పాకిస్తాన్: మంత్రివర్గంతో ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశం, అర్ధరాత్రి దాటిన తరువాత అవిశ్వాసంపై ఓటింగ్?

పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకురాలు మరియం నవాజ్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద మరోసారి నిప్పులుకక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ ధిక్కరించారని, అది దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య 10 లక్షలకు పరిమితం: సౌదీ అరేబియా

    హజ్ యాత్ర

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యపై 10 లక్షల పరిమితి విధిస్తున్నట్లు సౌదీ అరేబియా శనివారం తెలిపింది.

    స్వదేశీ యాత్రికులైనా, విదేశీ యాత్రికులైనా.. కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న వాళ్లు, 65 సంవత్సరాల లోపు ముస్లింలు ఈ ఏడాది హజ్ యాత్ర చేయవచ్చునని సౌదీ అరేబియా నిబంధనలు వెల్లడించిందని అల్ జజీరా చానల్ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

    గత ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా స్వదేశీయులు కొన్ని వేల మంది మాత్రమే హజ్ యాత్ర చేయగలిగారు.

    విదేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికులు తప్పనిసరిగా కోవిడ్-19 పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని, దీనితోపాటు అదనపు ఆరోగ్య జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుందని హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.

    హజ్ యాత్ర అనేది ఇస్లాం ఐదు మూల స్తంభాల్లో ఒకటి. సత్తువ గల ముస్లింలందరూ జీవితంలో ఒక్కసారైనా ఈ చేయాలన్నది మతపరమైన విధి. ఈ ఏడాది జూలై నెలలో హజ్ యాత్ర జరుగుతుంది.

    కోవిడ్ మహమ్మారికి ముందు హజ్ యాత్రకు ప్రతి ఏటా దాదాపు 25 లక్షల మంది వస్తుండేవారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. పాకిస్తాన్: జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని మధ్యాహ్నం 12:30 వరకూ వాయిదా వేసిన స్పీకర్

    పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని స్పీకర్ అసద్ ఖైసర్ మధ్యాహ్నం 12:30 గంటల వరకూ వాయిదా వేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    సభలో ప్రతిపక్ష సభ్యులు 173 మంది హాజరయ్యారని బీబీసీ ప్రతినిధి షుమేలా ఖాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ నుంచి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ప్రపంచ నం.1 నెదర్లాండ్స్ మహిళల హాకీ జట్టుపై భారత్ విజయం

    హాకీ

    ఫొటో సోర్స్, Odisha Sports

    ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హ్యాకీ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్-1 నెదర్లాండ్స్ మహిళల హాకీ జట్టును భారత్ ఓడించింది.

    శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత మహిళల హాకీ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది.

    ఈ లీగ్‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం. తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో భారత్ (15) రెండో స్థానానికి చేరుకుంది.

    మరోవైపు భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరగనుంది.

  4. పాకిస్తాన్: నేషనల్ అసెంబ్లీ సమావేశం షురూ

    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ భేటీ

    ఫొటో సోర్స్, Humaira Kanwal

    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు మొదలైంది.

    ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపై ఈ భేటీలో ఓటింగ్ నిర్వహించనున్నారు.

    అయితే.. ప్రతిపక్ష సభ్యులు అనేక మంది హాజరైనప్పటికీ అధికార పక్షం వైపు సీట్లు చాలా వరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి.

    ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంకా సభకు హాజరు కాలేదు.

    పాక్ విదేశాంగ మంత్రి, అధికార పీటీఐ పార్టీ నేత షా మహమూద్ ఖురేషి సభకు హాజరయ్యారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. శ్రీలంక‌: రాజపక్సను అభిశించాలి, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి - ప్రతిపక్షం డిమాండ్

    గొటబయ రాజపక్స

    ఫొటో సోర్స్, Getty Images

    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైపోయిన పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స గద్దె దిగాలని.. ఆయన స్వయంగా వైదొలగకపోతే ఆయనను అభిశంసించాలని, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) ఎంపీ విజిత హెరాత్ డిమాండ్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

    ఆయన శుక్రవారం శ్రీలంక పార్లమెంటు సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలంటే ముందుగా దేశంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని వ్యాఖ్యానించారు.

    ‘‘అభిశంసన తీర్మానం, అవిశ్వాస తీర్మానం రెండిటికీ మద్దతు ఇవ్వటానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు.

    అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలంతా ఆయనను కోరాలని కూడా విజిత పిలుపునిచ్చారు. దేశానికి కొత్త నేత వస్తేనే ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందన్నారు.

    ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం పెరిగిపోతుండటంతో వారం కిందట శ్రీలంక మంత్రివర్గంలో 26 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

    అధ్యక్షుడు రాజపక్స తన ప్రభుత్వ చట్టబద్ధతను నిలబెట్టుకోవటానికి ఏప్రిల్ 4వ తేదీన నలుగురు మంత్రుల పేర్లు ప్రకటించినప్పటికీ.. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించటం కోసం ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రభుత్వంలో చేరాలని ఆయన కోరారు.

  6. యుక్రెయిన్‌లో యుద్ధానికి సారథిని మార్చిన రష్యా.. కొత్త కమాండర్ నియామకం

    జనరల్ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌

    ఫొటో సోర్స్, Kremlin

    ఫొటో క్యాప్షన్, జనరల్ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌

    యుక్రెయిన్‌లో రష్యా తన సైనిక నాయకత్వాన్ని పునర్‌వ్యవస్థీకరించినట్లు పశ్చిమ దేశాల నాయకులు ధృవీకరించారు.

    సిరియాలో యుద్ధ కార్యకలాపాల్లో విస్తృత అనుభవమున్న కొత్త జనరల్‌ను యుక్రెయిన్‌లో యుద్ధ కార్యక్రమాలకు ఇన్‌చార్జిగా నియమించినట్లు వారు చెప్పారు.

    రష్యా దక్షిణ సైనిక జిల్లా కమాండర్ జనరల్ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను యుక్రెయిన్ మీద దండయాత్రకు సారథిగా నియమించినట్లు బీబీసీ ప్రతినిధి గోర్డన్ కొరేరాకు ఆ వర్గాలు వెల్లడించాయి.

    ‘‘ఆ కమాండర్‌కు సిరియాలో రష్యా సైనిక కార్యకాలాపాల నిర్వహణలో చాలా అనుభవముంది. కాబట్టి యుక్రెయిన్‌లో రష్యా సైనిక నియంత్రణ, సారథ్యం మెరుగుపడుతుందని భావించవచ్చు’’ అని తమ వివరాలు వెల్లడించవద్దన్న షరతుతో ఆ వర్గాలు చెప్పాయి.

    యుక్రెయిన్ మీద 44 రోజుల కిందట సైనిక చర్య చేపట్టిన రష్యా ఇప్పటివరకూ తన యుద్ధ లక్ష్యాలను సాధించటానికి తంటాలు పడుతోంది. కీయెవ్ వంటి ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవటంలో విఫలమై.. తూర్పున డోన్బాస్ ప్రాంతం మీదకు తన దృష్టిని మళ్లించింది.

    రష్యా యుద్ధ వ్యూహాలను.. వారి కన్నా తక్కువ సంఖ్యలో ఉన్న యుక్రెయిన్ సైనిక విభాగాలు మరింత తెలివిగా, ఆశ్చర్యకరంగా ప్రతిఘటించాయని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

    ‘‘రష్యా తన వ్యూహాలను మార్చుకోలేకపోతే వారు పునర్నిర్దేశించుకున్న ఈ పరిమిత లక్ష్యాలను సాధించటం కూడా చాలా కష్టమవుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.

  7. మంటల మధ్య పోలీసుల చేతుల్లో కనిపిస్తున్న ఈ పాప ఎవరు? అసలు ఏం జరిగింది

  8. పాకిస్తాన్: నేషనల్ అసెంబ్లీకి చేరుకుంటున్న సభ్యులు

    పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ కోసం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశం శనివారం జరుగుతోంది.

    ఈ సమావేశానికి హాజరవటానికి నేషనల్ అసెంబ్లీ సభ్యులు రావటం మొదలైందని పాక్ మీడియా చెప్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. కొరియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి

    పి.వి.సింధు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పి.వి.సింధు (ఫైల్ ఫొటో)

    కొరియా ఓపెన్ బ్యాండ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత క్రీడాకారిణి పి.వి.సింధు ఫైనల్స్‌కి చేరుకోలేకపోయారు.

    శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో రెండో సీడ్ క్రీడాకారిణి ఆన్ సెయాంగ్ చేతిలో 14-21, 17-21 స్కోరుతో సింధు ఓడిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. పాకిస్తాన్‌లో విదేశీ ప్రభుత్వాన్ని సహించను: ఇమ్రాన్ ఖాన్

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Twitter/@ImranKhanPTI

    పాకిస్తాన్‌లో పార్లమెంటును పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం.. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌లో విదేశీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాన్ని నేను సహించను. ఒకవేళ అలాంటిది జరిగితే నేను ప్రజల్లోకి వెళ్లి వాళ్ల మద్దతు కోరుతాను’’ అని చెప్పారు.

    ‘‘మా దేశం టిష్యూ పేపర్‌ లాగా ఉపయోగించుకోగల దేశం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ‘‘సుప్రీంకోర్టు నిర్ణయం నన్ను నిరాశపరిచింది. కానీ పాకిస్తాన్ కోర్టులు, సుప్రీంకోర్టును నేను గౌరవిస్తాను’’ అని పేర్కొన్నారు.

    ప్రతిపక్షాల మీద విమర్శలు ఎక్కుపెడుతూ ‘‘వారి తమపై ఉన్న అవినీతి కేసులను తొలగించాలని కోరుకుంటున్నారు’’ అన్నారు. ప్రతిపక్షాలకు తమ మీద తమకు అంత ధీమా ఉంటే ఎన్నికలు నిర్వహించటానికి ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు.

    ప్రజలు ఆదివారం నాడు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

    ‘‘బయటి కుట్రల వల్ల జరుగుతున్న డ్రామాను మీరు వ్యతిరేకించాలి. ఇది మన బాధ్యత. పాకిస్తాన్ సజీవమైన దేశమైన చాటాలి. చరిత్ర ఎవరినీ ఎన్నడూ క్షమించదు. ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో చరిత్ర తేటతెల్లం చేస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయాల్లో ఏది మంచిదో, ఏది దేశ ప్రయోజనాలకు మంచిది కాదో చరిత్ర చెప్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  11. చరిత్రలో అత్యధిక స్థాయికి పెరిగిన ఆహార ధరలు: ఐరాస

    ఆహార ధరలు

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆహార ధరలు గత నెలలో భారీ ఎత్తున పెరిగిపోయాయని ఐక్యరాజ్య సమితి చెప్తోంది.

    ధాన్యాలు, వంట నూనెలు, పంచదార వంటి కనీస నిత్యావసరాల ధరలు పెరిగిపోవటం ఐరాస ఆహార ధరల సూచీలో వెల్లడయింది. అరవై ఏళ్ల కిందట ఆహార ధరల నమోదు మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ఈ ధరలు అత్యధిక స్థాయికి పెరిగిపోయాయి. పిబ్రవరిలో అధిక ధరలు నమోదు కాగా మార్చిలో ఏకంగా 13 శాతం పెరిగాయి.

    సన్‌ఫ్లవర్ ఆయిల్‌ ప్రపంచంలో అత్యధికంగా యుక్రెయిన్ నుంచే ఎగుమతి అవుతుంది. దీనివల్ల.. ప్రత్యామ్నాయ వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. గోధుమలు, మొక్కజొన్న వంటి ధాన్యాల ఉత్పత్తిలో కూడా యుక్రెయిన్‌ చాలా పెద్ద దేశం.

    జీవన ధరలు పెరిగిపోతూ సంక్షోభం తలెత్తుతుండటం ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. సామాజిక అశాంతి పెరిగిపోతోందన్న హెచ్చరికలు వస్తున్నాయి.

  12. విల్ స్మిత్ మీద ఆస్కార్ నుంచి పదేళ్లు నిషేధం.. చెంప దెబ్బ ఫలితం

    విల్ స్మిత్

    ఫొటో సోర్స్, EPA

    హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌ను ఆస్కార్ వేడుకలు, ఇతర అకాడమీ కార్యక్రమాల నుంచి పదేళ్ల పాటు నిషేధించారు. ఇటీవల ఆస్కార్ అవార్డుల ప్రకటన కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన హాస్య నటుడు క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టినందుకు ఆస్కార్ అకాడమీ ఈ చర్య తీసుకుంది.

    ‘‘94వ అస్కార్ కార్యక్రమంలో విల్ స్మిత్ వేదిక మీద అవాంఛనీయమైన, హానికరమైన ప్రవర్తనను ప్రదర్శించారు’’ అని అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది.

    విల్ స్మిత్ తన చర్య పట్ల క్షమాపణ చెప్తూ అకాడమీకి రాజీనామా చేశారు.

    విల్ స్మిత్

    ఫొటో సోర్స్, Reuters

    అలోపేసియా అనే ఆరోగ్య స్థితి వల్ల జుట్టును కోల్పోయిన తన భార్య గుండు మీద జోక్ చేయటంతో ఆగ్రహించిన విల్ స్మిత్ వేదిక మీదకు వెళ్లి ఆయనను చెంప దెబ్బ కొట్టారు.

    ఆ తర్వాత గంట లోపే విల్ స్మిత్‌కు ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేశారు. కింగ్ రిచర్డ్ సినిమాలో టెన్నిస్ స్టార్లు వీనస్, సెరెనా విలియమ్స్‌ల తండ్రి పాత్రలో ఆయన నటనకు గాను ఈ అవార్డును ప్రకటించారు.

    ఆస్కార్ అవార్డులను ప్రకటించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ శుక్రవారం నాడు వర్చువల్‌గా సమావేశమై విల్ స్మిత్ మీద క్రమశిక్షణ చర్య గురించి చర్చించి ఆయనను అకాడమీ నుంచి పదేళ్లు సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

  13. ఏపీలో కరెంటు తిప్పలు: ప్రభుత్వాస్పత్రిలో సెల్‌ఫోన్లు వెలుతురులో ప్రసవం

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు

    ఫొటో సోర్స్, ANI

    ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయనే దానికి అద్దం పట్టే ఉదంతమిది. నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ సెల్ ఫోన్ల వెలుతురులో బిడ్డను ప్రసవించారు.

    ‘‘ఆస్పత్రి సిబ్బంది అర్ధరాత్రి పూట.. సెల్ ఫోన్లు, టార్చి లైట్లు, కొవ్వొత్తులను ఎన్ని వీలైతే అన్ని తీసుకురావాలని మాకు చెప్పారు. మేం కొన్నిటిని మాత్రమే ఏర్పాటు చేయగలిగాం’’ అని ఆమె భర్త తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. ‘‘భారత్ అంటే అంత ఇష్టమైతే.. అక్కడికే వెళ్లిపోండి’’, ఇమ్రాన్ ఖాన్‌కు మరియమ్ నవాజ్ సూచన

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, IMRAN KHAN/FACEBOOK

    ‘‘భారత్ అంటే అంత ఇష్టమైనప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌ను వదిలిపెట్టి అక్కడికే వెళ్లిపోవాలి’’అని పాకిస్తాన్‌లోని ప్రధాన విపక్షమైన పీఎంఎల్-ఎన్ నాయకురాలు మరియమ్ నవాజ్ వ్యాఖ్యానించారు.

    శుక్రవారం జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తూ దేశ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన విమర్శించారు. తన ప్రసంగంలో భారత్‌పై ఆయన ప్రసంశలు కురిపించారు.

    ‘‘భారత విదేశాంగ విధానంలో ఏ దేశమూ జోక్యం చేసుకునే ధైర్యం చేయదు’’అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

    ‘‘భారత విదేశాంగ విధానం చాలా స్వతంత్రంగా ఉంటుంది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గడం లేదు’’అని ఇమ్రాన్ అన్నారు.

    ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మరియమ్ ట్వీట్ చేశారు. ‘‘మీరు పొగుడుతున్న ఆ భారత్‌లో చాలా మంది ప్రధాన మంత్రులపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ, అక్కడ ఎవరూ రాజ్యాంగంతో ఆటలు ఆడుకోలేదు. ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానంపై ఓడిపోయిన వాజ్‌పేయీ ప్రశాంతంగా పదవిని వదిలిపెట్టేశారు. ఆయన మీలా దేశాన్ని స్తంభింప చేయలేదు’’అని మరియమ్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.