ఫొటోలు: ప్రపంచంలోని అతిపెద్ద విమానం ధ్వంసమైపోయింది
ఆంటినోవ్ యాన్-225.. అనేక ప్రమాణాలను అనుసరించి ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద విమానంగా వెలుగొందిన ఆంటినోవ్ యాన్-225 రష్యా దాడుల్లో ముక్కలైపోయింది.
ఈ విమానాన్ని మ్రియా (కల) అని కూడా పిలుస్తారు.
కీయెవ్‌కు సమీపంలోని హాస్టమెల్ విమానాశ్రయంలో ధ్వంసమైపోయిన ఈ విమానం హ్యాంగర్‌లో నిర్జీవంగా పడి ఉంది.
ఈ విమానాన్ని పునరుద్ధరించడానికి 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 22,798 కోట్లు) ఖర్చు అవుతుందని యుక్రెయిన్ స్టేట్ డిఫెన్స్ కంపెనీ అంచనా వేసింది.
కాగా, రష్యా దళాలు ఈ విమానాశ్రయం నుంచి వెనుదిరిగాయి.
శనివారం ఈ విమానాశ్రయాన్ని బీబీసీ సందర్శించింది. హ్యాంగర్‌లో ఉన్న విమానం ముక్కలను స్వయంగా చూసింది.