జీవించే హక్కు ఉందంటూ అమెరికాలోని చాలా రైట్ వింగ్ సంస్థలు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబార్షన్‌ను కఠినతరం చేస్తూ కొన్ని రాష్ట్రాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి.

  6. పెళ్లి కోసమని వచ్చిన పిల్లాడికి జాబ్ ఆఫర్ ఇచ్చిన అమ్మాయి

    ఒక బెంగళూరు అమ్మాయికి వాళ్ల నాన్న పెళ్లి సంబంధం తెచ్చారు. ఆ అమ్మాయి మాత్రం తన స్టార్టప్ కోసం ఆ అబ్బాయిని జాబ్ ఇంటర్వ్యూకు పిలిచింది.

    మనీకంట్రోల్ వెబ్‌సైట్ కథనం ప్రకారం... బెంగళూరులో సాల్ట్ అనే ఫైనాన్సియల్ టెక్ స్టార్టప్‌ను నడుపుతోంది ఉదిత పాల్ అనే అమ్మాయి. ఇటీవల వాళ్ల నాన్న ఆ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు.

    ప్రొఫైల్ చూసి ఆ అబ్బాయికి ఫైనాన్సియల్ టెక్నాలజీస్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్నట్లు ఆ అమ్మాయి గుర్తించింది. దాంతో వెంటనే ఆ అబ్బాయికి జాబ్ ఇంటర్వ్యూ కోసం లింక్ పంపింది.

    పెళ్లి కోసమని తెచ్చిన పిల్లోడికి జాబ్ ఇంటర్వ్యూ లింక్ ఎలా పంపిస్తావంటూ వాళ్ల నాన్న ఆ అమ్మాయిని కోప్పడ్డారు.

  7. నరేంద్ర మోదీ: ‘యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు’

    పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్‌కు సుమారు రూ.78 వేల కోట్లు అందించనున్నట్లు జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ ప్రకటించారు. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఓలాఫ్‌తో భేటీ అయ్యారు.

    అయితే యుక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో మాత్రం భారత్, జర్మనీల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

    యుక్రెయిన్‌లో కాల్పుల విరమణకు భారత్ పిలుపునిస్తోంది తప్ప పశ్చిమ దేశాలు కోరుకుంటున్నట్లు రష్యా చర్యలను ఖండించడం లేదు.

    మరో వైపు యుక్రెయిన్‌కు సైనిక సాయం అందిస్తున్న జర్మనీ, వెంటనే రష్యా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరుతోంది.

    ‘యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు. అందరూ ఓడిపోతారు. మేం శాంతిని కోరుకుంటున్నాం.’ అని ప్రధాని మోదీ అన్నారు.

  8. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

  9. నరేంద్ర మోదీ: ‘భారత్‌లో పెట్టుబడులు పెట్టకపోతే.. అవకాశాన్ని చేజార్చుకున్నట్లే’