పవన్ కల్యాణ్: ‘బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తానంది.. వైసీపీని గద్దెదించే రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా’

బలమైన పార్టీని నడపడం అంటే వేలకోట్లు ఉండటం కాదని, సైద్ధాంతిక బలం ఉండాలని, ఆ సిద్ధాంతాలతో బతికే వ్యక్తులు ఉండాలని.. అలా 150 మందితో ప్రారంభమైన తమ పార్టీకి ఇప్పుడు 5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.

లైవ్ కవరేజీ

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, వరికూటి రామకృష్ణ

  1. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో విచారణ

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌, జీవోలు ఆర్టికల్-371డికి విరుద్ధంగా ఉన్నాయంటూ ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    తుది ప్రకటన వెలువడ లేదు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
  2. చైనా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్: రష్యాకు, యుక్రెయిన్‌కు సైనిక సాయం ఆపండి

    రష్యాకు, యుక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు సైనిక సాయం చేయకుండా చూడాలని పిలుపునిచ్చారు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ షిజిన్. ఇందుకోసం అమెరికా, చైనా తప్పనిసరిగా ఒక ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రష్యాకు చైనా సాయం అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో హూ షిజిన్ ఇలా ట్వీట్ చేశారు. యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా, చైనాను సైనిక సాయం కోరినట్లు అమెరికా ఆరోపిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. అమెరికా: రష్యాకు చైనా సాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    చైనాను రష్యా సాయం కోరినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా స్పందించినట్లుగా తెలుస్తోంది. రష్యాకు సాయం చేస్తే తీవ్రమైన పరిణామాలను చైనా చవి చూడాల్సి ఉంటుందంటూ అమెరికా హెచ్చరించిందని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే చైనాను రష్యా సాయం కోరిందనే వార్తలపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది అమెరికాలోని చైనా ఎంబసీ. నేడు రోమ్ వేదికగా అమెరికా, చైనా ఉన్నతాధికారుల మధ్య సమావేశం జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. యుక్రెయిన్ మీద రష్యా దాడికి పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తోంది చైనా.

  4. రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతున్న యుక్రెయిన్ టీనేజర్లు

    యుక్రెయిన్ యుద్ధంలో టీనేజర్లు

    రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పోరాడేందుకు యుక్రెయిన్ యువత సిద్ధమవుతోంది.

    స్వచ్ఛందంగానే తాము ముందుకొస్తున్నట్లు చాలా మంది చెబుతున్నారు.

    వారిలో ఎక్కువ మందిటీనేజ్ దాటినవారు. మూడురోజుల బేసిక్ ట్రైనింగ్ తరువాత సరిహద్దులకువెళ్లాలన్నది వారి లక్ష్యం.

    ‘నేను వారంలో ఒకసైనికునిగా మారతాననడంలో సందేహంలేదు.’ అని 19 ఏళ్ల బయాలజీ విద్యార్థి మాక్సిమ్ టున్నాడు.

    ఐదేళ్లు స్కౌట్స్‌లో ఉన్న మాక్సిమ్ చిన్నచిన్న నైపుణ్యాలతోపాటు ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాడు. మాక్సిమ్‌తో పాటు తన స్నేహితుడు 18 ఏళ్ల దిమిత్రో కిసిలెంకో సైన్యంలోచేరారు.

  5. యుక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించిన బైడెన్, మేక్రాన్

    బైడెన్, మేక్రాన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంభాషించారు.

    యుక్రెయిన్‌పై దాడికి పూర్తి బాధ్యత రష్యాదేనని తేల్చిన ఇద్దరు నేతలు.. యుక్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

    మరోవైపు ఆదివారం యవోవివ్ సైనిక స్థావరంపై రష్యా రాకెట్ దాడులు చేసింది.

    ఈ దాడుల్లో తొమ్మిది మంది చనిపోగా మరో 57 మంది గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది.

    నో ఫ్లై జోన్‌ ప్రకటించాలంటూ నాటో దేశాల నేతలపైనా యుక్రెయిన్ అద్యక్షుడు జెలియెన్‌స్కీ ఒత్తిడి పెంచుతున్నారు.

  6. చైనా నుంచి రష్యా ఆయుధ, ఆర్థిక సహకారం కోరుతోంది: అమెరికా

    జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా తనకు ఆయుధ, ఆర్థిక సహాయం అందించాలని చైనాను కోరిందని ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కథనాలు వెల్లడించాయి.

    అమెరికాకు చెందిన కొందరు సీనియర్ అధికారులను ఉటంకిస్తూ ఈ కథనాలు వెలువడ్డాయి.

    అయితే రష్యా ఎలాంటి ఆయుధాలను కోరిందనేది మాత్రం అమెరికాకు చెందిన ఆ అధికారులు స్పష్టం చేయలేదు.

    రష్యా అభ్యర్థన మేరకు చైనా కూడా సహకారం అందించేందుకు సిద్ధమవుతోందని ఈ కథనాలు పేర్కొన్నాయి.

    మరోవైపు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీచీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ సమావేశం కానున్నారు.

    సోమవారం వీరిద్దరి మధ్య రోమ్‌లో భేటీ ఉండొచ్చు.

    చైనా కానీ, మరే ఇతర దేశం కానీ ఆంక్షల కారణంగా రష్యా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను భర్తీ చేయలేవని సులివాన్ అన్నారు.

  7. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది.

    తనకు ఆయుధ, ఆర్థిక సహకారం అందించాలని రష్యా చైనాను కోరిందని అమెరికా చెబుతోంది.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.