రాజ్ ఠాకరే: ‘దురదృష్టవశాత్తు మహారాష్ట్రలో యోగీలు లేరు’
తమ దురదృష్టం కొద్దీ మహారాష్ట్రలో యోగి ఆదిత్యనాథ్ వంటి వారు లేరని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాకరే అన్నారు.
‘ప్రార్థనా మందిరాలు, ముఖ్యంగా మసీదుల నుంచి మైకులు తొలగించినందుకు యోగి ప్రభుత్వానికి అభినందనలు.’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మసీదుల్లో మైకులను తొలగించాలంటూ కొద్ది రోజులుగా రాజ్ ఠాకరే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మైకులు తొలగించని మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.