బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం దిల్లీలో జరిగింది. మీరాబాయి చానుకు ఈ అవార్డు లభించింది. కరణం మల్లీశ్వరికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, క్రికెటర్ షెఫాలీ వర్మకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు లభించాయి.

లైవ్ కవరేజీ

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు and ఆలమూరు సౌమ్య

  1. ఆస్కార్ 2022: విజేతలు వీరే..

    ఆస్కార్ 2022

    ఫొటో సోర్స్, AFP

    ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది లాస్ లాస్‌ ఏంజెలెస్‌‌లో ముగిసింది.

    94వ అకాడమీ విజేతలు వీరే..

    ఉత్తమ చిత్రం: కోడా

    ఉత్తమ నటి: జెస్సికా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్)

    ఉత్తమ నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)

    ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)

    ఉత్తమ సహయ నటి: అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)

    ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్ (కోడా)

    ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెన్నెత్ బ్రనాగ్ (బెల్‌ఫాస్ట్)

    ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: సియాన్ హెడర్ (కోడా)

    ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ఎన్‌కాంటో

    ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్

    ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: డ్రైవ్ మై కార్ (జపాన్)

    ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నో టైం టు డై (బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ'కానెల్)

    ఉత్తమ కాస్ట్యూం డిజైన్: జెన్నీ బేవన్ (క్యుయెల్లా)

    ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్)

    ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబెర్ట్, ట్రిస్తాన్ మైల్స్, బ్రియాన్ కానర్, గెర్డ్ నెఫ్‌జర్

  2. చెర్నిహివ్‌లో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పౌరులు

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ నగరం చెర్నిహివ్‌లో వేలాది పౌరులు చిక్కుకుపోయారు. నెలరోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్, మంచినీరు, విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

    చెర్నిహివ్ నగరం డెస్నా నది ఒడ్డున ఉంది. యుద్ధం తొలిదశలో రష్యా దాడికి గురైన నగరాల్లో ఇదీ ఒకటి. బెలారుస్ నుంచి కీయెవ్ చేరుకునే ప్రయత్నంలో రష్యా సైన్యం ఈ నగరంపై దాడి చేసింది.

    నగరం పూర్తిగా ధ్వంసం అయిపోలేదు కానీ, దేశంలోని ఇతర ప్రాంతాలతో కనక్షన్ దాదాపు కోల్పోయింది.

  3. యుక్రెయిన్-రష్యా యుద్ధం: తాజా పరిణామాలు

    సార్వభౌమాధికారానికే ప్రాధాన్యం అంటున్న జెలియెన్‌స్కీ: రష్యాతో తదుపరి రౌండ్ శాంతి చర్చల్లో సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకే యుక్రెయిన్ పెద్దపీట వేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఈ వారం టర్కీలో ముఖాముఖి చర్చలు జరగనున్నాయి.

    అలాగే, న్యూట్రల్ స్టేటస్‌పై చర్చలు జరిపేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత యుద్ధానికి ప్రధాన కారణం ఇదే.

    రష్యా ప్రభుత్వంలో మార్పు రావాలని చెప్పలేదన్న బైడెన్: "నో".. రష్యాలో ప్రభుత్వం మారాలన్నది మీ ఉద్దేశమా అని విలేఖరులు అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన సమాధానమది.

    శనివారం పోలండ్ రాజధాని వార్సాలో బైడెన్ ప్రసంగిస్తూ "పుతిన్ ఇక ఎంతమాత్రం అధికారంలో కొనసాగకూడదని" అన్నారు. అయితే, బైడెన్, రష్యా ప్రభుత్వంలో మార్పు కోసం పిలుపునివ్వలేదని, పొరుగు దేశాలపై పుతిన్ అధికారం చెలాయించేందుకు అనుమతించకూడదని మాత్రమే అన్నారని ఆ తరువాత వైట్ హౌస్ సంజాయిషీ ఇచ్చింది.

    రష్యా సైనిక దళాలను ఉపసంహరించుకుంటోంది అంటున్న యుక్రెయిన్: ఈ యుద్ధంలో భారీ నష్టాలను చవిచూడడంతో రష్యా, కీయెవ్ ప్రాంతం నుంచి తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటోందని యుక్రెయిన్ మిలటరీ జనరల్ స్టాఫ్ చెప్పింది.

    రెండు వ్యూహాత్మక బెటాలియన్ సమూహాలను యుక్రెయిన్ నుంచి వెనక్కు మరలించి మిత్రదేశమైన బెలారుస్‌కు తరలించిందని చెప్పింది. ఈ యూనిట్లు "గణనీయమైన నష్టాలను" చవిచూశాయని తెలిపింది.

    అదనంగా, రష్యా నుంచి యుక్రెయిన్‌కు తరలివస్తున్న సైన్యం యూనిట్ల తీవ్రతలో "గణనీయమైన తరుగుదల" కనిపిస్తోందని చెప్పింది.

    యుక్రెయిన్‌కు మద్దతిచ్చిన ఆస్కార్: ఆస్కార్ అవార్డుల వేదికపై హాలీవుడ్ నటులు యుక్రెయిన్ పక్షం వహించారు. యుక్రెయిన్ ప్రజలకు మద్దతు తెలిపేందుకు సెలబ్రిటీలు కొద్దిసేపు మౌనం పాటించారు.

  4. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    న్యూట్రల్ స్టేటస్‌పై చర్చలు జరిపేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ తెలిపారు.

    యుక్రెయిన్-రష్యా యుద్ధ వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ క్లిక్ చేయండి.