చర్చించుకుందాం – జెలియన్‌స్కీ

ఫొటో సోర్స్, EPA
ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రష్యాతో అర్థవంతమైన శాంతి చర్చలు జరగాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ అన్నారు.
శనివారం ఈ చర్చలు జరగాలని ఆయన కోరారు.
శుక్రవారం రాత్రి ఆయన వీడియో సందేశం ఇస్తూ.. రష్యా తాను చేసుకున్న తప్పుల నుంచి బయటపడేందుకు, నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇదొక్కటే అవకాశమని అన్నారు.
‘‘కలిసేందుకు ఇదే సమయం, మాట్లాడుకునేందుకు ఇదే సమయం. భౌగోళిక సమగ్రతను పునరుద్ధరించేందుకు, యుక్రెయిన్‌కు న్యాయం చేసేందుకు ఇదే సమయం’’ అని జెలియన్‌స్కీ అన్నారు.
‘‘లేకపోతే రష్యా నష్టాలు ఎంతగా ఉంటాయంటే.. వాటి నుంచి తేరుకునేందుకు ఎన్నో తరాల సమయం పడుతుంది’’ అని హెచ్చరించారు.


