టీఆర్ఎస్: ‘తెలంగాణ వాళ్లను నూకలు తినమంటూ అవమానించారు’
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని, పైగా మమ్మల్ని నూకలు తినమంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ అవమానించారని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనకపోయినా మేం కొంటామంటూ బీజేపీ నేతలు తెలంగాణ రైతుల చేత వరి వేయించారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు ధాన్యం కొనమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు?
రా రైస్, పారా బాయిల్డ్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ అంటూ కొర్రీలు వేయకుండా పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వరి వేయొద్దని కేసీఆర్ రైతులకు స్పష్టంగా చెప్పినా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి రైతులను వరి వేయమంటూ రెచ్చగొట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.