You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రెండేళ్ల తర్వాత పర్యటకులకు స్వాగతం పలుకుతున్న న్యూజీలాండ్
రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా సరిహద్దులను మూసేసిన న్యూ జీలాండ్ పర్యటకులకు తిరిగి ఆహ్వానం పలుకుతోంది. అయితే, న్యూజీలాండ్‌కు రావాలనుకునే వారందరూ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కోవిడ్ పరీక్ష ఫలితాల్లో నెగిటివ్ రావల్సి ఉంటుంది.
లైవ్ కవరేజీ
రాజేశ్ పెదగాడి
నేటి ముఖ్యాంశాలు
యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
కోవిడ్-19 వ్యాక్సీన్లతో వచ్చే దుష్ప్రభావాలపై సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
విద్యుత్ సంక్షోభంపై మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు.
‘‘విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగ సంక్షోభం, రైతు సంక్షోభం, ద్రవ్యోల్బణ సంక్షోభం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల దుష్పరిపాలన ఒక కేస్ స్టడీ లాంటిది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ తీశారో ఇది చెబుతుంది’’అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
రేపటి నుంచి వారం రోజుల వరకు భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు.
నల్ల సముద్రంలో రెండు రష్యా గస్తీ నౌకలను డ్రోన్ దాడులతో ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ నియమితులయ్యారు.
సిద్దిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ పై దాడి జరిగింది. సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న పాల్ వాహనాన్ని సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లా సరిహద్దుల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తెలంగాణలో కేఏ పాల్‌కు చెంపదెబ్బ
రెండేళ్ల తర్వాత పర్యటకులకు స్వాగతం పలుకుతున్న న్యూజీలాండ్
రెండేళ్ల పాటుకోవిడ్ కారణంగా సరిహద్దులను మూసేసిన న్యూజీలాండ్ పర్యటకులకు తిరిగి ఆహ్వానం పలుకుతోంది.
సోమవారం నుంచి ఆక్‌లాండ్ లో పర్యటకులు కనిపిస్తున్నారు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనైన దృశ్యాలు కూడా కనిపించాయి.
60కి పైగా దేశాలకు చెందిన వారు న్యూజీలాండ్ లో అడుగు పెట్టేందుకు అనుమతి లభించింది. అయితే, వీరంతా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కోవిడ్ పరీక్ష ఫలితాల్లో నెగిటివ్ రావల్సి ఉంటుంది.
మార్చి నుంచి న్యూజీలాండ్ పౌరులు బయట దేశాలకు వెళ్లి రాగల్గుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆస్ట్రేలియా పౌరులు దేశంలోకి వచ్చేందుకు అనుమతి లభించింది.
భాగస్వామిని కలుసుకునేందుకు 2020 నుంచి ఎదురు చూసి చివరకు దేశంలో అడుగుపెట్టగలిగినట్లు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి చెప్పారు.
'పుష్ప - ది రైజ్' సినిమా లోడైలాగ్‌ను చెప్పిన గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవానీ
గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవానీ సోమవారం జైలు నుంచి విడుదలైన వెంటనే'పుష్ప - ది రైజ్' సినిమా లో డైలాగ్‌ను చెప్పారు.
విలేకరులతో మెవానీ మాట్లాడుతూ.. "మోదీజీ, మీరు కూడా గుజరాత్ కు చెందినవారే, నేను కూడా గుజరాత్‌వాడినే. 'నేను పువ్వును కాదు, నిప్పును. తల వంచేదే లేదు' అని నా స్నేహితుడొకరు చెప్పారు. ఈ విషయం మీకు అర్ధమవుతుందని అనుకుంటున్నాను. భారత ప్రధాన మంత్రిగా నేను మీకు సవాలు విసురుతున్నాను".
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గాను అసోం పోలీసులు మెవానీని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఆయనకు బెయిల్ దొరికింది. అయితే ఆయన మరో కేసులో తిరిగి అరెస్టు అయ్యారు.
ఆయన మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
ఈ కేసులో కూడా బార్‌పేట కోర్టు ఆయనను విడుదల చేయమని ఆదేశాలు జారీ చేసింది.
బిహార్‌లో కేరళకు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య.. ఏం జరిగింది?
జక్కాపూర్: కే.ఏ.పాల్ పై దాడి
సిద్దిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ పై దాడి జరిగింది. సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న పాల్ వాహనాన్ని సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లా సరిహద్దుల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సమయంలో పాల్ అతని వ్యక్తిగత సిబ్బంది పోలీసులతో వాగ్వాదానికి పాల్పడ్డారు. ఇంతలో గుంపులోని ఓ వ్యక్తి పాల్ పై దాడి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డుకున్నారని, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని పాల్ ఆరోపించారు.
తన పర్యటనకు సంబందించిన సమాచారం ముందుగానే పోలీసు ఉన్నతాధికారులకు అందించానని అయినా తనను అడ్డుకుంటున్నారని పాల్ అన్నారు.
ఈ దాడి గురించి ఉన్నతాదికారులకు పిర్యాదు చేస్తానని పాల్ తెలిపారు.
కే.ఏ.పాల్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా ‘నేరెళ్ల’ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్, అనిల్ గా గుర్తించారు.
‘’ కే.ఏ.పాల్ , అతని అనుచరులు రైతులను గురించి అభ్యంతరకర భాషలోసన్నాసులు అంటూ సంబోధించారు. అలా అనొద్దని అంటే మాపై దాడికి పాల్పడి నెట్టేసారు. అందుకే ఆయన పై దాడి చేయాల్సి వచ్చింది” అని అనిల్ బీబీసీ కి చెప్పారు.
పాల్ అనుచరులు తమ పై దాడి చేసారని రాజన్న సిరిసిల్ల ఎస్పీ కి పిర్యాదు చేసినట్లు తెలిపారు.
సర్కారు వారి పాట: మహేశ్ బాబు నోట వైఎస్ జగన్ డైలాగ్.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’పై సోషల్ మీడియాలో చర్చ
భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
ప్రధాని మోదీ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ తరుణ్ కపూర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ నియమితులయ్యారు.
తరుణ్ 1987 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. పెట్రోలియం శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
తరుణ్‌ను ప్రధాన మంత్రి సలహాదారుడిగా క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించినట్లు సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
రెండేళ్ల వరకు తరుణ్ ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు హరి రంజన్ రావు, ఆతీశ్ చంద్రలను ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శులుగా నియమించారు.
ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
డ్రోన్ దాడులతో రెండు రష్యా గస్తీ నౌకలను ధ్వంసం చేశాం- యుక్రెయిన్
నల్ల సముద్రంలో రెండు రష్యా గస్తీ నౌకలను డ్రోన్ దాడులతో ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
యుక్రెయిన్ సైన్యాధిపతి వలెరియెవ్ జాలుఝిని ఈ విషయంపై సోమవారం ఒక ప్రకటన చేశారు. ‘‘రప్టార్ తరగతికి చెందిన రెండు రష్యా గస్తీ నౌకలు జిమిని దీవి తీరంలో ముంచేశాం’’అని ఆయన చెప్పారు. యుక్రెయిన్ సైన్యం డ్రోన్‌తో దాడి చేస్తున్న దృశ్యాలను కూడా విడుదల చేసింది.
యుక్రెయిన్ సైన్యం విడుదల చేసిన దృశ్యాల్లో రెండు నౌకలే లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ నౌకలను గస్తీ కోసం రష్యా ఉపయోగిస్తోంది. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఫిలిప్పీన్స్‌లో 80 ఇళ్లు అగ్నికి ఆహుతి.. ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని, వీటిలో 80 ఇళ్లు ఆహుతయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఈ మంటలు ఎలా మొదలయ్యాయనే విషయంలో స్పష్టత లేదు.
ఫిలిప్పీన్స్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాల్లో ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతంలోని ఒక భవనం రెండో అంతస్తులో ఈ మంటలు మొదలయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
‘‘మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. బాధితులు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేకపోయారు’’అని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
హీట్‌వేవ్: రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడొచ్చు – ఐఎండీ
రేపటి నుంచి వారం రోజుల వరకు భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
దిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల వర్షాలు కూడా పడే అవకాశముందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ ఆర్‌కే జెనమణి ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
‘‘వాయువ్య భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్టు జారీచేశాం’’అని ఆయన అన్నారు.
దేశ రాజధాని దిల్లీలోనూ మే మూడో తేదీన వర్షాలు పడే అవకాశముందని ఆయన చెప్పారు.
విశాఖపట్నం: తవ్వోడ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది?
ఈ ఓడలు ఏం చేస్తాయి? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది?
జైలులోని పురుష ఖైదీ, మహిళా గార్డు అదృశ్యం.. ఆచూకీ చెప్పిన వారికి రూ.ఏడు లక్షల బహుమతి
ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీయాలో మోదీ పాలన చూస్తే తెలుస్తుంది – రాహుల్ గాంధీ
విద్యుత్ సంక్షోభంపై మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు.
‘‘విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగ సంక్షోభం, రైతు సంక్షోభం, ద్రవ్యోల్బణ సంక్షోభం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల దుష్పరిపాలన ఒక కేస్ స్టడీ లాంటిది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ తీశారో ఇది చెబుతుంది’’అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో బొగ్గు సంక్షోభం నెలకొందని వార్తలు వస్తున్నాయి.
దిల్లీలోనూ బొగ్గు కొరత ఉందని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ వార్తలను ఎన్‌టీపీసీ ఖండించింది. మరోవైపు దిల్లీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ వ్యాఖ్యానించారు.
ఉష్ణోగ్రతలు పెరిగితే మన శరీరంలో జరిగే మార్పులివే
వ్యాక్సీన్లు వేసుకుంటేనే లోపలకు అనుమతిస్తామని షరతులు పెట్టకూడదు – సుప్రీం కోర్టు
కోవిడ్-19 వ్యాక్సీన్లతో వచ్చే దుష్ప్రభావాలపై సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
వ్యాక్సీన్లు వేసుకుంటే కానీ లోపలకు అనుమతించం అంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు పెడుతున్న షరతులు సరికాదని సుప్రీం కోర్టు సోమవారం అభిప్రాయం వ్యక్తంచేస్తుంది. ఆ షరతులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది.
‘‘వ్యాక్సీన్లు వేసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి చేయకూడదు. అదే సమయంలో ప్రస్తుత వ్యాక్సీన్ల విధానాలు అనుచితమైనవని, నిరంకుశమైనవని కూడా చెప్పలేం’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని షరతులు విధించే హక్కు ఎప్పుడూ ప్రభుత్వానికి ఉంటుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఆ షరతులు సముచితంగా ఉండాలని సూచించింది.
బెర్లిన్‌లో మోదీకి స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు.
బెర్లిన్‌లో ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికారు.
జర్మనీకి ఛాన్సెలర్‌గా ఇటీవల ఎన్నికైన ఓలాఫ్ స్కాల్జ్‌తో మోదీ తొలిసారిగా భేటీ కాబోతున్నారు.
ఆరవ జర్మనీ-భారత్ ప్రభుత్వ చర్చల్లోనూ మోదీ పాలుపంచుకుంటారు.