సీడబ్ల్యుసీ భేటీ: నాయకత్వ మార్పుల్లేవ్.. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకూ సిద్ధం – కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది. ఏఐసీసీ మధ్యంతర అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యుసీ సభ్యులు హాజరయ్యారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, అరుణ్ శాండిల్య

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడి: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..

    పోలండ్‌ సరిహద్దు వద్ద ఉన్న తమ యవోవివ్ సైనిక స్థావరంపై రష్యా క్షిపణులతో దాడి చేసిందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.

    యవోవివ్ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా చేసిన దాడుల్లో 35 మంది చనిపోయారని, మరో 134 మంది గాయపడ్డారని యుక్రెయిన్ వెల్లడించింది.

    యుక్రెయిన్‌లో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యుక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పోలండ్‌కు తరలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

    ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్‌. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  2. ఆశ్రయం ఇస్తే నెలకు 35వేలు.. బ్రిటన్ బంపర్‌ ఆఫర్

    బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

    ఆశ్రయం కల్పిస్తే నెలకు 35వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

  3. కాంగ్రెస్ పార్టీ వరుస వైఫల్యాలకు 5 కారణాలు

    సోనియా గాంధీ

    ఫొటో సోర్స్, twitter/INCIndia

    'కాంగ్రెస్ ముక్త భారత్' అంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశానికి విముక్తి కల్పించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదేపదే చెబుతుంటుంది.

    వాస్తవానికి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగే నాటికి నాలుగు రాష్ట్రాలు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారంలో ఉంది. దానిని కోల్పోయింది. సాధారణంగా చూస్తే ఇదేమంత పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. కానీ, రాజకీయంగా మాత్రం దీనికి ఉన్న ప్రాధాన్యం, దీని ప్రభావం వేరు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల వ్యూహాలకు ఎలా మెరుగులు దిద్దుకుంటోంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకబడుతోంది అనేది పరిశీలించాల్సిన విషయం.

    కొన్ని దశాబ్దాల పాటు దేశంలో మెజార్టీ ప్రాంతాల్లో దిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని రాజకీయ పదవులనూ అనుభవించింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు ఎందుకు తన ప్రాభవాన్ని కోల్పోతోంది? 'కాంగ్రెస్ ముక్త భారత్' అన్న బీజేపీ నినాదం నిజమవుతుందా? కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితికి సంబంధించి తెలుసుకోవాల్సిన 5 అంశాలు ఇవీ..

  4. సీడబ్ల్యుసీ భేటీ: నాయకత్వ మార్పుల్లేవ్.. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకూ సిద్ధం – కాంగ్రెస్ పార్టీ

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

    ఫొటో సోర్స్, twitter/INCIndia

    కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది.

    ఏఐసీసీ మధ్యంతర అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యుసీ సభ్యులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తారని, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు జరిగాయి.

    అయితే, ఎవ్వరూ రాజీనామాలు చేయలేదని, నాయకత్వ మార్పులు కూడా ఏమీ లేవని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధులు కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.

    2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు సహా ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ప్రకటించారు. సోనియా గాంధీ నాయకత్వంపై సీడబ్ల్యుసీ ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించిందని, పార్టీని ముందుకు నడపాలని ఆమెనే కోరిందని ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కాగా, పార్టీ కోరితే తాము ముగ్గురం (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) రాజీనామాలు చేసేందుకు సిద్ధం అని సమావేశంలో సోనియాగాంధీ చెప్పారని, దీనికి పార్టీ నాయకులు అంగీకరించలేదని విశ్వసనీయ వర్గాలను కోట్ చేస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. దిల్లీలో యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని మోదీతో భేటీ

    మోదీతో యోగి

    ఫొటో సోర్స్, twitter/narendramodi

    ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలుపొందిన యోగి ఆదిత్యనాథ్ ఆదివారం దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

    ఈ సందర్భంగా ఆదిత్యనాథ్‌ను ప్రధాని అభినందిస్తూ.. చారిత్రాత్మక విజయం సాధించారని కొనియాడారు. రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తారని కితాబునిచ్చారు.

    గత ఐదేళ్లుగా యోగి ఆదిత్యనాథ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తీరికలేకుండా కష్టపడ్డారని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కాగా, మోదీ మార్గదర్శకత్వానికి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు.

    ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లను కూడా ఆదిత్యనాథ్ కలిశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. మరియుపూల్‌కు సహాయం అందేలా చూడడం అన్నింటికంటే ముఖ్యం: జెలియెన్‌స్కీ

    రష్యా సైన్యం ముట్టడించిన మరియుపూల్‌ నగరానికి అవసరమైన సహాయాన్ని చేరవేయడం తమ ముందున్న అత్యంత ముఖ్యమైన పని అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.

    మానవతాసాయం తీసుకొస్తున్న కాన్వాయ్ నగరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉందని అన్నారు.

    కానీ మరియుపూల్‌ నగరంపై రష్యా నిరంతరం దాడులు చేస్తోందని ఆయన తెలిపారు.

    మరియుపూల్

    ఫొటో సోర్స్, National Police of Ukraine/Reuters

    ఫొటో క్యాప్షన్, రష్యా బాంబు దాడులతో మరియుపూల్‌లో ఏర్పడిన గొయ్యి
  7. రష్యాలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు, పోలీసుల అదుపులో జర్నలిస్టులు, పలువురు ఆందోళనకారులు

    రష్యా సహా పలుదేశాల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపడుతున్నారు.

    యుక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా ఆందోళనలు చేపట్టాలని రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ పిలుపు ఇచ్చారు.

    రష్యా నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాలోని పలు నగరాల్లో కొందరు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

    మాస్కోలో నిరసన తెలిపిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 12 మంది జర్నలిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

    జర్నలిస్టులు

    ఫొటో సోర్స్, Paper

    ఫొటో క్యాప్షన్, జర్నలిస్టులు
  8. బ్రేకింగ్ న్యూస్, రష్యా సైన్యం మరో మేయర్‌ను అపహరించింది: యుక్రెయిన్ విదేశాంగ మంత్రి

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Yevhen Matveyev/Facebook

    ఫొటో క్యాప్షన్, నీప్రోరుడ్నె మేయర్‌ మట్వెయేవ్‌

    రష్యా సైన్యం నీప్రోరుడ్నె మేయర్‌ను అపహరించిందని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా చెప్పారు.

    కీలక నగరాల్లోకి చొచ్చుకొస్తున్న రష్యా సైన్యం గత మూడు రోజుల్లో ఇద్దరు యుక్రెయిన్ మేయర్లను అపహరించిందని అన్నారు. శుక్రవారం మెలిటొపోల్ మేయర్‌ను అదుపులోకి తీసుకుందని తెలిపారు.

    ‘రష్యా యుద్ధ నేరస్థులు’ నీప్రోరుడ్నె మేయర్‌ మట్వెయేవ్‌ను అపహరించారని కులేబా చెప్పారు.

  9. డే 18: రష్యా, యుక్రెయిన్ మధ్య పోరాటం ఎక్కడ జరుగుతోంది?

    యుక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది.

    రష్యా బలగాలు యుక్రెయిన్‌లో ఎక్కడి వరకు చొచ్చుకొచ్చాయి?

    రష్యా అధీనంలో ఉన్న యుక్రెయిన్ భూభాగాన్ని ఈ మ్యాప్‌లో చూడండి.

    యుక్రెయిన్
  10. రష్యాను రష్యన్లే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

    రష్యాలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

    పలు నగరాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

    రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రష్యన్లు ఎందుకు నిరసన పదర్శనలు నిర్వహిస్తున్నారు?

    వారు ఏమంటున్నారు? ఈ వీడియోలో చూడండి.

  11. యుక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ పోలండ్‌కు తరలింపు

    యుక్రెయిన్‌లో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యుక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పోలండ్‌కు తరలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్‌: యవోవివ్ సైనిక స్థావరంపై రష్యా దాడుల్లో 35 మంది మృతి

    యవోవివ్ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా చేసిన దాడుల్లో 35 మంది చనిపోయారని యుక్రెయిన్ వెల్లడించింది. మరో 134 మంది గాయపడ్డారని తెలిపింది.

  13. రష్యాపై ఆంక్షలు ఆ దేశ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?

    రష్యాపై ఆంక్షలు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ మీద దాడితో అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి.

    విదేశీ కంపెనీలు, ఆర్థిక సంస్థలతోపాటూ, పెట్టుబడిదారులు కూడా రష్యా నుంచి వెనక్కు వస్తున్నారు. ఆ దేశాన్ని పాశ్యాత్య ప్రపంచం నుంచి విడగొట్టారు.

    ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ మెక్ డొనాల్డ్స్, గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ లాంటివి అక్కడ తమ కార్యకలాపాలను రద్దు చేశాయి.

    వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆ దేశం నుంచి బయటికొచ్చేశాయి. రష్యా కరెన్సీ రూబుల్ పతనంతో పెరుగుతున్న ఆహారం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం కష్టంగా మారింది.

    అయితే, ఇప్పుడు రష్యన్లు ఏం చేస్తారు?

    ఇప్పటివరకూ వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకోడానికి బీబీసీ కొంతమంది రష్యన్లతో మాట్లాడింది.

  14. బ్రేకింగ్ న్యూస్, యవోవివ్ సైనిక స్థావరంపై రష్యా దాడుల్లో తొమ్మిది మంది మృతి: యుక్రెయిన్

    అంబులెన్సులు

    ఫొటో సోర్స్, Getty Images

    యవోవివ్ సైనిక స్థావరంపై రష్యా చేసిన రాకెట్ దాడుల్లో తొమ్మిది మంది చనిపోయారని యుక్రెయిన్ వెల్లడించింది. మరో 57 మంది గాయపడ్డారని తెలిపింది.

    సైనిక స్థావరంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు.

    యవోవిన్ సైనిక స్థావరంపై రష్యా 30 రాకెట్లను ప్రయోగించిందని ఆయన వెల్లడించారు.

    చాలా అంబులెన్సులు సైనిక స్థావరానికి వెళ్లడం కనిపించింది.

  15. లివ్యూ మిలటరీ గ్రౌండ్‌పై 8 క్షిపణులు ప్రయోగించిన రష్యా

    లివ్యూలోని ఇంటర్నేషనల్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్‌పై రష్యా వైమానిక దాడులు జరిపిందని, ఎనిమిది మిసైళ్లు ప్రయోగించిందని సైనికాధికారులు తెలిపారు.

    లివ్యూకి 30 కిలోమీటర్ల దూరంలో యావోరివ్ జిల్లాలో ఈ కేంద్రం ఉంది. ఇది మిలటరీ ట్రైనింగ్ గ్రౌండ్.

    రష్యా దాడులతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

    రష్యా దాడులను లివ్యూ మేయర్ ధ్రువీకరించినట్లు బజ్‌ఫీడ్ కరెస్పాండెంట్ క్రిస్టొఫర్ మిల్లర్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. రష్యా జీవఆయుధాలను సిద్ధం చేస్తోందా? ఇంతకీ ఏమిటీ జీవ ఆయుధాలు

    జీవ ఆయుధాలు

    ఫొటో సోర్స్, Getty Images

    జీవ ఆయుధాలు తయారు చేసేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన రష్యా తమ వాదన గురించి చర్చించేందుకు శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రత్యేక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

    యుక్రెయిన్, అమెరికా వీటిని తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశాయి. యుక్రెయిన్‌లోని నగరాలపై రసాయన ఆయుధాలు ఉపయోగించడాన్ని సమర్థించుకునే ఉద్దేశంతోనే రష్యా ఈ వాదన వినిపిస్తోందని అన్నాయి.

    యుక్రెయిన్‌కు చట్టబద్ధమైన లేబొరేటరీలు ఉన్నాయి. కోవిడ్ లాంటి వ్యాధుల నుంచి జనాభాను కాపాడేందుకు అక్కడ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుంటారని ఆ ప్రభుత్వం చెబుతోంది.

    ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుండడంతో ఆ దేశంలోని ప్రయోగశాలల్లో అలాంటి ప్రమాదకరమైన వ్యాధికారకాలు ఏవైనా ఉంటే నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యుక్రెయిన్‌కు సూచించింది.

    అయితే, అసలు రసాయన ఆయుధాలు అంటే ఏంటి, అవి జీవ ఆయుధాలకంటే భిన్నంగా ఉంటాయా..

  17. మా సామర్థ్యానికి మించి శరణార్థులు వస్తున్నారు: మోల్డోవా

    శరణార్థులు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ శరణార్థులతో పొరుగుదేశం మోల్డోవా నిండిపోతోంది. ఆశ్రయం ఇవ్వడానికి తమకు ఉన్న సామర్థ్యాన్ని మించి శరణార్థులు వస్తున్నారని మాల్దోవా విదేశీ వ్యవహారాల మంత్రి నికు పాపెస్కు ‘బీబీసీ’తో చెప్పారు.

    శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి భవనాలు కూడా అందుబాటులో లేని పరిస్థితికి చేరుతున్నామని, వారికి శీతల వాతావరణం నుంచి రక్షణ కల్పించే అవకాశాలు కూడా లేవని ఆయన హెచ్చరించారు.

    యుక్రెయిన్ పొరుగు దేశాలలో దుర్బలమైనది మోల్డోవాయేనని.. ఆర్థిక వనరులు, హెల్త్ కేర్, భద్రత తగినంతగా లేవని ఆయన చెప్పారు.

  18. ఖెర్సాన్‌ యుక్రెయిన్‌లోనే ఉంటుందని తీర్మానం

    పోలాండ్ జెండా

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరం యుక్రెయిన్‌లోనే ఉండాలని తీర్మానించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

    ఖెర్సాన్ పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పాటు కోసం రష్యా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే యోచనలో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఖెర్సాన్ కౌన్సిల్ ఈ తీర్మానంపై ఓటింగ్ చేపట్టింది.

    ఖెర్సాన్ యుక్రెయిన్‌దేనంటూ చేసిన తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించిందని ఈ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ యూరీ సొబో లెవ్‌స్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    ‘‘ఖెర్సాన్ ఇంతకుముందు, ఇప్పుడు, భవిష్యత్‌లో కూడా యుక్రెయిన్‌లో భాగమే’’ అని ఆయన పేర్కొన్నారు.

  19. యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచానికంతటికీ ముప్పే: కమల హారిస్

    కమలా హారిస్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రజాస్వామ్యానికి, యూరప్ దేశాల భద్రతకు ముప్పు కలిగిస్తుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అన్నారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఎక్కడైనా ముప్పు ఏర్పడినప్పుడు అది అందరికీ ముప్పుగా పరిణమిస్తుంది’’ అని హారిస్ అన్నారు.

    పోలాండ్, రొమేనియాలను సందర్శించి వచ్చిన డెమొక్రాట్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    యుక్రెయిన్‌కు అమెరికా బలగాలను పంపించాలంటూ బైడెన్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉంది. అయితే, రష్యాతో ప్రత్యక్షంగా తలపడే ఉద్దేశం తమకు లేదని బైడెన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

    అమెరికా నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ యుక్రెయిన్‌ గగనతలాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌కు 45 శాతం మంది అమెరికా ప్రజల నుంచి మద్దతు లభించినట్లు పోల్స్ చెబుతున్నాయి.

  20. మానవతా సహాయం చేరడంలో అడుగడుగునా ఆటంకాలు

    యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Getty Images

    పౌరులను తరలించడానికి వెళ్తున్న బస్సులు వివిధ యుక్రెయిన్ నగరాలను చేరుకుంటున్నాయి.

    మానవతా సహాయం అందించడానికి వెళ్తున్న వాహనాలు కూడా యుద్ధ పీడిత యుక్రెయిన్ నగరాలను చేరుకుంటున్నాయి.

    అయితే, హ్యుమేనిటేరియన్ ఎయిడ్‌తో మరియుపూల్ వెళ్తున్న వాహనాలు అక్కడికి చేరుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

    జేపరోజియా నుంచి హ్యుమేనిటేరియన్ ఎయిడ్‌తో వస్తున్న వాహనాలు ఇంకా మరియుపూల్ చేరుకోలేదని ఆ నగర డిప్యూటీ మేయర్ షెర్హీ ఓర్లావ్ తెలిపారు.

    జేపరోజియా నుంచి మరియుపూల్ చేరడానికి సాధారణంగా 3 గంటల సమయం పడుతుంది. కానీ, ఈ వాహనాలు సుమారు 10 గంటల కిందటే జేపరోజియాలో బయలుదేరినా మరియుపూల్ చేరుకోలేదు.

    హ్యుమేనిటేరియన్ ఎయిడ్‌తో వస్తున్న వాహనాల నుంచి ఆహారాన్ని రష్యా దళాలు దోచుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆర్లావ్ ఈ ఆరోపణలను ధ్రువీకరించలేదు.

    మానవతా సహాయం చేరవేస్తున్న వాహనాలపై పెరెమోహా సమీపంలో రష్యా సైనికులు కాల్పులు జరిపారని, ఈ కాల్పులలో ఏడుగురు చనిపోయారని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు.