యుక్రెయిన్: రైల్వే స్టేషన్‌ మీద రాకెట్ దాడి... 50కి చేరిన మృతుల సంఖ్య

తూర్పు యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రష్యా రాకెట్ దాడిలో 30 మందికి పైగా చనిపోయినట్లు యుక్రెయిన్ రైల్వే విభాగం తెలిపింది. యుక్రెయిన్ ప్రజలను తరలించేందుకు ఈ రైల్వే స్టేషన్ కీలకంగా ఉంది. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని రష్యా ప్రకటన.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ and పృథ్వి రాజ్

  1. నేటి ముఖ్య పరిణామాలివీ...

    • యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రాకెట్లదాడిలో మృతుల సంఖ్య 50కి పెరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ పావ్లో తెలిపారు. ఈ దాడి చేసింది రష్యా అని యుక్రెయిన్ ఆరోపిస్తోంటే.. ఆ దాడితో తమకు ప్రమేయం లేదని రష్యా నిరాకరిస్తోంది.
    • దాడికి ఉపయోగించిన క్షిపణుల ఉపయోగాన్ని తాము కొన్నేళ్ల కిందటే నిలిపివేశామని, వాటిని యుక్రెయిన్ ఉపయోగిస్తోందని రష్యా చెప్తోంది. అయితే.. యుక్రెయిన్ మీద దండయాత్రలో రష్యా పలు ప్రాంతాల్లో దాడులకు ఇదే రకం క్షిపణులను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
    • ముంబైపై ఉగ్రవాద దాడి కేసు నిందితుడు లష్కర్-ఎ-తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కి 31 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ యాంటీ-టెర్రరిజం కోర్టు తీర్పు ఇచ్చిది. ఆయన ఇప్పటికే వేరే కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
    • ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఓడరేవు నుంచి.. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు ఆహారధాన్యాలు తరలిస్తున్నారు. మొత్తం 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత 11 వేల మెట్రిట్ టన్నుల బియ్యంతో ఓడ బయలుదేరింది.
    • దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వయోజనులు బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు.. కోవిషీల్డ్ బూస్టర్ డోసు రూ. 600 ధరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోవిడ్ వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేసే సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.
    • కొరియన్ ఓపెన్‌ సింగిల్స్‌లో పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక మెన్స్ డబుల్స్‌లో స్వాతిక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాక్ షెట్టీ జోడి క్వార్టర్స్‌లో ఓడిపోయింది.
    • ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం మీద ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఆదివారం పరిశ్రమలు మూతవేయాల్సి ఉండగా ఇక నుంచి మరో రోజు అదనంగా పవర్ హాలిడే అమలు చేయాల్సి ఉంటుంది. విద్యుత్‌ను కూడా 50శాతం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

    ఇవి ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ యుద్ధంపై తాజా పరిణామాలను బీబీసీ న్యూస్ లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

  2. యుద్ధంలో రష్యా సైనికులను గణనీయంగా కోల్పోయాం: పుతిన్ అధికార ప్రతినిధి

    దిమిత్రీ పెస్కోవ్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లో తమ ‘సైనికులను గణనీయంగా కోల్పోయామ’ని రష్యా అంగీకరించింది.

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడి మొదలుపెట్టి శుక్రవారానికి 44 రోజులైంది.

    రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ బ్రిటిష్ చానల్ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ.. యుక్రెయిన్‌లో రష్యా సైనికుల మరణాలు తమకు ‘ఓ పెద్ద విషాదమ’ని అభివర్ణించారు.

    రష్యా తన యుద్ధ లక్ష్యాలను రాబోయే రోజుల్లో సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

    రష్యా రక్షణ మంత్రిత్వశాఖ మార్చి 25న యుక్రెయిన్ యుద్ధంలో తమ సైనికుల గురించి చెప్తూ.. అప్పటివరకూ 1,351 మంది చనిపోయారని పేర్కొంది.

    అయితే దాదాపు 19,000 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అంటోంది.

    రష్యా చెప్తున్న అంకెలను కానీ, యుక్రెయిన్ చెప్తున్న అంచనాలను కానీ స్వతంత్రంగా ధృవీకరించటం సాధ్యం కాదు. అయితే రష్యా తన సైనికుల మరణాల సంఖ్యను తక్కువ చేసి చెప్తుండవచ్చునని, యుక్రెయిన్ ఎక్కువ చేసి చెప్తుండవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.

    ఈ యుద్ధంలో 7,000 నుంచి 15,000 వరకూ రష్యా సైనికులు చనిపోయి ఉంటారని పశ్చిమ దేశాల నాయకులు భావిస్తున్నారు.

    ఈ యుద్ధాన్ని ముగించటానికి రష్యా మార్గాలను అన్వేషిస్తోందని కూడా.. 22 ఏళ్లుగా పుతిన్ అధికార ప్రతినిధిగా ఉన్న పెస్కోవ్ తెలిపారు.

  3. చాలా రోజులకు బయట కనిపించిన పుతిన్

    పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా రోజుల తరువాత బయట కనిపించారు.

    ఆయన శుక్రవారం నాడు అతిజాతీయవాద రష్యా రాజకీయ నాయకుడు వ్లాదిమిర్ ఝిరినోవ్‌స్కీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

    మాస్కోలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాల్లో.. ఝిరినోవ్‌స్కీ మృతదేహాన్ని ఉంచిన శవపేటిక మీద పుతిన్ పుష్పగుచ్ఛాలు పెట్టి, క్రైస్తవ మత పద్ధతిలో శిలువ చిహ్నం వేసుకుని, తలవంచి నివాళులర్పిస్తూ కనిపించారు.

    ఝిరినోవ్‌స్కీ (వయసు 75 ఏళ్లు) గత బుధవారం నాడు కోవిడ్ సమస్యల వల్ల చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

    ఇటీవలి నెలల్లో పుతిన్ బయట కనిపించటం అరుదుగా మారింది. యుక్రెయిన్ మీద ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైనిక దాడి మొదలుపెట్టిన తర్వాత ఆయన తొలిసారి మార్చి 18న మాస్కోలోని ఒక స్టేడియంలో యుద్ధానికి అనుకూలంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

  4. యుక్రెయిన్ స్టేషన్ మీద పేల్చిన మిసైళ్లు రష్యావి కావా? అవి యుక్రెయిన్‌వే అంటున్న రష్యా వాదనలో నిజమెంత?

    యుక్రెయిన్ స్టేషన్ మీద పేల్చిన మిసైళ్లు

    యుక్రెయిన్‌లోనిక్రమటార్స్క్ రైల్వే స్టేషన్ దాడికి ఉపయోగించిన క్షిపణుల శిథిలాలను బట్టి.. అవి టోచ్కా-యు టాక్టికల్ ప్రొజెక్టైల్ మిసైళ్లని.. వాటిని ప్రస్తుతం యుక్రెయిన్ సైనిక బలగాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని రష్యా వాదిస్తోంది.

    ఈ క్షిపణులను వినియోగించటం తాము 2019లోనే నిలిపివేశామని, వాటి స్థానంలో ఆధునిక ఇస్కాందర్-ఎం క్షిపణులను తెచ్చామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించినట్లు రష్యా మీడియా కథనాలు చెప్పాయి.

    అయితే.. యుక్రెయిన్‌లోని డోనెస్క్ గవర్నర్ మాత్రం క్రమటార్స్క మీద దాడిలో రష్యా సైన్యం టోచ్కా-యు మిసైళ్లను ఉపయోగించిందని ఆరోపించారు.

    ఈ మిసైళ్ల వినియోగాన్ని తాము కొన్నేళ్ల కిందటే నిలిపివేశామన్న రష్యా వాదనలో నిజానిజాలను బీబీసీ వరల్డ్ సర్వీస్ పరిశోధనాత్మక విలేకరి మనీషీ గంగూలీ పరిశీలిస్తున్నారు. రష్యా వాదనకు, వాస్తవాలకు పొంతన కుదరటం లేదని ఆమె చెప్తున్నారు.

    యుక్రెయిన్ స్టేషన్ మీద పేల్చిన మిసైళ్లు

    డోనెస్క్ ఒబ్లాస్ట్‌లోని వుహ్లెదార్‌లో ఒక ఆస్పత్రి మీద ఫిబ్రవరి 24వ తేదీన రష్యా చేసిన దాడిలో ఈ టోచ్కా-యు మిసైళ్లను ఉపయోగించారనేందుకు ఆధారాలున్నాయని ఆమె చెప్తున్నారు. ఆ దాడిలో నలుగురు పౌరులు చనిపోగా మరో పది మంది గాయపడ్డారు.

    ఆమ్నెస్టీ ఇంటర్నేషన్‌కు చెందిన క్షిపణి పరిశోధకులు ఒకరు.. ఆ ఘటనకు సంబంధించిన ఆయుధాల శిథిలాల ఫొటోలను విశ్లేషించారు. అవి 9ఎం79 టోచ్కా బాలిస్టిక్ మిసైళ్లవని తేల్చారు.

    ఆ ఆయుధాలు లోపభూయిష్టంగా పనిచేస్తాయని, తమ లక్ష్యాలను అర కిలోమీటరు, అంతకన్నా ఎక్కువగా తప్పుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.

    యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ చెప్తున్నదాని ప్రకారం.. లుహాన్స్క్ మీద దాడిలో మార్చి 19వ తేదీన కూడా టోచ్చా మిసైళ్లను ఉపయోగించారు. ఈ మిసైళ్లు ఒక దానిని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చివేసినట్లు కూడా యుక్రెయిన్ సైన్యం చెప్తోంది.

    టోచ్కా మిసైళ్లన్నీ పాత సోవియట్ ఆయుధాగారంలోనివేనని క్షిపణుల నిపుడు ఎన్.ఆర్. జెన్జెన్ జోన్స్ పేర్కొన్నారు.

  5. యుక్రెయిన్: 50కి పెరిగిన రైల్వేస్టేషన్ మీద దాడి మృతులు

    క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రాకెట్లదాడి

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రాకెట్లదాడిలో మృతుల సంఖ్య 50కి పెరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ పావ్లో కిరిలెంకో టెలిగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

    రైల్వే స్టేషన్ వద్ద 38 మంది చనిపోగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు.

    దాడి జరిగిన తర్వాత మొత్తం 98 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారిలో 16 మంది చిన్నారులు కాగా 46 మంది మహిళలు, 36 మంది పురుషులు ఉన్నారని ఆయన చెప్పారు.

    మున్ముందు మరింత మంది క్షతగాత్రులు చికిత్స కోసం ఆస్పత్రికి వస్తారని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

  6. లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాక్ కోర్టు

    హఫీజ్ సయీద్

    ఫొటో సోర్స్, Getty Images

    ముంబైపై ఉగ్రవాద దాడి కేసు నిందితుడు లష్కర్-ఎ-తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కి 31 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ యాంటీ-టెర్రరిజం కోర్టు తీర్పు ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఉగ్రవాదానికి నిధులు సమకూర్చటానికి సంబంధించిన రెండు వేర్వేరు కేసుల్లో కోర్టు ఈ శిక్ష విధించింది. ఒక కేసులో 15 సంవత్సరాల ఆరు నెలలు, మరో కేసులో 16 సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్షతో పాటు మొత్తం 3.40 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా విధించింది.

    పాకిస్తాన్‌లోని పంజాబ్ యాంటీ-టెర్రరిజం డిపార్ట్‌మెంట్ హఫీజ్ సయీద్ మీద ఈ కేసులు నమోదు చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆయన ఇప్పటికే వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్నారు.

    వేరే మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న హఫీజ్ సయీద్‌కు 2020 నవంబర్‌లో లాహోర్‌లోని స్పెషల్ యాంటీ-టెర్రరిజం కోర్టు మూడున్నరేళ్ల జైలుశిక్ష, జరిమానాలు విధించింది.

    మరో రెండు కేసుల్లో 2020 ఫిబ్రవరిలో స్పెషల్ యాంటీ-టెర్రరిజం కోర్టు సయీద్‌కు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

  7. కాకినాడ నుంచి శ్రీలంకకు 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా

    శ్రీలంకకు బియ్యం సరఫరా

    ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఓడరేవు నుంచి.. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు ఆహారధాన్యాలు తరలిస్తున్నారు.

    మొత్తం 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత 11 వేల మెట్రిట్ టన్నుల బియ్యంతో ఓడ బయలుదేరింది.

    ఆహారధాన్యాలు సహా వివిధ సరుకుల కొరతతో చిక్కుల్లో ఉన్న శ్రీలంకకి మానవతాసహాయం కింద ఈ బియ్యం తరలిస్తున్నారు.

    భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కాకినాడకి చెందిన ప్రైవేటు సంస్థకి అప్పగించింది. దానికి తగ్గట్టుగా చెన్ గ్లోరీ -1 అనే నౌకలో తొలుత బియ్యాన్ని లోడ్ చేసి పంపించారు.

    సంక్షోభంలో ఉన్న శ్రీలంక వాసులకు ఇది చేదోడుగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. మరింతగా బియ్యం ఎగుమతుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని కాకినాడ పోర్ట్ అధికారులు వెల్లడించారు.

    శ్రీలంకకు బియ్యం సరఫరా
  8. కోవిడ్ బూస్టర్ డోసు ధర రూ. 600గా ప్రకటించిన సీరం

    కోవిడ్ వ్యాక్సీన్

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా మహమ్మారి మీద యుద్ధంలో శుక్రవారం నాడు రెండు పెద్ద ప్రకటనలు వెలువడ్డాయి.

    18 ఏళ్ల వయసు దాటిన వయోజనులు బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

    మరోవైపు.. కోవిషీల్డ్ బూస్టర్ డోసు రూ. 600 ధరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోవిడ్ వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేసే సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇంతకుముందు.. 18 ఏళ్ల వయసు పైబడిన వారికి ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రైవేటు వాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది.

    ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 18 ఏళ్లు నిండిన వారిలో కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకుని తొమ్మిది నెలలు పూర్తయిన వారు మాత్రమే బూస్టర్ డోసు తీసుకోవచ్చు.

  9. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఐక్యం చేయటానికి చర్చలు జరుగుతున్నాయి: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఐక్యం చేయటానికి, దాని నిర్మాణం, ఆచరణలను నిర్ణయించటానికి చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    రాహుల్ గాంధీ శుక్రవారం నాడు సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శరద్ యాదవ్‌ను ఒక రాజకీయ గురువుగా అభివర్ణించారు.

    ‘రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేయాలని మీరు అంటారా?’ అని విలేకరులు శరద్‌యాదవ్‌ను ప్రశ్నించగా.. ‘‘ఎందుకు చేయకూడదు? కాంగ్రెస్ పార్టీని ఎవరైనా 24 గంటలూ నడిపిస్తున్నారంటే అది రాహుల్ గాంధీయే. ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేయాలని నేను భావిస్తున్నా. అప్పుడే ఏదైనా పెద్ద పరిణామం జరుగుతుంది’’ అని ఆయన బదులిచ్చారు.

    ఇదే అంశంపై రాహుల్ స్పందిస్తూ ‘‘చూద్దాం’’ అని వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘యుక్రెయిన్ - రష్యా నమూనా ఇక్కడ కూడా వర్తించవచ్చు’

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాన్ని వ్యాపింపజేస్తూ దేశాన్ని విభజిస్తోందని రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు.

    చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద కూడా రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్శలు సంధించారు.

    ‘‘డోనెస్క్, లూహాన్స్క్‌లు యుక్రెయిన్‌లో భాగమని గుర్తించటానికి రష్యా ఎలా తిరస్కరిస్తోందో.. చైనా కూడా లదాఖ్, అరుణాచల్‌లను గుర్తించటానికి సిద్ధంగా లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘రష్యా అదే ప్రాతిపదికన యుక్రెయిన్ మీద దాడి చేసింది. దాని లక్ష్యమేంటి? నాటో-యుక్రెయిన్-అమెరికా కూటమిని విచ్ఛిన్నం చేయటం’’ అని వ్యాఖ్యానించారు.

    ‘‘ప్రభుత్వం దీనిని విస్మరిస్తోంది. కానీ ఇక్కడొక నమూనా ఉంది (రష్యా-యుక్రెయిన్). ఆ నమూనా ఇక్కడ కూడా వర్తించవచ్చు. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించటం లేదు. వారు అంగీకరించకపోతే వారు సంసిద్ధం కారు. అలాంటపుడు పరిస్థితి విషమించిన తర్వాత స్పందించలేరు’’ అని రాహుల్ విశ్లేషించారు.

  10. యుక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై పేల్చిన రాకెట్ మీద ‘పిల్లల కోసం’ అని రాతలు

    మటార్స్క్ రైల్వే స్టేషన్ మీదపేల్చిన రాకెట్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీదపేల్చిన రాకెట్లలో ఒకటి ఆ స్టేషన్ దగ్గర పడింది. ఆ రాకెట్ మీద ‘‘పిల్లల కోసం’’ అని రష్యాన్ భాషలో రాసి ఉంది.

    దాని మీద రష్యన్‌లో రాసివున్న ‘జా డెటీయ్’ అనే పదాన్ని చూస్తే.. ఈ రాకెట్‌ను పిల్లలకు మద్దతుగా కానీ, పిల్లల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా కానీ పేల్చినట్లు అది సూచిస్తోంది. పిల్లలను లక్ష్యంగా చేసుకుని పేల్చినట్లుగా అది సూచించటం లేదు.

    క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన దాడిలో నలుగురు పిల్లలు సహా 39 మంది చనిపోయారని యుక్రెయిన్ అధికారులు చెప్తున్నారు.

    ఇటీవలి రోజుల్లో పోరాటం తీవ్రతరమైన తూర్పు యుక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించటానికి ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు.

  11. యుక్రెయిన్ యుద్ధం: రష్యా యుద్ధ ఖైదీని యుక్రెయిన్ సైనికులు చంపేశారా... వైరల్ వీడియోలో నిజమెంత?

  12. క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ దాడిలో మా ప్రమేయం లేదు: రష్యా

    క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ దాడి

    తూర్పు యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రాకెట్ దాడిలో మృతుల సంఖ్య 39కి పెరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ పావ్లో కీరిలెంకో చెప్పారు. ఈ షెల్లింగ్‌లో మరో 87 మంది గాయపడ్డట్లు తెలిపారు.

    అయితే.. క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద రాకెట్ దాడిలో తమ ప్రమేయం లేదని రష్యా నిరాకరించింది.

    ఆ స్టేషన్ మీద రష్యా దాడి చేసిందనే ఆరోపణలు రెచ్చగొట్టటమేనని, అవి పూర్తిగా అబద్ధమని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది.

    యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఈ తరహా దాడుల విషయంలోనూ రష్యా ఇదే విధంగా తన ప్రమేయం లేదంటూ తిరస్కరించింది.

  13. 'గని' రివ్యూ: బాక్సింగ్ రింగ్‌లో త‌డ‌బ‌డ్డ‌ హీరోయిజం

  14. యుక్రెయిన్: వెయ్యి మందికిపైగా ఉన్న రైల్వే స్టేషన్ మీద రాకెట్ దాడి

    రాకెట్ దాడి జరిగిన రైల్వే స్టేషన్

    ఫొటో సోర్స్, Pavlo Kyrylenko

    తూర్పు యుక్రెయిన్‌లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రష్యా రాకెట్ దాడిలో 30 మందికి పైగా చనిపోయినట్లు యుక్రెయిన్ రైల్వే విభాగం తెలిపింది.

    100 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించింది.

    యుక్రెయిన్ ప్రజల తరలింపుకు ఉపయోగిస్తున్న క్రమటార్స్క్ రైల్వే స్టేషన్‌లో దాడి జరిగినప్పుడు వేల మంది ఉన్నారని దొనెత్స్క్ ప్రాంత గవర్నర్ తెలిపారు.

    రెండు రాకెట్లు స్టేషన్ ఢీ కొట్టినట్లు యుక్రెయిన్ రైల్వే సారథి వెల్లడించారు.

  15. 1800ల నాటి శివలింగాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

    శివలింగం

    ఫొటో సోర్స్, ani

    అమెరికాకు తరలిస్తున్న పురాతన శివలింగాన్ని ఎయిర్ కార్గో ఇంటెలిజెన్స్ యూనిట్ స్వాధీనం చేసుకుంది.

    ఏడు తలల నాగు పాము చుట్టుకుని ఉన్న ఈ శివలింగాన్ని ఒక ఎంపోరియం నుంచి కొనుగోలు చేసినట్లుగా తరలిస్తున్న వారు తెలిపారు.

    కానీ వాస్తవానికి తమిళనాడులోని గెదిలంలో ఒక వ్యక్తి నుంచి సేకరించినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఈ శివలింగం 1800 కాలానికి చెందినదిగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. కొరియా ఓపెన్: సెమీ ఫైనల్‌కు చేరిన పీవీ సింధూ

    కొరియన్ ఓపెన్‌ సింగిల్స్‌లో పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.

    ఇక మెన్స్ డబుల్స్‌లో స్వాతిక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాక్ షెట్టీ జోడి క్వార్టర్స్‌లో ఓడిపోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. కేటీఆర్: ‘గవర్నర్ హోదాకు తగినట్లు పని చేస్తే మేం కూడా ఆమెను గౌరవిస్తాం’

    తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్

    ఫొటో సోర్స్, KTR/Facebook

    ‘గవర్నర్ తన హోదాకు తగినట్లు పని చేస్తే మేం కూడా ఆమెను గౌరవిస్తాం’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

    తెలంగాణ గవర్నర్‌ తమిళసైను అవమానించారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. గవర్నర్‌కు తాము ఎంతో మర్యాద, గౌరవం ఇచ్చామని అన్నారు.

    ‘తెలంగాణ గవర్నర్ కాకముందు ఆమె తమిళనాడు బీజేపీ సారథిగా ఉన్నారు. గవర్నర్ కావడానికి ఆమెకు రాజకీయ నేపథ్యం అడ్డు కాలేదు.

    కానీ కౌశిక్ రెడ్డి ఎమ్‌ఎల్‌సీ కావడానికి అదే నేపథ్యం అడువచ్చిందా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

  18. మ్యూజియంలో చిన్న తిమింగలం ఎంత ఉందో, పెద్ద తిమింగలం తల అంత పెద్దగా ఉంటుంది

    1949, 1960ల్లో విశాఖ తీరానికి పెద్ద తిమింగలాలు కొట్టుకొచ్చాయి. వాటి అస్థిపంజరాలతో మ్యూజియం నిర్మించారు. ఆపై వేలాది మంది పరిశోధనలకు ఈ తిమింగలాల మ్యూజియం కేంద్ర బిందువుగా మారింది.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  19. ఆర్‌బీఐ: త్వరలో అన్ని ఏటీఎంలలో కార్డు లేకుండానే నగదు డ్రా చేయొచ్చు

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం

    ఫొటో సోర్స్, ani

    కార్డు లేకుండానే నగదు డ్రా చేసుకునే సదుపాయాన్ని అన్ని బ్యాంకుల ఏటీఎంలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

    ప్రస్తుతం కార్డు లేకుండా నగదు డ్రా చేసుకునే సదుపాయం కొన్ని బ్యాంకులకు మాత్రమే అందుబాటులో ఉంది.

    ఇప్పుడు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా అన్ని బ్యాంకుల ఏటీమ్‌లకు ఈ సదుపాయాన్ని కల్పిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

    కార్డు లేకుండా నగదు డ్రా చేసుకునే సదుపాయం వల్ల కార్డ్ క్లోనింగ్, స్కిమ్మింగ్ వంటి మోసాలను నిరోధించొచ్చని ఆయన అన్నారు.

  20. ఆంధ్రప్రదేశ్ : విద్యుత్ కోతలపై ఆన్‌లైన్‌లో మీమ్‌లు - ‘పవర్ రాలేదా పుష్పా’

    పుష్ప మీమ్

    ఫొటో సోర్స్, INSTA/MEMER_OCCHADU_ROI

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం మీద ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఆదివారం పరిశ్రమలు మూతవేయాల్సి ఉండగా ఇక నుంచి మరో రోజు అదనంగా పవర్ హాలిడే అమలు చేయాల్సి ఉంటుంది.

    మరోవైపు విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మీమ్ పేజీల నుంచి సాధారణ ప్రజల వరకు పవర్ కట్‌పై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

    ‘అది పవర్ అనుకున్నారా.. రిబ్బన్ అనుకున్నారా.. అన్నిసార్లు ఎందుకు కట్ చేస్తున్నారు?’’ అని నమస్కారం బా అనే మీమ్ పేజీలో పవర్ కట్‌పై మీమ్ వేశారు.