ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, జీవోలు ఆర్టికల్-371డికి విరుద్ధంగా ఉన్నాయంటూ ముగ్గురు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తుది ప్రకటన వెలువడ లేదు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.