You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఏపీలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచుతున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి రావడంతో డీజిల్ సెస్‌ మాత్రమే విధిస్తున్నామని చెప్పారు.

లైవ్ కవరేజీ

పద్మ మీనాక్షి

  1. అక్బరుద్దీన్‌: ద్వేషపూరిత వ్యాఖ్యల కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు

    ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.

    10ఏళ్ల కిత్రం 2012లో నిజామాబాద్‌, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్‌ ఒవైసీ పైకేసు నమోదయింది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసు విషయంలో అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు.

    నాంపల్లి కోర్టు కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది.

    కేసు కొట్టివేసినంత మాత్రాన సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

  2. మహిళలు వాడే ఈ హ్యాండ్ బ్యాగుల ధర కోటి రూపాయలపైనే... వాటికి ఎందుకంత ఖరీదు?

  3. తెలంగాణ: "ధాన్యం సేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది" - కవిత కల్వకుంట్ల

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్‌ఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు.

    కేంద్ర ప్రభుత్వం రైతులను విడిచిపెట్టిన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మద్దతుగా నిలబడతారని అన్నారు.

    "మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రైతులను వదిలేసినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రైతులకు మద్దతుగా నిలబడతారు. వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా దిగుబడి చేస్తున్న ఇతర రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకారం అందించేందుకు ఒత్తిడి తేవాలి" అని ఆమె కోరారు.

  4. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలి - కర్నాటక కాంగ్రెస్ నాయకుల డిమాండ్

    కర్నాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ మంత్రి ఈశ్వరప్ప పైఫిర్యాదు చేశారు.

    ఈశ్వరప్ప కాంట్రాక్ట్ పనుల కోసం 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ మరణించడానికిముందు సందేశం పంపారని ఆరోపించారు. ఆయన మంగళవారం ఉడిపి జిల్లాలోని ఓ లాడ్జిలో శవమై కనిపించారు.

    "కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మరణానికి సంబంధించి కేఎస్ ఈశ్వరప్ప పై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించాం. రాజీనామా గురించి ఈశ్వరప్ప నిర్ణయం గురించి నాకు తెలియదు. నేను ఆయనతో మాట్లాడి విషయం తెలుసుకుంటాను" అని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

    సంతోష్ పాటిల్ మరణానికి సంబంధించి మంత్రి కేఎస్ ఈశ్వరప్పను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్కర్నాటక గవర్నర్ థవార్ చంద్ గెహ్లోత్‌కు లేఖను సమర్పించారు.

    ఆయనను అరెస్ట్ చేయాలని గవర్నర్ కు విన్నవించినట్లు చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా అవినీతి కేసును నమోదు చేయాలని కోరారు. ఆయన తన సొంత మనుషుల దగ్గర నుంచి కూడా 40% కమీషన్ తీసుకుంటారని ఆరోపించారు.

    మంత్రి ఈశ్వరప్ప, ముఖ్యమంత్రి బొమ్మై, ఈశ్వరప్ప సహచరులు రమేష్ ను కూడా అరెస్ట్ చేయాలని సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అయినవారందరినీ అరెస్టు చేసేవరకూ తన సోదరుడి శవాన్ని తీసుకుని వెళ్ళేది లేదని అన్నారు.

  5. తెలంగాణలో వరి సాగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? చేస్తోంది ఏంటి? - అభిప్రాయం

  6. నడిరోడ్లపై రష్యా సైనికుల అత్యాచారాలు... యుక్రెయిన్ మహిళల ఆరోపణ

  7. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మరో జలియన్‌వాలా బాగ్

  8. రైస్ మిల్లర్లతో టీఆర్ ఎస్ నేతల కుమ్మక్కు - రేవంత్ రెడ్డి ఆరోపణ

    తెలంగాణ రైస్ మిల్లర్లతో తెలంగాణ రాష్ట్ర సమితి కుమ్మక్కు అయిందని తెలంగాణ పీసీసీ బృందం ఆరోపించింది.

    ఈ మేరకు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌కు టీపీసీసీ బృందం వినతి పత్రం సమర్పించింది.

    "రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాలయాపన చేశారు. చాలా మంది రైతులు ఇప్పటికే తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారు" అని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీని పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

    ధాన్యం సేకరణ విషయంలో జరిగిన అవకతవకల పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

    ధాన్యం సేకరణతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు అంశాల పట్ల విచారణ జరపాలని కోరారు.

    మాదక ద్రవ్యాలు, కరెంటు చార్జీలు, నిరుద్యోగం లాంటి ఇతర అంశాల పై కూడా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

  9. మరియుపూల్‌ను చేజిక్కించుకునేందుకు దగ్గరగా ఉన్న రష్యన్ సేనలు

    రష్యా మరియుపూల్‌ను స్వాధీనం చేసుకునేందుకు చేరువ అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఆరు వారాలుగా మరియుపూల్‌ భీభత్సమైన రష్యన్ దాడులను ఎదుర్కొంటోంది.

    యుక్రెయిన్ మిలిటరీ మాత్రం తమ రక్షణ దళాలను నిలుపుకుంటూ క్షేత్ర స్థాయిలో ఉన్న సేనలతో సంప్రదింపులుచేస్తున్నట్లు చెబుతోంది. ఈ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చని యుక్రెయిన్ అంటోంది.

    ఆయుధాల కొరత ఏర్పడుతోందని యుక్రెయిన్ చెబుతోంది. యుక్రెయిన్ సేనలు కొన్ని వారాల పాటు రష్యన్ సేనల పై ప్రతిదాడులు చేస్తున్న స్థావరాల నుంచి దూరంగా వైదొలిగినట్లు భావిస్తున్నారు.

    రష్యా నగరం పై పట్టు సంపాదిస్తున్న కొలదీ ఆహారం, మంచి నీరు, ఆయుధ సరఫరాతో పాటు గాయపడిన వారిని బయటకు తరలించడం కష్టంగా మారుతోంది.

    రష్యా సేనలు మార్చి మొదటి వారం నుంచి మరియుపూల్‌ను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ దాడుల్లో కొన్ని వేల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

    మరియుపూల్‌ను రష్యా చేజిక్కించుకుంటే, మాస్కోకు దక్షిణ, తూర్పు దిక్కుల నుంచి కూడా యుక్రెయిన్ భూభాగం పై పూర్తి పట్టు సాధించినట్లవుతుంది.

    ఇది పుతిన్‌కు వ్యూహాత్మక విజయాన్ని చేకూరుస్తుంది. రష్యా విజయాన్ని చేజిక్కించుకునే మార్గంలో తొలి దశ అవుతుంది.

  10. క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? ఈ స్కోర్ తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

  11. షావోమి మాజీ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్‌‌కు ఈడి సమన్లు

    షావోమి ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్‌‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

    సంస్థ వ్యాపార ధోరణులు భారతీయ విదేశీ మారక చట్టాలకు అనుగుణంగా ఉన్నాయో, లేదోననే కేసులో విచారణ నిమిత్తం ఆయనకు సమన్లు జారీ అయినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    మను జైన్‌ను బుధవారం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని కోరాయి.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కేసులో విచారణ మొదలయింది.

    జైన్ ప్రస్తుతం దుబాయ్ నుంచి షావోమి సంస్థకు గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.

    ఆదాయపు పన్ను ఎగవేత కేసులో గత ఏడాది డిసెంబరులో భారత్‌లోని షావోమి కార్యాలయం పైఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

    భారత్‌లో 2021లో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో షావోమీ అగ్రస్థానంలో ఉంది.

  12. 'శ్రీలంకకు కష్టకాలంలో అండగా ఉంటాం' - శ్రీలంకలో చైనా రాయబార కార్యాలయం

    శ్రీలంకలో చైనా రాయబారి చీ జెన్‌హాంగ్ శ్రీలంక ఆర్ధిక మంత్రి అలీ సబ్రీతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ మేరకు శ్రీలంకలో చైనా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

    ఈ సమావేశంలో శ్రీలంక ఆర్ధిక భవితవ్యంతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వాణిజ్య, పెట్టుబడుల సహకారం గురించి కూడా చర్చించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఈకష్ట సమయంలో చైనా శ్రీలంకకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

    శ్రీలంకలో సుమారు 10,000 అల్పాదాయ కుటుంబాలకు నిత్యావసరాలను సరఫరా చేసినట్లు చైనా రాయబార కార్యాలయం తెలిపింది.

  13. న్యూయార్క్‌లో ఇద్దరు సిక్కుల పై దాడి

    న్యూయార్క్‌లోని రిచ్‌మండ్‌ హిల్స్‌లో జరిగిన సబ్‌వే కాల్పుల్లో ఇద్దరు సిక్కుల పై దాడి జరిగినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

    "న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్స్‌లో ఇద్దరు సిక్కుల పై దాడి జరిగింది. ఈ మేరకు స్థానిక అధికారులు, న్యూయార్క్ సిటీ పోలీసు విభాగాన్ని సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశాం. ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితులకు అన్ని విధాలా సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నాం" అంటూ అమెరికాలో భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

    ఈ దాడికి సంబంధించి న్యూయార్క్‌ స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

    "న్యూయార్క్‌లోని సిక్కు అమెరికన్ కమ్యూనిటీ పై జరిగే విద్వేష దాడులను సహించేది లేదు" అని అంటూ ఆమె చేసిన ప్రకటనను ట్వీట్చేశారు.

    “ఈ వారంలో సిక్కు అమెరికన్ల పై చోటు చేసుకున్న సంఘటనల గురించి నేను న్యూయార్క్ పోలీసులతో మాట్లాడాను. ఈ రెండు ఘటనలను విద్వేష దాడులుగా పరిగణించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాను" అని ఆమె పేర్కొన్నారు.

    “ఇటీవలి కాలంలో సిక్కు సమాజం పై ద్వేషపూరిత దాడులు 200 శాతం పెరిగాయి" అని ఆమె ఆ ప్రకటనలో అన్నారు.

  14. 1500 అడుగుల ఎత్తున రెండు రోజుల పాటు కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన పర్యటకులను ఎలా కాపాడారు

  15. దిల్లీలో 'ప్రధాన మంత్రుల సంగ్రహాలయం' ప్రారంభం

    దిల్లీలో ఏప్రిల్ 14న 'ప్రధాన మంత్రుల సంగ్రహాలయా'న్ని ప్రారంభిస్తున్నారు. నెహ్రు మ్యూజియానికి అనుసంధానంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

    భారతదేశం స్వాతంత్రం సంపాదించినప్పటి నుంచి ఇప్పటివరకు సేవలందించిన ప్రధానులందరి వివరాలను ఈ మ్యూజియంలో పొందుపరిచినట్లు నెహ్రు మెమోరియల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చెయిర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు.

    మాజీ ప్రధాని నెహ్రూను ప్రజాస్వామ్య వ్యవస్థల మూలలను బలపరిచిన వ్యక్తిగా అభివర్ణించారు.

    "దీనిని మరింత విస్తృతం చేయాలి. ఇదొక థింక్ ట్యాంక్‌లా మారుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలను చర్చిస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రధానులందరి అంచనాలకు అనుగుణంగా ఈ మ్యూజియం ఉంటుంది" అని అన్నారు.

    ఇందులో రాజ్యాంగ నిర్మాణం, రూపకర్తలు, రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు, ఎన్నికల కమీషన్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి.

    ఈ భవనంలో నెహ్రు ప్రైవేటు గదులను యథాతథంగా ఉంచినట్లు చెప్పారు.

    భారతప్రధాన మంత్రులకు విదేశాల నుంచి వచ్చిన బహుమతులన్నిటినీ 'తోషాఖానా'లో పరిరక్షించినట్లు చెప్పారు.

  16. "యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడి మారణహోమం" - బైడెన్

    యుక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న దాడిని ‘మారణహోమం' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

    అమెరికా ఈ దాడిని మారణహోమంగా పేర్కోవడం ఇదే మొదటిసారి. గతంలో పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని అమెరికా పేర్కొంది.

    రోజు రోజుకీ పెరుగుతున్న ధరలకు రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడే కారణమని ఆయన అన్నారు.

    “నేను దీనిని మారణహోమం అని అన్నాను. యుక్రెయిన్‌ను సమూలంగా నాశనం చేయడానికి పుతిన్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి." అని బైడెన్ వ్యాఖ్యానించారు.

    "యుక్రెయిన్‌లో రష్యా పాల్పడుతున్న అరాచకాలకు ఆధారాలు లభిస్తున్నాయి. రష్యా చర్యలను మారణహోమం అని అనొచ్చా లేదా అనే అంశాన్ని అంతర్జాతీయ సమాజం నిర్ణయిస్తుంది. నేను మాత్రం ఇది మారణహోమం అనే అనుకుంటున్నాను" అని అన్నారు.

    "ఇవి ఒక నిజమైన నాయకుడు చేసిన నిజమైన వ్యాఖ్యలు" అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్స్కీ బైడెన్ వ్యాఖ్యలను ప్రశంసించారు.

  17. బైడెన్ చేసిన ‘నరమేధం’ వ్యాఖ్యలపై జెలియెన్‌స్కీ ప్రశంసలు

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నరమేధంగా అభివర్ణించడాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ప్రశంసించారు.

    ఈ మేరకు ఆయన అమెరికా అధ్యక్షుడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

    ‘‘అసలైన నాయకుడి నోటి నుంచి నిజమైన మాట’’ అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    అలాగే అమెరికా అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన రష్యాను నిలువరించడానికి తమకు మరిన్ని భారీ ఆయుధాలు అత్యవసరంగా అందించాలని అమెరికాను కోరారు.

  18. న్యూయార్క్ సబ్‌వే స్టేషన్ కాల్పులతో సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తి ఫొటో విడుదల

    న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్‌వే వద్ద కాల్పుల ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఒకరి ఫొటోను అక్కడి పోలీసులు విడుదల చేశారు.

    ఈ దాడికి బాధ్యులుగా భావిస్తున్న ఫ్రాన్స్.ఆర్.జేమ్స్(62) కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.

    కాల్పుల ఘటనలో ఉపయోగించినట్లుగా భావిస్తున్న వ్యాన్‌ను ఫ్రాన్స్.ఆర్.జేమ్స్ అద్దెకు తీసుకున్నారు.

    జేమ్స్ ఫిలడెల్ఫియాలో ఈ వ్యాన్‌ను అద్దెకు తీసుకున్నారు. కాల్పుల తరువాత ఘటనా స్థలంలో పోలీసులు దీన్ని గుర్తించారు.

    జేమ్స్ ఎక్కడున్నారో ఎవరికైనా తెలిస్తే తమకు చెప్పాలంటూ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కోరింది.

    జేమ్స్ ఈ దాడిలో అనుమానితుడు కారని, అయితే, దాడికి సంబంధించిన వివరాలు ఆయనకు తెలిసి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు.

    అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

    ఈ దాడిలో 20 మంది గాయపడ్డారు.

    నారింజ రంగు టీ షర్టు ధరించిన ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

  19. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీ చూస్తూఉండండి.

  20. రిజర్వేషన్లు పదేళ్లు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా