రష్యా అణ్వాయుధాలు వాడితే ఎలా స్పందించాలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న అమెరికా
యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా, అణ్వాయుధాలు వాడితే ఏం చేయాలి అనేదానిపై అమెరికా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.
అణు, రసాయినిక, బయోలాజికల్ ఆయుధాలను రష్యా వాడితే ఎలా స్పందించాలి అనేదానిపై అమెరికా జాతీయ భద్రత సలహాదారుల బృందం వ్యూహాలు రచిస్తోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
‘టైగర్ టీం’ అని పిలిచే ఆ బృందం, యుక్రెయిన్ చుట్టుపక్కల ఉండే దేశాల భూభాగాల మీద కూడా రష్యా దాడులకు దిగితే తమ స్పందన ఎలా ఉండాలో కూడా వారు డ్రిల్స్ నిర్వహించినట్లు ఆ వెబ్‌సైట్ తెలిపింది.
యుక్రెయిన్ నుంచి వస్తున్న లక్షలాది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడంలో యూరోపియన్ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి వారికి సాయం చేసే విషయం మీద కూడా అమెరికా చర్చలు జరుపుతోంది.